Hari Hara Veera Mallu :పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) ‘హరిహర వీరమల్లు’కి ఇప్పుడు ఎక్కడ చూసినా నెగెటివిటీ పెరిగిపోయిందనే వార్తలు వినిపిస్తున్నాయి.ముఖ్యంగా ముగ్గురు హీరోల అభిమానులు పవన్ కళ్యాణ్ వీరమల్లు మూవీపై పగబట్టేసారేమో అనే అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన హరిహర వీరమల్లు సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను జూలై 21న హైదరాబాద్ శిల్పకళా వేదికగా చాలా ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు (RRR) అలాగే పవన్ కళ్యాణ్.. ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి (CM Jagan Mohan Reddy) ని, వైసీపీ పార్టీని ఉద్దేశిస్తూ చేసిన ఇన్ డైరెక్ట్ కామెంట్లు ఇప్పుడు రాజకీయ చర్చకు దారితీసాయి.
హరిహర వీరమల్లుపై నెగటివ్ క్యాంపెయిన్ చేస్తున్న ముగ్గురు హీరోల ఫ్యాన్స్..
ముఖ్యంగా తమ పార్టీ ఇప్పుడు అధికారంలోకి వచ్చిందని, తమ వద్ద రౌడీలు, ఆయుధాలు లేవని అయినా సత్తా చాటగలం అంటూ పవన్ కళ్యాణ్, రఘురామ కృష్ణంరాజు చేసిన కామెంట్లకు వైసీపీ పార్టీ శ్రేణులు, వైసిపి అభిమానులు పెద్ద ఎత్తున బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. దీనికి తోడు ఆ ముగ్గురు హీరోల అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ హరిహర వీరమల్లు పై పగబట్టినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా వైసీపీ అభిమానులతో పాటు అల్లు అర్జున్(Allu Arjun)అభిమానులు, మహేష్ బాబు(Maheshbabu ) అభిమానులతో పాటు జూనియర్ ఎన్టీఆర్(Jr NTR) అభిమానులు కూడా సినిమాను బాయ్కాట్ చేయాలి అంటూ పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. అంతేకాదు ఈ ముగ్గురు హీరోలు కన్నీటితో ఇచ్చిన స్పీచ్ ను మొదలుకొని చివరికి వారి కళ్ళల్లో ఫైర్ ఎలా కనిపిస్తోంది అనే విషయాన్ని ఎడిట్ చేసి మరీ దేవర సాంగ్తో ట్విట్టర్లో హైలెట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో కూడా వైరల్గా మారింది.
నెగిటివిటీ పెరగడానికి కారణం ఇదే..
అసలు విషయంలోకి వెళ్తే.. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ విషయంలో వార్ ఎప్పటి నుంచో నడుస్తున్న విషయం తెలిసిందే. అల్లు అర్జున్ గత ఎన్నికల్లో వైసీపీ నేతకు మద్దతుగా నిలవడంతో పవన్ కళ్యాణ్ కు నచ్చడం లేదని, అప్పటినుంచి అల్లు అర్జున్ ని ఇన్ డైరెక్ట్ గా టార్గెట్ చేస్తున్నారనే వార్తలు వినిపించాయి. అందుకే పుష్ప 2 సంధ్యా థియేటర్ ఘటన సమయంలో అల్లు అర్జున్ జైలుకు వెళ్లి వచ్చినా సరే పవన్ కళ్యాణ్ పరామర్శించలేదు. దీంతో అప్పటినుంచి పవన్ కళ్యాణ్ పై ఆయన అభిమానులు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మరొకవైపు కృష్ణ హయాం నుంచే రాజశేఖర్ రెడ్డి కుటుంబంతో మంచి సత్సంబంధాలు ఉన్నాయి. జగన్మోహన్ రెడ్డి, మహేష్ బాబు మధ్య స్నేహ బంధం కూడా బాగా ఉంది. ఇక దీంతో జగన్మోహన్ రెడ్డిని ఇండైరెక్టుగా కామెంట్లు చేయడంతో మహేష్ బాబు అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. దీనికి తోడు ఎన్టీఆర్ అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ పై ఫైర్ అవుతున్నారు.
ఈ నెగిటివ్ క్యాంపెయిన్ నుండి వీరమల్లు బయటపడతారా?
ఇలా ముగ్గురు హీరోల అభిమానులు ఇప్పుడు వైసీపీ శ్రేణులతో కలిసి బాయ్కాట్ హరిహర వీరమల్లు అంటూ ట్రెండ్ చేస్తున్నారు. మరి ఈ నెగటివ్ క్యాంపెయిన్ నుంచి హరిహర వీరమల్లు ఏ విధంగా బయటపడుతుందో చూడాలి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ట్విట్టర్ పోస్ట్ కూడా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.
ఒక పక్క అల్లు అర్జున్ ఆర్మీ AA Army 🔥
ఇంకో పక్క YCP boycotting HHVM 🔥🔥
ఒక పక్క NTR fans and Mahesh Babu Fans 🔥ఎటు చూసినా కింద మీద వాయిస్తున్నారు 🔥🔥#BoycottHHVM pic.twitter.com/mUR07w2BkY
— 𝕁𝕦𝕤𝕥 𝔸𝕤𝕜𝕚𝕟𝕘 🇮🇳 (@JustAsking2_0) July 21, 2025