E-Paper
Advertisement

‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?

‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?
Advertisement

Akhil Lenin: అఖిల్ అక్కినేని ..మోస్ట్ వెయిటింగ్ హీరోగా మారిపోయిన ఈ అక్కినేని అందగాడు హిట్  కోసం పడుతున్న పాట్లు అన్నీ ఇన్నీ కావు.ఎంట్రీ ఇచ్చిన అఖిల్ సినిమా నుంచి మొన్నటి ఏజెంట్ వరకు ప్రతి సినిమాకి సిక్స్ ప్యాక్ లు,మేకోవర్లు అంటూ బాడీని ఎంత మార్చుకొని కష్టపడుతున్న బాక్సాఫీస్ దగ్గర మాత్రం అన్ని సినిమాలు బొక్క బోర్లా పడుతున్నాయి.ఈ క్రమంలోనే రూరల్ యాక్షన్ డ్రామా లెనిన్ అంటూ జులై 10న మన ముందుకు రాబోతున్నాడు ఈ అక్కినేని వారసుడు .అయితే ఈసారి అఖిల్ రూట్ మార్చాడు

తన కష్టాన్ని నమ్ముకుంటూ ఇండస్ట్రీలోని పెద్దల సపోర్ట్ ను గట్టిగానే వాడుకుంటున్నాడు .ఇప్పటికే మహేష్ బాబు, రామ్ చరణ్ ,నాని లాంటి స్టార్ హీరోస్ ఈ సినిమాపై నెట్టింట మంచి పాజిటివ్ బజ్ క్రియేట్ చేయగా, తాజాగా మాన్ అఫ్ మాస్ జూనియర్ ఎన్టీఆర్ ఏకంగా సినిమాల్లో భాగం అయిపోయాడు .అవును లెనిన్ కథ ప్రారంభంలో వచ్చే శ్రీరామపురం ,భారతం మిట్ట గ్రామాల బ్యాక్గ్రౌండ్ ఎలివేట్ చేయడానికి వాయిస్ ఓవర్ ఇచ్చాడు.ఇక ఇదే విషయమై అఖిల్ తెగ మురిసిపోతూ థాంక్యూ టైగర్ ,లవ్ యు బ్రదర్ అంటూ ట్విట్టర్లో పోస్ట్ పెట్టేసాడు కూడా .

Advertisement

సెటైర్ల వర్షం కురిపిస్తున్న యాంటి ఫ్యాన్స్ 

కానీ ఇక్కడే మొదలైంది అసలు ట్విస్ట్ .సోషల్ మీడియాలో ఈ అప్డేట్ వైరల్ అవ్వడమే ఆలస్యం  యాంటి ఫ్యాన్స్ తమదైన స్టైల్ లో సెటైర్ల వర్షం కురిపించడం మొదలు పెట్టేశారు .’ఇండస్ట్రీలో ఉన్న స్టార్ హీరోలు అందరిని వాడేస్తున్నారు బ్రో కానీ రిజల్ట్ మాత్రం మారడం లేదు’ అంటూ కామెంట్లు పెట్టేస్తున్నారు .గతంలో అఖిల్ నటించిన మిస్టర్ మజ్ను సినిమాకి ఈవెంట్ కూడా ఎన్టీఆర్ చీఫ్  గెస్ట్ గా వచ్చి ప్రమోట్ చేసిన సంగతి తెలిసిందే .కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ఫలితాన్ని రాబట్టిందో చెప్పక్కర్లేదు.ఇక అంతకుముందు అఖిల్ సినిమాకి సల్మాన్ ఖాన్, నితిన్ వంటి స్టార్స్ సపోర్ట్ చేశారు కూడా.

Advertisement

ఇక ఏజెంట్ కి  అయితే ఏకంగా మమ్ముట్టి లాంటి లెజెండ్ తోడయ్యాడు కానీ బాక్స్ ఆఫీస్ వద్ద మాత్రం ఫలితం శూన్యం .ఇప్పుడు మళ్లీ తారక్ వాయిస్ ఓవర్ ఇవ్వడంతో  స్టేజీల  మీద గెస్ట్లుగా పిలిచినా వర్కౌట్ కాలేదని,ఈసారి ఏకంగా  ప్రేక్షకులకు తారక్ గొంతు వినిపించి థియేటర్ల వైపు రప్పించాలని ప్లాన్ చేశారా అంటూ ట్రోలర్స్ కౌంటర్లు వేస్తున్నారు.

also read :టాలీవుడ్ టు కోలీవుడ్.. శివాజీ కీలక పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ‘అల్ఫా!

తెలియాలంటే జూలై 10 వరకు ఆగాల్సిందే !

ఒక హీరోకి సక్సెస్ రావాలంటే కథలో, కంటెంట్ లో దమ్ము ఉండాలని పక్కన ఎంతమంది స్టార్స్ వచ్చి వాయిస్ ఓవర్లు ఇచ్చిన ఏమాత్రం ఉపయోగం ఉండదనేది  నెటిజెన్ల వాదన.ఎన్టీఆర్ తన వాయిస్ తో  శ్రీ రామపురం, భారతం మిట్టలను పరిచయం చేయడం ఓకే కానీ అఖిల్ కెరీర్ ను ఈ వాయిస్ ఓవర్ సక్సెస్ ట్రాక్ ఎక్కిస్తుందా అంటూ సోషల్ మీడియాలో సెటైర్స్ వేస్తున్నారు యాంటి  ఫ్యాన్స్.

మరోవైపు నాగ్ మాత్రం ఈ సినిమాలో ఊహించని  ట్విస్టులు ఉన్నాయని, ఈసారి మన వాడు గట్టిగానే కొట్టేస్తున్నాడు అంటూ చాలా కాన్వెంట్ గా ఉన్నాడు. ఏదేమైనా టాలీవుడ్ స్టార్స్ అందరూ అండగా నిలిచిన ఈ మూవీతో అయినా అఖిల్ సక్సెస్ ట్రాక్  ఎక్కుతాడో లేదో తెలియాలంటే జూలై 10 వరకు ఆగాల్సిందే !

Related News

22 ఏళ్లకే రాలిపోయిన స్టార్ హీరోయిన్…అతనితో ప్రేమే కారణమా ?

ఈమధ్య కాలంలో ఇలాంటి పోస్టర్ చూశారా? మేకర్స్ కళ్ళు తెరిపిస్తున్న మెగాస్టార్ లేటెస్ట్ రికార్డ్!

టాలీవుడ్ టు కోలీవుడ్.. శివాజీ కీలక పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ‘అల్ఫా!

ధనుష్ ‘పొలిటికల్’ స్క్రీన్ ప్లే.. విజయ్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్నారా?

నాడు పర్సనల్ ఎటాక్.. నేడు బిజినెస్ ఎటాక్ ….నాగవంశీ టార్గెట్ సునీల్ నారంగేనా ?

బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !

‘దేవర 2’ కావాలంటే బాలయ్యతో హిట్ కొట్టాల్సిందేనా ?

Big Stories

Advertisement
×