E-Paper
Advertisement

టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?

టయోటా ఫార్చ్యూనర్ ధరలు భారీగా పెంపు.. ఏ వేరియంట్‌పై ఎంత పెరిగిందంటే?
Advertisement

Toyota Fortuner Legender Price Hike: టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే, మీకు ఓ కీలక అప్‌ డేట్. టయోటా కిర్లోస్కర్ మోటార్ (TKM) తన కార్ల ధరలను తాజాగా పెంచింది. ఇందులో భాగంగా ప్రముఖ ప్రీమియం SUV ఫార్చ్యూనర్ లెజెండర్ ధరలు కూడా పెరిగాయి. వేరియంట్‌ను బట్టి ఈ పెంపు రూ.43,000 నుంచి రూ.48,000 వరకు ఉంది. కొత్త ధరలు వెంటనే అమల్లోకి వచ్చినట్లు కంపెనీ ప్రకటించింది. ఇటీవల ఇన్నోవా క్రిస్టా ధరలను కూడా టయోటా పెంచింది. ఇప్పుడు ఫార్చ్యూనర్ లెజెండర్ కొనుగోలుదారులపై కూడా ధరల పెంపు ప్రభావం పడింది.

టాప్ వేరియంట్‌పై రూ.48,000 పెంపు

ఫార్చ్యూనర్ లెజెండర్ శ్రేణిలో ఎక్కువ ధర కలిగిన 4×4 మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ AT డ్యూయల్ టోన్ వేరియంట్‌పై అత్యధికంగా రూ.48,000 పెరిగింది. ఈ మార్పుతో టాప్ ఎండ్ మోడల్ కొనుగోలు చేయాలనుకునే వారు గతంతో పోలిస్తే అదనంగా ఈ మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. అలాగే 4×4 డీజిల్ MT డ్యూయల్ టోన్ వేరియంట్ ధరను టయోటా రూ.45,000 పెంచింది. ఈ వేరియంట్‌ను ఎంచుకునే కస్టమర్లకు కూడా కొత్త ధరలు వర్తిస్తాయి.

బేస్ వేరియంట్ ధర కూడా పెరిగింది!

Advertisement

ఫార్చ్యూనర్ లెజెండర్ ఎంట్రీ లెవల్ వేరియంట్ అయిన 4×2 డీజిల్ AT డ్యూయల్ టోన్ ధర కూడా పెరిగింది. ఈ మోడల్‌పై టయోటా రూ.43,000 అదనంగా వసూలు చేయనుంది. అంటే తక్కువ ధరలో లెజెండర్ కొనుగోలు చేయాలనుకునే వారికి కూడా ఈ ధరల పెంపు తప్పదు.

ఇప్పుడు కొత్త ధరలు ఎలా ఉన్నాయంటే?   

తాజా ధరల పెంపు తర్వాత టయోటా ఫార్చ్యూనర్ లెజెండర్ ఎక్స్‌ షోరూమ్ ధరలు రూ.43.35 లక్షల నుంచి రూ.48.77 లక్షల మధ్య ఉన్నాయి. వేరియంట్‌ను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. ఫార్చ్యూనర్ లెజెండర్ కొనుగోలు చేయాలనుకునే వారు ఇప్పుడు గతంలో కంటే ఎక్కువ మొత్తాన్ని వెచ్చించాల్సి ఉంటుంది. ముఖ్యంగా టాప్ ఎండ్ 4×4 మైల్డ్ హైబ్రిడ్ డీజిల్ ఆటోమేటిక్ వేరియంట్ కొనుగోలుదారులపై ఈ ధరల పెంపు ప్రభావం ఎక్కువగా ఉండనుంది.

Advertisement

Read Also: వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. టిగువాన్‌పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

Tags

Related News

టీవీఎస్ ఎన్‌టార్క్ 150కు కొత్త లుక్.. స్పెక్ట్రల్ గ్రీన్ కలర్ భలే ఉంది భయ్యా!

వోక్స్‌ వ్యాగన్ కార్లపై భారీ డిస్కౌంట్లు.. టిగువాన్‌పై ఏకంగా రూ.6 లక్షల తగ్గింపు!

అక్టోబర్ EV సేల్స్ రిపోర్ట్ వచ్చేసింది.. టాప్ 5 కంపెనీల్లో ఎవరు ముందున్నారు?

భారత్‌లోకి BYD లగ్జరీ ఎలక్ట్రిక్ MPV.. తొలిసారిగా కనిపించిన డెంజా D9!

ఏథర్ సరికొత్త రికార్డు.. ఒకే ఏడాదిలో 3 లక్షల స్కూటర్ల అమ్మకాలు!

టాటా కార్లపై నవంబర్ ఆఫర్లు.. సియెర్రాపై ఏకంగా రూ.1.15 లక్షల తగ్గింపు!

రోల్స్ రాయిస్‌ ను తలదన్నేలా BYD కొత్త లగ్జరీ కారు.. సింగిల్ ఛార్జ్ తో 1,000 కి.మీ రేంజ్!

Big Stories

Advertisement
×