E-Paper
Advertisement

ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!

ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!
Advertisement

Mana Shankar Varaprasad garu:ఒకప్పుడు సినిమా హిట్టా కాదా అనేది గోడల మీద వేసే వాల్ పోస్టర్లను బట్టి తెలిసిపోయేది.కానీ ఇప్పుడు ఫస్ట్ వీకెండ్ కలెక్షన్ల వసూళ్లలోనే సినిమా ఏంటో తేలిపోతుంది.ఎంత పెద్ద స్టార్ హీరో అయినా కనీసం రెండు మూడు వారాలు థియేటర్లలో నిలబడితే గొప్ప అనుకుంటున్నారు .అలాంటి ఈ రోజుల్లో సోషల్ మీడియాని షేర్ చేస్తూ ఒక వాల్ పోస్టర్ బయటకు వచ్చింది.మెగాస్టార్ చిరు, నయనతార కాంబినేషన్లో వచ్చిన సినిమా మన శంకర్ వరప్రసాద్ గారు .2026 జనవరి 12న రిలీజ్ అయిన ఈ సినిమా ఇప్పుడు సరికొత్త రికార్డులతో నెట్టింట వైరల్ అయిపోయింది.

సక్సెస్ ఫుల్ గా  175 రోజులు

అనిల్ రావిపూడి మార్క్ ఎంటర్టైన్మెంట్ తో విక్టరీ వెంకటేష్ కేథరిన్ కీ రోల్స్ చేసిన ఈ ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్టైనర్ వరల్డ్ వైడ్ గా మూడు వందల కోట్లకి పైగా గ్రాస్ సాధించి ఇండస్ట్రీలో సరికొత్త రికార్డులని తిరగరాసిస్తుంది .అయితే కలెక్షన్ల వర్షం అలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన మరో క్రేజీ మైల్ స్టోన్ ఇప్పుడు టాలీవుడ్ లోనే హాట్ టాపిక్ గా మారింది.విషయంలోకి వెళ్తే వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఎర్రగుంట్ల లోని  హేమ థియేటర్లో ఈ సినిమా సక్సెస్ ఫుల్ గా  175 రోజులు పూర్తి చేసుకుంది.

థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే

Advertisement

దీనికి సంబంధించిన అఫీషియల్ వాల్ పోస్టర్ మీడియాలోకి రావడంతో మురిసిపోతున్నారు మెగా ఫ్యాన్స్ .ఇక ప్రస్తుత సినిమా ట్రెండ్  గమనిస్తే థియేటర్లలో రిలీజ్ అయిన నెల రోజుల్లోనే సినిమాలు ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి.దీనివల్ల ప్రేక్షకులు కూడా థియేటర్ల వైపు అడుగులు వేయడం పూర్తిగా తగ్గించేశారు .ఇక నిర్మాతలు కూడా రిస్కు తీసుకోవడం ఎందుకంటూ  మొదటి రెండు వారాల్లోనే టికెట్ రేట్లు పెంచేసి లాభాలు పిండుకునే పనిలో పడ్డారు.ఒకప్పుడు మహేష్ బాబు పోకిరి, రామ్ చరణ్ మగధీర సినిమాలు వందల కేంద్రాలలో 175 రోజులు, 100 రోజులు ఆడి రికార్డులు సృష్టించాయి.

also read :‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?

హ్యాపీ మోడ్ లోకి వెళ్తున్న  సినిమా లవర్స్!

Advertisement

ఇక ఆ తర్వాత ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్ అల వైకుంఠపురం లో,బాహుబలి ఇండస్ట్రీ హిట్స్ కే   50 రోజుల పోస్టర్లు వేయడమే గగనం అయిపోయింది.అలా  50 రోజుల పోస్టర్లే దిక్కులేని ఈ కాలంలో 175 రోజుల పోస్టర్ చూడడం అంటే ఒక అద్భుతమే అంటూ ఆకాశానికి ఎత్తేస్తున్నారు ట్రేడ్ పండిట్స్.నిజానికి అప్పట్లో గోడలపై వేసే 100 రోజుల పోస్టర్లు చూస్తే అభిమానులకు ఒక పెద్ద పండగ అది.కానీ మారుతున్న కాలంలో తో పాటు ఆ సంప్రదాయం కూడా పూర్తిగా మాయమైపోయింది .ఇలాంటి సమయంలో మన శంకర్ వరప్రసాద్ గారు సాధించిన ఈ అరుదైన ఘనత పాత తరం సినిమా వైభవాన్ని కళ్ళ ముందు నిలిపిందనే చెప్పాలి.ఇక సోషల్ మీడియా అంతటా ఈ  పోస్టర్ ట్రెండ్ అవుతుండటంతో ఎన్నాళ్ళకి ఎన్నాళ్ళు ఇలాంటి ఒక వింటేజ్ పోస్టర్ చూసామా అంటూ హ్యాపీ మోడ్ లోకి వెళ్తున్నారు  సినిమా లవర్స్!

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×