E-Paper
Advertisement

బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !

బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !
Advertisement

Bandla Ganesh: టాలీవుడ్ ప్రముఖ నటుడు నిర్మాత బండ్ల గణేష్ ఇంట్లో పెళ్లి సందడి మొదలైపోయింది .తన మార్క్ డైలాగులు ,కాంట్రవర్సీ ట్వీట్స్ ,పొలిటికల్ కామెంట్స్ తో సోషల్ మీడియాలో రచ్చ చేసే ఈ స్టార్ ప్రొడ్యూసర్ తన కూతురు వివాహ వేడుకతో మరోసారి మీడియాలో నిలిచాడు .

బండ్ల గణేష్ కుమార్తె జనని ఏపీలోని పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన సూర్య తేజల వివాహం ఆగస్టు 16వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటల 58 నిమిషాలకు హైదరాబాద్ జూబ్లీహిల్స్ లోని జూబ్లీహిల్స్‌లోని ప్రతిష్టాత్మక జేఆర్సీ కన్వెన్షన్ సెంటర్‌లో జరగనుంది.ఈ క్రమంలో ఆయన కూతురు పెళ్లి కోసం డిజైన్ చేసిన పెళ్లి పత్రిక ఇప్పుడు ఇటు టాలీవుడ్ ఇండస్ట్రీలో, అటు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారింది.

‘ఈశ్వరా.. పరమేశ్వరా.. అంటూ  స్పీచ్ లు

Advertisement

మామూలుగా బండ్ల గణేష్ అనగానే మనకు గుర్తొచ్చే పేరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్.. ‘ఈశ్వరా.. పరమేశ్వరా.. అంటూ స్టేజీలపై ఆయన ఇచ్చే స్పీచ్ లు, పవన్ పట్ల చూపించే ప్రేమ అంతా కాదు.అయితే తన కూతురి పెళ్లి పత్రికపై నారా భువనేశ్వరి, శ్రీ నారా చంద్రబాబు నాయుడు ఆశీస్సులతో ముద్రించడం ట్రెండింగ్ అయిపోయింది.

మొదటి కార్డును తిరుమల శ్రీవారి పాదాల చెంత ఉంచి ఆశీస్సులు తీసుకున్న బండ్ల రెండో పత్రికను నేరుగా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వర్ కి అందించి తన కృతజ్ఞతలు చాటుకున్నాడు .అయితే ఏరువాక పౌర్ణమి నాడే ఈ ఈ పెళ్లి  పనులకు శ్రీకారం చుట్టడం విశేషం. అయితే ఈ వెడ్డింగ్ కార్డు చూసిన పవన్ ఫ్యాన్స్ మాత్రం సోషల్ మీడియా వేదికగా బండ గణేష్ పై తెగ ఫైర్ అవుతున్నారు .

ఎంగేజ్మెంట్ కి వచ్చి దీవించిన చంద్రబాబు దంపతులు

Advertisement

పవన్ ని దేవుడిగా కొలిచే బండ్ల పెళ్లి పత్రికలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేరు ఎందుకు వేయలేదని,కేవలం చంద్రబాబు దంపతుల పేర్లు మాత్రమే వేయడం ఏంటని మండిపడుతున్నారు .నిజానికి బండ్ల గణేష్ కి నారా కుటుంబంతో మంచి రిలేషనే ఉంది.గతంలో చంద్రబాబు నుంచి రిలీజ్ కావాలని మొక్కుకున్న బండ్ల ఆ మొక్కు  తీరగడంతో హైదరాబాద్ నుంచి తిరుమల కి కాలినడకన పాదయాత్ర చేశారు కూడా.అంతేకాకుండా భువనేశ్వరి పుట్టినరోజు సందర్భంగా హనుమకొండ  పేద కుటుంబానికి ఐదు లక్షల సహాయం అదించాడు .ఇక  ఈ ఏడాది మేలో జరిగిన జనని, సూర్యతేజ ఎలా ఎంగేజ్మెంట్ కి చంద్రబాబు దంపతులు స్వయంగా వచ్చి దీవించారు కూడా .

ఇక బండ్ల పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నప్పటికీ అటు ఇండస్ట్రీ వ్యవహారాల్లో ఇటు లీగల్ ఇష్యూస్ లో ఎక్కడ తగ్గట్లేదు.ఒకవైపు ల్యాండ్ వివాదానికి సంబంధించి కోర్టు మెట్లు ఎక్కుతూనే మరోవైపు సోషల్ మీడియాలో తనదైన శైలిలో ప్రకాష్ రాజ్ కి కౌంటర్లు వేస్తున్నాడు.ఇక బండ్ల గణేష్ సినిమాల విషయానికొస్తే పవన్ కళ్యాణ్ తో తీన్మార్, గబ్బర్ సింగ్ వంటి సినిమాలు తీసిన బండ్ల జూనియర్ ఎన్టీఆర్ తో బాద్షా, టెంపర్ సినిమాలన్నీ తెరకెక్కించాడు. ఇక అల్లు అర్జున్ తో  ఇద్దరమ్మాయిలతో సినిమాని నిర్మించిన బండ్ల అటు పర్సనల్ లైఫ్ లోను అటు తన కూతురి పెళ్లి పత్రిక ద్వారా మరోసారి ఇండస్ట్రీలో హాట్  డిబేట్ కి తెరలేపాడు.చూడాలి మరి ఈ వివాదంపై బండ్ల ఎలా రియాక్ట్ అవుతాడో!

also read :ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్!

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×