Brahmanandam: సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్స్ అంటే ఒక రకంగా ప్రశంసా వేడుక అనే చెప్పుకోవాలి. అందరూ హీరోను పొగడాలి. డైరెక్టర్ ను పొగడాలి. నిర్మాతను, హీరోయిన్ ను.. సినిమాలో ఏది ఉన్నా లేకున్నా.. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో మాత్రం ఏదో ఉందని చెప్పుకురావాలి. అదే ప్రేక్షకులను థియేటర్ వైపు తీసుకొస్తుంది. ఇదొక బిజినెస్ స్ట్రాటజీ. అయితే అందరూ ఇలానే ఉంటారు అని కాదు. కొంతమంది నటులు.. తమ మనసులోని భావాలను స్టేజిమీద ఎంతో నిజాయితీగా చెప్తారు. అలాంటి నటుల్లో బండ్ల గణేష్ ఒకరు.
నటుడిగా కెరీర్ ను ప్రారంభించిన బండ్ల.. నిర్మాతగా మారి మంచి మంచి సినిమాలను నిర్మించాడు. బండ్లన్న.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు అభిమాని అనడం కన్నా భక్తుడు అని చెప్పొచ్చు. పవన్ – బండ్ల మధ్య ఉన్న స్నేహం అందరికీ తెల్సిందే. ఇక పవన్ ను ఎవరూ పొగిడినా అతిగా అనిపిస్తుంది కానీ, బండ్లన్న పొగిడితే మాత్రం హైప్ అనిపిస్తుంది. అసలు ఒకానొక సమయంలో బండ్లన్న మైక్ పట్టుకొని.. పవన్ గురించి చెప్తుంటే గూస్ బంప్స్ ఖాయమని చెప్పాలి. ఈశ్వరా.. పరమేశ్వరా.. పవనేశ్వరా.. ఈ స్పీచ్ ఇప్పటికీ టాప్ ట్రెండింగ్ లో ఉంటుంది.
స్నేహం అయినా, అభిమానం అయినా మితంగానే ఉండాలి. అమితంగా ఉంటే అది వేరే పరిణామాలకు దారి తీస్తుంది. బండ్లన్న విషయంలో కూడా అదే జరిగింది. పవన్ – బండ్ల మధ్యలోకి త్రివిక్రమ్ వచ్చాడు. బండ్ల స్థానాన్ని త్రివిక్రమ్ తన్నుకుపోయాడు. ఏ ఈవెంట్ కు అయినా బండ్లను రావద్దని గట్టిగా వారించాడు. ఇక పవన్ ను బండ్ల స్థానంలో త్రివిక్రమ్.మొదలుపెట్టాడు . గురూజీ పెన్ను పవర్ ఎలా ఉంటుందో అందరికీ తెల్సిందే. ఒక ఫ్రెండ్ గా.. వెల్ విషర్ గా గురూజీ.. పవన్ గురించి ఇచ్చే ఎలివేషన్స్ అంతా ఇంతా కాదు. పవన్ సైతం సందు చిక్కినప్పుడల్లా త్రివిక్రమ్ గురించి చెప్పుకొస్తూనే ఉన్నాడు.
HHVM Pre Release Event: పవన్ కళ్యాణ్ అసలు సినిమా యాక్టర్ ఏంటి.? బ్రహ్మానందం షాకింగ్ కామెంట్స్
ఎంత గురూజీ మాట్లాడినా.. పవన్ ను పొగడ్తలతో ముంచెత్తినా కూడా పవన్ ఫ్యాన్స్.. బండ్లన్నను మిస్ అవుతున్నారు అని చెప్పొచ్చు. గత కొన్నేళ్లుగా ఆహ్వానం తన సినిమా ఈవెంట్స్ కు వచ్చింది లేదు. ఇక చాలాకాలం తరువాత హరిహర వీరమల్లు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో కనిపించాడు. అందరూ ఉన్నా కూడా ఫ్యాన్స్ కళ్లు మాత్రం బండ్లన్న కోసం వెతికాయి. కానీ, అతను ఎక్కడా కనిపించలేదు. వీరమల్లు ఈవెంట్ లో బండ్లన్న లేని లోటు కొట్టొచ్చిన్నట్లు కనిపించింది అనుకోనేలోపు వచ్చాడు హాస్య బ్రహ్మా బ్రహ్మానందం.
లేచిన కెరటం గొప్పది కాదు. పడి లేచిన కెరటం గొప్పది. ఎంతమంది ఎన్నైనా అనుకోనివ్వండి. సముద్రమంతాఒక్కసారి ఎదురు వచ్చి గుండెల మీద కొట్టినా సరే.. స్ట్రైట్ గా నిలబడి చెప్పగలిగినటువంటి ఏకైక వ్యక్తి పవన్ కళ్యాణ్ అన్న మాట ఒక్కసారిగా ఫ్యాన్స్ అందరికీ ఊపిరి పోసింది. బండ్లన్న ను మరిపించే హైప్ ను బ్రహ్మీ రూపంలో వచ్చిందని ఫిక్స్ అయిపోయారు. దీంతో బ్రహ్మీ.. పవన్ కు ఇచ్చే ఒక్కో ఎలివేషన్ కు ఫ్యాన్స్ అరుపులు, చప్పట్లతో ఎంజాయ్ చేశారు. బండ్లన్న లానే.. ఒకపక్క నవ్విస్తూ.. ఇంకోపక్క పవన్ గుణగణాల గురించి బ్రహ్మీ చెప్తుంటే.. ఫ్యాన్స్ ఏంటి.. పవన్ కూడా నవ్వును ఆపుకోలేకపోయాడు అంటే చూడండి. ఈ స్పీచ్ తరువాత ఫ్యాన్స్ అందరూ.. బండ్లన్న లేని లోటు తీర్చావ్ సామీ.. చాలు.. మాకు ఇది చాలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.