E-Paper
Advertisement

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!

నేపాల్ వరదల్లో చిక్కుకున్న తెలంగాణ వాసులకు బిగ్ అలర్ట్!
Advertisement

Nepal Floods: నేపాల్‌లో సంభవించిన భారీ వరదల కారణంగా అక్కడ చిక్కుకున్న లేదా ఇబ్బందులు ఎదుర్కొంటున్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు చేపట్టింది.

తెలంగాణ వాసులకు..

నేపాల్‌లోని పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ, అక్కడ ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందేలా చర్యలు తీసుకోవాలని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్ మరియు సమన్వయ కేంద్రాన్ని తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. నేపాల్‌లో ఉన్న తెలంగాణ వాసులకు అవసరమైన సహాయం అందించేందుకు తెలంగాణ భవన్ అధికారులు కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ (MEA), ఖాట్మండులోని భారత రాయబార కార్యాలయంతో పాటు ఇతర సంబంధిత అధికారులతో నిరంతరం సమన్వయం చేస్తున్నారు.

Advertisement

Also read: ఆర్‌ఎస్ఎస్ కార్యక్రమంపై న్యూయార్క్ మేయర్ మమ్దానీ అభ్యంతరం..కారణం అదేనట!

న్యూఢిల్లీలోని..

నేపాల్‌లో ఉన్న తెలంగాణకు చెందిన యాత్రికులు, పర్యాటకులు లేదా ఇతర వ్యక్తులతో సంప్రదింపులు జరపలేకపోతున్న కుటుంబ సభ్యులు న్యూఢిల్లీలోని తెలంగాణ భవన్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించవచ్చు. సహాయక చర్యల సమన్వయాన్ని సులభతరం చేసేందుకు సంబంధిత వ్యక్తుల పేరు, పాస్‌పోర్ట్ వివరాలు, మొబైల్ నంబర్, నేపాల్‌లో ప్రస్తుతం ఉన్న లేదా చివరిగా తెలిసిన ప్రాంతం, ట్రావెల్/టూర్ ఆపరేటర్ వివరాలు, కుటుంబ సభ్యుల సంప్రదింపు వివరాలను హెల్ప్‌లైన్ అధికారులకు అందించాలి.

హెల్ప్‌లైన్ నంబర్లు

Advertisement

శ్రీమతి వందన
పీఎస్ టు రెసిడెంట్ కమిషనర్ & లైజన్ హెడ్
మొబైల్: 9871999044
సి.హెచ్. చక్రవర్తి
పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్
మొబైల్: 9949351270
జి. రక్షిత్ నాయక్
లైజన్ ఆఫీసర్
మొబైల్: 9618597969

Tags

Related News

నీ హీరోయిన్ల జాతకం మొత్తం బయటపెడతా.. కేటీఆర్ పై బల్మూరి వెంకట్ ఫైర్!

విదేశాల్లో చదవాలనుకునే బీసీ, ఈబీసీ విద్యార్థులకు భారీ గుడ్ న్యూస్.. వెంటనే అప్లై చేయండి?

33 జిల్లాల తెలంగాణలో టాలెంట్ ఉన్న క్రికెటర్లు లేరా.. ధరం గురువారెడ్డి ఫైర్!

హైదరాబాద్‌కు జగన్ మకాం..అక్రమాస్తుల కేసులో బిగ్ ట్విస్ట్, న్యాయస్థానం కీలక నిర్ణయం

మా సంకల్ప అదే.. యువతతోపాటు మహిళలను ప్రోత్సహించాలన్న సీఎం రేవంత్‌రెడ్డి

సరైన అభ్యర్థి ఎవరు? ఎమ్మెల్సీ టికెట్లపై బీజేపీ కసరత్తు

ప్రభుత్వ లెక్చరర్ల బాగోతంపై విద్యాశాఖలో ప్రకంపనలు.. మండిపడుతున్న ప్రజలు, చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రైవేట్ డాక్టర్ల జీతం రూ. 25 వేలు.. ప్రభుత్వ మెడికోల స్టైఫండ్ ఎంతంటే? షాకింగ్ నిజాలు!

Big Stories

Advertisement
×