E-Paper
Advertisement

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!

వైసీపీకి బిగ్ షాక్.. రాజీనామా చేసిన అన్నపరెడ్డి.. జగన్ తీరుపై తీవ్ర విమర్శలు!
Advertisement

Vijayabhaskar Reddy: విజయవాడ రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన సీనియర్ నేత అన్నపరెడ్డి విజయభాస్కర్ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. శుక్రవారం ఆయన తన రాజీనామాను ప్రకటిస్తూ.. పార్టీ అధినాయకత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

గుర్తింపు లేని చోట ఉండలేం

Advertisement

రాజీనామా అనంతరం మాట్లాడిన అన్నపరెడ్డి, వైసీపీలో ఉన్న నాయకులకు, కష్టపడే కార్యకర్తలకు ఎలాంటి గుర్తింపు లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అసలు పార్టీలో ఎవరికీ అధికారిక సభ్యత్వాలే ఉండవని, సంతకాలు కూడా లేని లెటర్ ప్యాడ్లపై పదవులు ఇస్తూ ఊరడిస్తుంటారని విమర్శించారు. ప్రజలు తనపై ఉంచిన నమ్మకాన్ని జగన్ పూర్తిగా ఒమ్ము చేశారని దుయ్యబట్టారు.

సొంత నేతలే కూటమికి సాయం చేశారు

Advertisement

గత ఎన్నికల్లో వైసీపీ ఓటమికి పార్టీలోని అంతర్గత విభేదాలే కారణమని ఆయన బాంబు పేల్చారు. విజయవాడలో వంగవీటి రాధాకృష్ణ గెలుపునకు, గుంటూరులో కూటమి అభ్యర్థుల విజయానికి వైసీపీలోని కొందరు సీనియర్ నేతలే వెనకుండి పనిచేశారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

భవిష్యత్తు కార్యాచరణ

జగన్ వైఖరి వల్ల గతంలో లబ్ధి పొందిన వారు కూడా ఇప్పుడు ఆయన వెంట లేరని, రాష్ట్రంలో కూటమి ఐక్యంగా ఉన్నంత కాలం జగన్ మళ్లీ అధికారంలోకి రావడం అసాధ్యమని స్పష్టం చేశారు. త్వరలోనే విజయసాయి రెడ్డి పెట్టబోయే కొత్త పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించి, తదుపరి రాజకీయ ప్రయాణంపై స్పష్టత ఇచ్చారు.

Also Read: రేవంత్ రెడ్డి సైలెంట్ వార్నింగ్స్.. అయినా తగ్గని హస్తం నేతల రచ్చ!

Tags

Related News

ఏపీ రాజకీయాల్లో న్యూ ట్రెండ్.. పవన్ విడాకులు అంశం, బాబు-జగన్ సీరియస్ వార్నింగ్!

40 ఏళ్ల రాజకీయంలో ఒక్క మంచి పని చేశావా? అనంత వెంకట్రామిరెడ్డిపై జేసీ ఆగ్రహం

పవన్ కళ్యాణ్ డైవోర్స్ వ్యవహారం.. జ్యోతిష్యుడు వేణుస్వామి పాత వీడియో వైరల్, మేటరేంటి?

ప్రకాశం జిల్లాలో ప్రైవేట్ బస్సు దగ్ధం.. డ్రైవర్ చాకచక్యంతో 33 మంది సేఫ్!

చిత్తూరులో దారుణం.. ఇచ్చిన డబ్బులు అడిగినందుకు కారుతో గుద్ది దారుణ హత్య!

పులివెందులలో టీడీపీ రిగ్గింగ్ వీడియోలు.. బయటపెట్టిన మాజీ మంత్రి పేర్ని నాని!

కన్నీటి సంద్రంలో కోనసీమ రైతన్నలు.. ఇంకా అందని ప్రభుత్వ పరిహారం!

Big Stories

Advertisement
×