Senior Citizens: 40 ఏళ్లు దాటితేనే నడవలేని ప్రస్తుత జనరేషన్‌కు 116 ఏళ్ల బామ్మ షాక్ ఇచ్చింది. ఏకంగా శ్రీవారి అలిపిరి మార్గంలో కాలినడక ద్వారా తిరుమలకు చేరుకుంది. చెరగని చిరునవ్వుతో గోవింద నామస్మరణతో మెట్లను అవలీలగా ఎక్కుతూ.. అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ వీడియోను చూసిన సీఎం చంద్రబాబు సైతం ఆశ్చర్యపోయి శభాష్.. అవ్వ.. అంటూ అభినందించారు. వృద్ధురాలి వీడియో వైరల్ కావడంతో TTD చైర్మన్ BR నాయుడు స్పందించారు. వృద్ధురాలితో పాటు ఆమె కుటుంబానికి కూడా వీఐపీ దర్శనం కల్పించి సకల తన సిబ్బందితో ఏ లోటూ లేకుండా సకల లాంచనాలతో శ్రీవారి దర్శనం దగ్గరుండి చేయించారు.
అంతా బాగానే ఉంది. అవ్వ ఆరోగ్యంగా ఉంది కాబట్టి సరిపోయింది. అదే ఆరోగ్యంగా లేకపోతే.. నడక మార్గంలో తిరుమల చేరుకోగలిగేదా? వృద్ధాప్యంతో బాధపడుతూ.. శ్రీవారిని దర్శించుకోలేక రాజీపడే సీనియర్ సిటిజన్స్‌కు TTD ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తోంది? 40 ఏళ్లు దాటితేనే ఐరానా పడే ప్రస్తుత జనరేషన్‌లో.. 90 ఏళ్లు దాటినవారి సిచుయేషన్ ఏంటి? అనే ప్రశ్నలు ప్రస్తుతం వెల్లువెత్తుతున్నాయి. రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులకు కల్పించే వీఐపీ బ్రేక్ దర్శనాలను 90 ఏళ్లు దాటిన సీనియర్ సిటిజన్స్‌కు సైతం కల్పిస్తే తప్పేంటి? అనే ప్రశ్నలు, డిమాండ్స్ ఇప్పుడు తెరపైకి వస్తున్నాయి. మరి TTD ఆ దిశగా నిర్ణయం తీసుకుంటుందా? 116 ఏళ్ల వృద్ధురాలిపై చూపిన సానుభూతి, గౌరవం.. 90 ఏళ్లు దాటిన వృద్ధులందరిపై చూపుతారా? అనేది ప్రస్తుతం మిలియన్ డాలర్ల ప్రశ్న.
Also read: Social Media: జోసెఫ్ అరెస్ట్‌పై మాజీ సీఎం జగన్ ఫైర్.. ఏపీలో ముదిరిన సోషల్ మీడియా వార్!