E-Paper
Advertisement

22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?
Advertisement

Fatafat Jayalakshmi: సినిమా ఇండస్ట్రీ అంటేనే రంగుల ప్రపంచం.బయట నుంచి చూస్తే అదొక ఇంద్రధనస్సు. కానీ లోపలికి తొంగి చూస్తేనే ఎన్నో చీకటి కోణాలు. అలాంటి ఓ చీకటి కోణమే సిల్వర్ స్క్రీన్ పై స్టార్ హీరోయిన్ గా  వెలిగి ఆరిన ఫటాఫట్ జయలక్ష్మి జీవితం.కేవలం పదేళ్ల కెరీర్ ,20 ఏళ్ల వయసు.ఇంత చిన్న వయసులోనే ఎంతోమంది అభిమానం సంపాదించుకొని అంతే త్వరగా ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోయిన ఆమె విషాదాంతమైన  జీవితం ఇప్పటికే  సినీ ఇండస్ట్రీకి ఒక మాయని మచ్చే.

1958 నవంబర్లో చెన్నైలోని ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో నిరజా రెడ్డిగా జన్మించిన జయలక్ష్మికి  సినిమా  వాతావరణం కొత్తేం కాదు. తండ్రి దశరథ రామ్ రెడ్డి నెల్లూరుకు చెందిన వారైనప్పటికీ చెన్నైలో చెన్నైలో కో-డైరెక్టర్‌గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా స్థిరపడడంతో సినీ ఇండస్ట్రీని చాలా దగ్గరగా నుండి చూసింది జయలక్ష్మి.తండ్రి ఎంకరేజ్మెంట్ చేయడంతో డబ్బింగ్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించిన జయలక్ష్మి వాయిస్ లో ఒక బేస్, క్లారిటీ ఉండేది.

Advertisement

స్టార్ హీరోలకి జోడిగా ఎన్నో అవకాశాలు

ఇది గమనించిన మహానటి వాణిశ్రీ ఎంకరేజ్ చేయడంతో 1972లో వచ్చిన ఇద్దరమ్మాయిలు సినిమాలో ఒక చిన్న పాత్ర వేసింది జయలక్ష్మి .ఇక ఆ తర్వాత ది గ్రేట్ k. బాలచందర్ దృష్టిలో పడటంతో ఆమె లైఫ్ ఒక్కసారిగా టర్న్ తీసుకుంది.ఒక సినిమాలో ఆమె ఫటాఫట్ అంటూ  చెప్పిన డైలాగ్ ఆడియన్స్ ని ఎంతగానో ఆకట్టుకుంది. దాంతో ఆమె అసలు పేరు మాయమైపోయి ఫటాఫట్ జయలక్ష్మి గా ఇండస్ట్రీలో స్థిరపడిపోయింది.ఇక అప్పట్లో జయలక్ష్మి క్రేజ్ ఎలా ఉండేదంటే తెలుగు, తమిళం, కన్నడ ,మలయాళ భాషల్లో స్టార్ హీరోలకి జోడిగా ఎన్నో అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి.

Advertisement

 నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్

అలా ఎన్టీఆర్ తో యుగపురుషుడు, సూపర్ స్టార్ కృష్ణతో రామ్ రాబర్ట్ రహీం వంటి సినిమాల్లో నటించి మెప్పించింది కూడా .ఇక సూపర్ స్టార్ రజినీకాంత్ తో ఆమె స్క్రీన్ ప్రెజెన్స్  ఒక సెన్సేషన్.‘ముళ్ళు మలరం’ (1978), ‘ఆరడిరుందు అరబతు వరై’ (1979) పంటి సినిమాల్లో రజినీకాంత్ భార్యగా ఆమె చేసిన యాక్టింగ్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ .ఇక ఒక ఇంటర్వ్యూలో స్వయంగా రజనీ మాట్లాడుతూ కొన్ని సీన్లలో జయలక్ష్మి ద బెస్ట్ గా నటించిందని ఆమె నటనని చూసి మైమర్చిపోయానని ఆకాశానికి ఎత్తడం విశేషం.అలాగే బాలచందర్ తీసిన స్వర్గం నరకం సినిమాలో అహంకారం,అసూయ కలగలిపి భార్యగా ఆమె చేసిన నటన ఇప్పటికీ మర్చిపోలేనిది .కెరీర్ అలా పీక్స్ లో ఉన్న సమయంలోనే ఆమె చేసిన ఒక తప్పు ఆమె జీవితాన్ని నిండా ముంచేసింది.

