E-Paper
Advertisement

బోల్డ్ సినిమాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా?..ఎస్తర్ ఓపెన్ టాక్!

బోల్డ్ సినిమాలు ఎందుకు చేస్తున్నానో తెలుసా?..ఎస్తర్ ఓపెన్ టాక్!
Advertisement

Ester Noronha:వెయ్యి అబద్దాలు సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచమైన ఎస్తర్ నిరోషా ఈ మధ్యే విడుదలైన ఎల్‌జీబీటీ – ఎ లీగల్ బ్యాటిల్ అనే సినిమాలో కీలకపాత్రలో కనిపించింది.ఇక ఈ క్రమంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఎస్తేర్ తన కెరీర్ గురించి తను ఎంచుకునే పాత్రల పట్ల పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చింది.

తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం

ఎస్తర్ మాట్లాడుతూ తానూ నటిగానే కాకుండా సింగర్, డైరెక్టర్, మల్టీలింగ్వల్ ఆర్టిస్ట్‌గా కూడా తనను తాను ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నాని తెలిపింది. అయితే ఇప్పుడు తనకు యాక్టింగ్‌పై మరింత ఇంట్రెస్ట్ పెరిగిందని నటన తనకు కొత్త విషయాలను నేర్చుకునే అవకాశం ఇస్తోందని, కొత్త వ్యక్తులను కలవడం నుంచి తనలోని కొత్త టాలెంట్స్‌ను గుర్తించడం వరకు యాక్టింగ్ చాలా విషయాలు నేర్పిస్తోందని చెప్పుకొచ్చింది ఎస్తర్.

Advertisement

ఇక తనకు నచ్చిన పాత్ర కోసం కేవలం అది అందంగా కనిపిస్తుందా? అనే లెక్కలు వేసుకోనని , మనం మనల్ని మనం అర్థం చేసుకోవడమే చాలా కష్టమైన పని అని, అలాంటప్పుడు ప్రపంచం మొత్తాన్ని అర్థం చేసుకున్నామని అనుకోవడం కూడా కరెక్ట్ కాదని తన అభిప్రాయన్ని బయటపెట్టింది.

చీమలకు మెదడు లేదని అనుకుంటాం.. కానీ

ఇక ఇదే సందర్భంలో మనం చీమలకు మెదడు లేదని అనుకుంటాం.. కానీ అవి ఒక చోట ఆహారం దొరికితే కొద్ది సేపటికే పదుల సంఖ్యలో అక్కడికి చేరుకుంటాయి. అసలు అవి ఒకదానితో ఒకటి ఎలా కమ్యూనికేట్ చేసుకుంటున్నాయో మనకు పూర్తిగా తెలుసా? అంటూ క్రేజీ క్వశ్చన్ వేసింది ఎస్తర్.

Advertisement

మనకు తెలియని విషయాలు ప్రపంచంలో ఎన్నో ఉన్నాయని, అందుకే ప్రతి విషయాన్నీ మన పరిధిలోనే అంచనా వేయడం సరికాదని చెప్పింది.

సోషల్ మీడియాలో కనిపించే ఇమేజ్‌ ఫేక్ 

ఇక మనుషుల మెంటాలిటీపై మాట్లాడుతూ సోషల్ మీడియాలో కనిపించే ఇమేజ్‌నే నిజమైన వ్యక్తిత్వంగా భావించడం తప్పని, ఒక వ్యక్తి జీవితంలో మనం చూసేది చాలా చిన్న భాగమేనని, అయినా వాళ్ల గురించి పూర్తిగా జడ్జ్ చేసేస్తుంటామని చెప్పుకొచ్చింది.

గాసిప్స్‌ అంటే తనకు పెద్దగా ఇష్టం ఉండదని, ఇతరుల గురించి గంటల తరబడి మాట్లాడటం కంటే తన గురించి, తన సమస్యల గురించి చర్చించుకోవడానికే ఇష్టపడతానని తెలిపింది. తనకు తెలియని విషయం ఎవరికైనా తెలిసి ఉంటే వాళ్ల దగ్గర నుంచి నేర్చుకోవడానికి తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని , తెలుగు భాషను కూడా నేర్చుకోవడంలో తన ఫోకస్ ఇదే వివరించింది.

also read :‘ఛా.. ఈ పాట ఎందుకు చేశానా?’..బుల్లెట్ బండి లక్ష్మణ్ ఓపెన్ టాక్ !

‘100% Love’, ‘బెజవాడ’, ‘భీమవరం బుల్లోడు’ వంటి తెలుగు సినిమాల్లో గ్లామర్, కమర్షియల్ రోల్స్ చేసిన ఈ బ్యూటీ కంటెంట్ బేస్డ్ సినిమాల్లో  పెర్ఫార్మెన్స్‌కు ఎక్కువ స్కోప్ దొరుకుతోందని ఫిక్స్ అయినట్టుంది. ఇక ఈక్రమంలోనే  ఎస్తర్ కూడా తనకు నచ్చిన కథలు, పాత్రలను ఎంచుకోవడానికి ప్రయత్నిస్తున్నట్టు ఆమె మాటలను బట్టి అర్థమవుతోంది.

Tags

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×