E-Paper
Advertisement

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?
Advertisement

Inzamam ul Haq On IND VS NZ:  టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ (Team India vs. Pakistan) మధ్య హామీల్టన్ (Seddon Park, Hamilton) వేదికగా జరగాల్సిన మూడో వ‌న్డే వర్షార్పణమే అయింది. ఉదయం నుంచి హామీల్టన్ లో భారీ వర్షం పడటంతో టాస్ ఆలస్యంగా వేశారు. దీంతో టాస్ గెలిచిన భారత్ మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో ఓవ‌ర్లు కుదించినా, మళ్లీ వర్షం అంత‌రాయం క‌లిగించింది. దీంతో చేసేదేమీ లేక‌ మ్యాచ్ పూర్తిగా రద్దు చేయాలని అంపైర్లు నిర్ణయం తీసుకున్నారు. మూడో వన్డే రద్దు కావడంతో ఈ సిరీస్ భారత జట్టు కోల్పోయే ఛాన్సే లేదు. ఇప్పటికే రెండు మ్యాచ్ లు గెలిచి ఆధిక్యంలో ఉన్న భారత్.. మరో మ్యాచ్ గెలిస్తే సిరీస్ కైవసం చేసుకుంటుంది. వరుసగా రెండు ఓడిపోయిన టీమ్ ఇండియాకు పెద్ద నష్టం ఉండదు.

భారీ వ‌ర్షంతో మూడో వ‌న్డే ర‌ద్దు..టీమిండియా, కివీస్ సిరీస్ పై విచార‌ణ చేయాలంటూ?

కివీస్ గడ్డపై జరుగుతున్న ఈ వ‌న్డే సిరీస్ నేపథ్యంలో ప్రతి మ్యాచ్ కు వర్షం విలన్ గా మారడంపై పాకిస్తాన్ మాజీ కెప్టెన్ ఇంజమామ్ ఉల్ హ‌క్ (Inzamam ul Haq On IND VS NZ) వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. ప్రతి మ్యాచ్ కు వర్షం పడటం వెనక కుట్రలు ఉన్నాయని తనకు అనుమానాలు వస్తున్నట్టు బాంబు పేల్చాడు. భారత జట్టు వన్డే సిరీస్ గెలిచేలా ఏదైనా ప్లాన్స్ చేస్తున్నారా? అనే డౌట్స్ తనకు వస్తున్నట్టు వ్యాఖ్యానించాడు. క్రికెట్ చరిత్రలో వరుసగా మూడు మ్యాచ్ ల‌కు వర్షం అంతరాయం ఎప్పుడు కలిగించలేదని, ఇదే తొలిసారి అంటూ గుర్తు చేశాడు.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

అందుకే తనకు ఈ సిరీస్ ఆరంభం నుంచి బీసీసీఐపై అనుమానాలు ఉన్నాయని తెలిపాడు. ఏదైనా చేసే శక్తి బీసీసీఐ దగ్గర ఉందని.. కివీస్ క్రికెట్ బోర్డును కొనుగోలు చేసైనా సిరీస్ సొంతం చేసుకుంటారని ఆగ్రహించాడు. ఐసీసీ వెంటనే టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన టి20 అలాగే ఈ వన్డే సిరీస్ లపై విచారణ చేయాలని తన కుట్ర కోణాన్ని బయటపెట్టారు. దీంతో ఇంజ‌మామ్ చేసిన వ్యాఖ్య‌లు దుమారం రేపుతున్నాయి. ఇది ఇలా ఉండగా టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య ఇప్పటికే ఐదు మ్యాచ్ టి20 సిరీస్ ఫినిష్ అయింది. ఇందులో అద్భుతంగా రాణించిన టీమిండియా 3-2 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. అటు గెలిచింది. మూడవ వన్డే నవంబర్ 13వ తేదీన బే ఓవల్ వేదికగా జరగనుంది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Related News

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయ‌ర్ల‌కు PKR 15,000 రివార్డు

ఐపీఎల్ లో మరో రెండు కొత్త జట్లు…బీసీసీఐకి రూ.16,600 కోట్ల లాభం?

శ‌భాష్ కావ్య‌… ఆమె దెబ్బ‌కు చెన్నై, ఢిల్లీ జ‌ట్లు స‌గం చ‌చ్చిపోయాయి

వైభ‌వ్ కార‌ణంగా య‌శ‌స్వి జైస్వాల్ ను ఓ పిచ్చికుక్కలా రాజ‌స్థాన్ చూస్తోంది!

హార్దిక్ పాండ్యా అడుగే దరిద్రం…పంజాబ్ కింగ్స్ ప్లేయర్లు తన్నుకు చావడం గ్యారెంటీ!

సెహ్వాగ్ లాగానే కొడుకు ఆర్యవీర్ కూడా కుంభకర్ణుడే…కదలరు, మెదలరు

టీమిండియాను ఓడించిన పాకిస్తాన్ ప్లేయర్లకు స్కూటర్లు.. షాహిద్ అఫ్రిది బంపర్ ఆఫర్!

Big Stories

Advertisement
×