also read :ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!

అదే తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దిగ్గజ నటుడు ఎంజీఆర్ అన్న కొడుకు అయిన సుకుమారన్ తో  ప్రేమలో పడటం .ఆయనకు అప్పటికే పెళ్ళై పిల్లలు ఉన్నప్పటికీ ఒక మంచి ఫ్యామిలీకి కోడలుగా వెళుతున్నానని నమ్మకంతో జయలక్ష్మి సుకుమారంతో ప్రేమాయణం నడిపింది.అయితే తనని పెళ్లి చేసుకోవాలంటే సినిమాలకు శుభం కార్డు వేయాలని  కండీషన్ పెట్టడంతో తను ప్రేమించే నటనను కూడా వదులుకుంది జయలక్ష్మి .కానీ సినిమాలు మానేసిన తర్వాత ఆమెపై అనుమానాలు బాగా పెంచుకున్నాడు సుకుమారన్. దానితో రోజు తాగి వస్తు జయలక్ష్మిని చిత్రహింసలకు గురిచేశాడు .అలా నమ్మిన ప్రేమ నట్టేట ముంచేయడంతో ఒంటరితనంతో కృంగిపోయిన జయలక్ష్మి జీవితం పై విరక్తి పెంచుకుంది.

వెండితెర వెనుక ఉన్న చీకటికి  నిలువెత్తు ఎగ్జాంపుల్

అలా 1984లో ఎక్కువ డోస్ లో నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది .అలా హాస్పిటల్లో నాలుగు రోజులపాటు చావు బతుకుల మధ్య పోరాడిన జయలక్ష్మి తన 22వ పుట్టినరోజుకు సరిగ్గా కొన్ని రోజులు ముందే కన్నుమూయడం బాధాకరం ఏది ఏమైనా ఒక వెలుగు వెలిగాల్సిన నటి చేసిన ఒకే ఒక్క తప్పుతో ఇలా రాలిపోవడం వెండితెర వెనుక ఉన్న చీకటికి  నిలువెత్తు ఎగ్జాంపుల్.

Related News

‘కామ్రెడ్ కళ్యాణ్’ మూవీ ట్విట్టర్ రివ్యూ.. శ్రీవిష్ణు హిట్ కొట్టాడా..?

నానా పటేకర్ ఒక దుష్టుడు.. బాలయ్య హీరోయిన్ షాకింగ్ కామెంట్స్, తిట్టి పోస్తున్న జనం!

విజయ్ దేవరకొండ ‘రణబాలి’ మూవీ ట్రైలర్ రిలీజ్!

‘ రామాయణ’ చిత్ర నిర్మాత ఆఫీసులపై ఐటీ దాడులు!

హీరో అర్జున్ కూతురు వివాహం ఫిక్స్.. ఎప్పుడంటే..?

సైనికుడిగా సేవలు, జీతంలో 90 శాతం రైతులకు.. నానా పటేకర్ గురించి తెలిస్తే సెల్యూట్ చేస్తారు!

సేనాపతి ఈజ్ బ్యాక్.. ‘ఇండియన్ 3’ నుంచి అదిరిపోయే అప్డేట్ !

నానా పటేకర్ భార్య గురించి తెలియని విషయాలు?

Big Stories

Advertisement
×