E-Paper
Advertisement

‘ఛా.. ఈ పాట ఎందుకు చేశానా?’..బుల్లెట్ బండి లక్ష్మణ్ ఓపెన్ టాక్ !

‘ఛా.. ఈ పాట ఎందుకు చేశానా?’..బుల్లెట్ బండి లక్ష్మణ్ ఓపెన్ టాక్ !
Advertisement

Bullet Bandi Laxman:బుల్లెట్ బండి లక్ష్మణ్..జానపదాలు తెలిసిన ఆడియన్స్ కి ఈ పేరు పెద్దగా పరిచయం చేయాల్సిన పని లేదు. బుల్లెట్టు బండెక్కి , అల్లాహే అల్లా వంటి ఎన్నో పాటలు ఈయన కలం నుండి జాలు వారినవే.ఇక తాజాగా మామిడాకుల అంటే పాట నెట్టింట వైరల్ అవుతున్న సందర్భంగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న లక్ష్మణ్ తన మనసులోని మాటల్ని ఇలా పంచుకున్నాడు.

సాధారణంగా ఇప్పుడున్న ట్రెండ్‌లో జనాలకు వెంటనే కనెక్ట్ అయ్యేవి ఫాస్ట్ బీట్ పాటలు, మాస్ డ్యాన్సులు. కానీ లక్ష్మణ్ మాత్రం ఈసారి రూట్ మార్చి ‘సీనయ్య’ లాంటి ఒక సాఫ్ట్ మెలోడీ సాంగ్ చేయాలని నిర్ణయించుకున్నారు.

ఎలా రిసీవ్ చేసుకుంటారోనని

Advertisement

లక్ష్మణ్ మాట్లాడుతూ పల్లెటూరి బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఒక మంచి ప్రేమకథను, వినసొంపైన లిరిక్స్‌తో ‘మామిడికుల’ రూపంలో ప్రేక్షకుల ముందుకు తెచ్చానని తెలిపాడు. స్టూడియోలో రికార్డింగ్ అయినప్పుడు ఔట్‌పుట్ చూసి 100 కి 100 మార్కులు వేసుకున్నానని కాని.. బయట జనాలు దీన్ని ఎలా రిసీవ్ చేసుకుంటారోనని ఒక రకమైన భయం ఉండేదని చెప్పుకొచ్చాడు.

అయితే అనుకున్నట్టుగానే పాట ప్రోమో బయటకు రాగానే కొందరు నెగెటివ్ కామెంట్స్ చేయడం మొదలుపెట్టారని వాపోయాడు. “లక్ష్మణ్ నుంచి మేం మాస్ పాటలు ఆశిస్తే ఈ మెలోడీ ఏంటి?” అన్నట్టుగా కొన్ని కామెంట్స్ రావడంతో బాధ పడిపోయానని తెలిపాడు .

ఈ పాట టచ్ చేసి తప్పు చేశానా

Advertisement

ఇక అప్పుడే అనవసరంగా ఈ పాట టచ్ చేసి తప్పు చేశానా అనిపించిందని , కానీ సీన్ కట్ చేస్తే.. ఫుల్ సాంగ్ రిలీజ్ అయ్యాక కథ పూర్తిగా మారిపోయిందని మనసులోని సంతోషాన్ని బయటపెట్టాడు.మెలోడీలోని ఫీల్, లిరిక్స్‌లో ఉన్న డెప్త్ జనాలకు విపరీతంగా నచ్చేయడంతో పాజిటివ్ రెస్పాన్స్ రావడం మొదలైందని ,దాంతో ఆయనలో తనలో ఉన్న భయమంతా పోయి, తను తీసుకున్న నిర్ణయం సరైనదే అన్న నమ్మకం వచిందని ఆనందంగా చెప్పుకొచ్చాడు.

వెనకాడకుండా మళ్ళీ రీషూట్

ఇక ఈ పాట కోసం కేవలం మ్యూజిక్ మీదనే కాకుండా కథ, విజువల్స్ మీద కూడా చాలా కేర్ తీసుకున్నానని తెలిపాడు.ఊరిలో ఉండే ఒక అబ్బాయి, అమ్మాయి మధ్య ఉండే ప్రేమ, వారి ఆత్మగౌరవం, కుటుంబాల మధ్య ఉండే బంధాలను చాలా సహజంగా చూపించామని,అయితే విజువల్స్ అనుకున్న స్థాయిలో రాలేదని తెలిసి, ఖర్చు ఎక్కువైనా సరే వెనకాడకుండా మళ్ళీ రీషూట్ కూడా చేశామని తెలిపాడు.పింటు నో పిల్ల’, ‘సీనయ్య’ వంటి హిట్స్ తర్వాత తనపై పెరిగిన అంచనాలను నిలబెట్టుకోవడం కోసమే ఈ ప్రయోగం చేశానని చెప్పాడు.

also read :చీరలో నభా నటేష్.. అబ్బా ఏం అందం రా బాబోయ్!

కొత్తదనం అందించాలనేదే తన ఆలోచన

ఇక ఫోక్ ఫీల్డ్‌లో తనతో పాటు పోటీగా ఎదుగుతున్న రాముడి గురించి కూడా చాలా పాజిటివ్‌గా చెప్పుకొచ్చాడు లక్ష్మణ్.తమ మధ్య పోటీ కంటే ఒకరికొకరం సపోర్ట్ చేసుకుంటూ కలిసి ఎదగడమే ముఖ్యమని తమ మధ్య ఉన్న అనుబంధాన్ని బయటపెట్టాడు. ఎప్పుడూ ఒకే రకమైన బీట్, డ్యాన్స్ ఫార్మాట్ కాకుండా.. ఒకసారి మాస్, ఒకసారి మెలోడీ, మరోసారి ఎమోషనల్ సాంగ్స్ చేస్తూ ప్రేక్షకులకు కొత్తదనం అందించాలనేదే తన ఆలోచన అని స్పష్టం చేశాడు బుల్లెట్ బండి లక్ష్మణ్.

Tags

Related News

టీవీలోకి ‘మా ఇంటి బంగారం’ మూవీ.. ఎప్పుడు ఏ ఛానల్ లో చూడొచ్చంటే?

ఈవారం కెప్టెన్సీ వారి చేతుల్లోనే.. కంటెస్టెంట్స్ కి బిగ్ బాస్ భారీ షాక్!

రోహిత్ షాలిని పెద్ద ము**లు.. ఫైర్ అయిన మాజీ కంటెస్టెంట్!

ఈవారం నామినేషన్ లిస్ట్.. అంతా తోపులే.. మరి వెళ్ళేదెవరు?

Gundeninda GudiGantalu Today episode: పాపం మనోజ్.. రోహిణి దొరికిపోతుందా..? గుణకు మీనా వార్నింగ్..

Podarillu Today Episode : మహా మాటతో చక్రీ హ్యాపీ.. అసలు మ్యాటర్ ఇదా..? జమున గుట్టు రట్టు..

Intinti Ramayanam Today Episode: అవని కోసం మీనాక్షి.. పోలీస్ దెబ్బకు షాక్.. అవని జైలుకేనా..?

Illu Illalu Pillalu Today Episodes: రామరాజుకు ఘోర అవమానం.. పోలీస్ స్టేషన్లో రామరాజు.. శ్రీవల్లి ప్లాన్ సక్సెస్..

Big Stories

Advertisement
×