హైదరాబాద్ లో రైల్వే మార్గాన్ని మరింత విస్తరించాలని దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా నగరం మధ్యలోని ముఖ్యమైన రైల్వే మార్గాన్ని విస్తరించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ముఖ్యంగా సనత్ నగర్ నుంచి సికింద్రాబాద్ వరకు, అక్కడి నుంచి మౌలాలి వరకు ఈ విస్తరణ కొనసాగనుంది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో రెండు లైన్లు ఉండగా, ఇకపై నాలుగుకు పెంచనున్నారు. భవిష్యత అవసరాలకు అనుగుణంగా వీటిని పెంచాలని రైల్వే సంస్థ నిర్ణయించింది. రీసెంట్ గా ఈ విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి చెప్పింది. సనత్ నగర్ నుంచి మౌలాలి వరకు సుమారు 21 కిలో మీటర్ల మార్గం ఉంటుంది. ఈ మార్గంలో రైల్వే ట్రాక్ కు రెండు వైపులా 20 మీటర్ల ప్రాంతాన్ని ప్రత్యేక రైల్వే జోన్ గా అనౌన్స్ చేయాలని సౌత్ సెంట్రలం రైల్వే రాష్ట్ర ప్రభుత్వానికి రిక్వెస్ట్ చేసింది. విస్తరణ పనుల సమయంలో భూసేకరణకు వీలుగా ఈ ప్రతిపాదన చేసింది.
ప్రస్తుతం సనత్ నగర్- మౌలాలి మార్గంలో రెండు రైల్వే లైన్లు ఉన్నాయి. సికింద్రాబాద్ నుంచి దేశంలోని పలు ప్రాంతాలకు వెళ్లాల్సిన రైళ్లు నగర శివార్లలో చాలా సేపు వెయిట్ చేయాల్సి వస్తుంది. చర్లపల్లి వరకు రైళ్లు వేగంగా వచ్చినా, అక్కడి నుంచి సికింద్రాబాద్ కు వెళ్లడానికి చాలా సమయం పడుతుంది. అటు ఘట్ కేసర్ నుంచి చర్లపల్లి వరకు నాలుగు లైన్ల రైలు మార్గం ఉండటంతో అక్కడి వరకు రైళ్లు ఫాస్ట్ గా వస్తున్నాయి. సిటీ ఔట్ స్కట్స్ లో రైళ్లు చాలా సేపు ఆగడం అటు ప్రయాణీకులకు, ఇటు గూడ్స్ రైళ్లకు ఇబ్బందిగా ఉంది. రానున్న రోజుల్లో ట్రాఫిక్ మరింత పెరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక చర్యలు చేపడుతోంది. అందులో భాగంగానే సనత్ నగర్- మౌలాలి మార్గంలో నాలుగు లైన్లుగా రైల్వే మార్గాన్ని విస్తరించాలని నిర్ణయించింది. 2047 నాటికి పెరిగే ట్రాఫిక్ కు అనుగుణంగా ఈ ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
Read Also: రైల్వే టికెట్ తో ఇన్ని ఫ్రీ సదుపాయాలా? అస్సలు ఊహించి ఉండరు!
తాజాగా రాష్ట్ర ప్రభుత్వాన్ని సౌత్ సెంట్రల్ రైల్వే ప్రస్తుత ట్రాక్ కు రెండు వైపులా ప్రత్యేక జోన్ గా ప్రకటించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. రాష్ట్ర ప్రభుత్వం ఈ ప్రతిపాదనలకు ఓకే చెప్తే, ఆ ప్రాంతంలోని భూమిని కేవలం రైల్వే అవసరాలకు మాత్రమే ఉపయోగించుకునే అవకాశం ఉంటుంది. ఆ పరిధిలోని ప్రైవేట్ ప్లేస్ లో ఎలాంటి నిర్మాణాలకు అనుమతులు ఇవ్వరు. రైల్వే విస్తరణ పనులు చేపట్టినప్పుడు భూసేకరణ చేసి యజమానులకు పరిహారం అందించనున్నారు. ఒకవేళ ఇప్పటికే ప్రస్తుత ట్రాక్ కు 20 మీటర్ల పరిధిలో నివాసాలు, కట్టడాలు ఉంటే విస్తరణ సమయంలో వాటిని తొలగించే అవకాశం ఉంటుంది.
Read Also: స్వర్గాన్ని తలపించే 10 రహస్య దీవులు, ఎక్కడో కాదు.. ఇండియాలోనే!