E-Paper
Advertisement

‘దేవర 2’ కావాలంటే బాలయ్యతో హిట్ కొట్టాల్సిందేనా ?

‘దేవర 2’ కావాలంటే బాలయ్యతో హిట్ కొట్టాల్సిందేనా ?
Advertisement

Koratala Comeback: మిర్చి 2013 ,శ్రీమంతుడు 2015 , జనతా గ్యారేజ్2016, భరత్ అనే నేను 2018 …ఈ లైనప్ చాలు కొరటాల ఏ రేంజ్ లో సక్సెస్ ట్రాక్ పై పరుగులు పెట్టాడో.కానీ కాలం ఎప్పుడు ఒకేలా ఉండదంటూ ఆచార్య 2022 తో  అడ్డంగా బుక్కయిపోయాడు కొరటాల.ఎంతలా అంటే ఇక ఇప్పట్లో ఈయనగారు అసలు కోలుకుంటారా అన్నంతగా…నెటిజన్స్ కి,మీమర్స్ కి ఆ రేంజ్ లో స్టఫ్ ఇచ్చిందని మరి.అలాంటి కొరటాల   దేవర 2022తో  మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కడంతో ఇక మనవాడి జోరు మాములుగా ఉండదనుకున్నారంతా.ఇక సినిమా ఎండింగ్ లో  పార్ట్ 2 పక్కా అని క్లారిటీ ఇవ్వడం,పైగా  సినిమా ఏకంగా 500 కోట్ల క్లబ్ లోకి చేరడం తో తారక్ తో సినిమా వెంటనే పట్టాలెక్కేస్తుంది అని లెక్కలేశారు ట్రేడ్ ఓ పండిట్స్.

నిజంగానే టాలీవుడ్‌లో ఒక పెద్ద మిరాకిల్

కట్ చేస్తే సీన్ మరోలా ఉంది . తారక్  నీల్ డ్రాగన్ తో పాటు త్రివిక్రమ్ గాడ్ ఆఫ్ వార్ సినిమాతో బిజీ అయిపోవడంతో అనుకున్న దేవర  సీక్వెల్ ని కోల్డ్ స్టోరేజ్ లో పెట్టకతప్పలేదు కొరటాలకి . దీంతో ఎన్ని సక్సెస్ లు ఇచ్చినా హీరో దయతలచకపోతే సినిమా లేదు అన్నట్టుగా మారింది పరిస్థితి.ఒకరకంగా కొరటాల పని అయిపొయింది అన్నవాళ్ళే ఎక్కువ. అలాంటి సమయంలో  అందరి అంచనాలని తలకిందులు చేస్తూ కొరటాలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు బాలయ్య.నిజానికి  వీర సింహారెడ్డి ,డాకు మహారాజ్, అఖండ,భగవంత్ కేసరి వంటి సాలిడ్ హిట్స్ కొట్టిన బాలయ్య తో ఏంతో మంది సినిమాలు చేస్తామని క్యూలో ఉన్నా కొరటాల డేట్లు ఇవ్వడం అంటే నిజంగానే టాలీవుడ్‌లో ఒక పెద్ద మిరాకిల్ అని చెప్పాలి.

  కసితో  కనిపిస్తున్న కొరటాల

Advertisement

ఇక ఈ మధ్యే సినిమాకి మ్హూర్తం పెట్టేశారు కూడా.బాలయ్య పొలిటికల్ గా ఎంత బిజీగా ఉన్నా సినిమాలకి మాత్రం వరుస పెట్టి డేట్స్ ఇవ్వడం ఇక్కడ మెచ్చుకోతగ్గ విషయం.పైగా కొరటాల సినిమా కోసమే ఏకంగా ఆగస్ట్ మొత్తాన్ని అప్పగించాడట బాలయ్య. వాలకం చూస్తుంటే కొరటాల సింగిల్ షెడ్యూల్ లోనే లాగించేలా పక్కా ప్లాన్ వేశాడన్న మాట.అంటే వచ్చిన గ్యాప్ ని ఇలా కవర్ చేసి మరోసారి తన సత్తా ఏంటో ప్రూవ్ చేసుకోవాలని  కొరటాల వేస్తున్న ప్రతీ స్టెప్ లోనూ కేర్ తీసుకుంటున్నాడన్న క్లారిటీ వచ్చేస్తుంది.ఇక బాలయ్య తన దర్శకులకి సినిమా సెట్స్ లో ఎంతటి ప్రీడం ఇస్తాడో చెప్పక్కర్లేదు.ఇక ఈ ఫ్రీడం ని వాడుకొని మళ్లీ తన ‘మిర్చి’, ‘శ్రీమంతుడు’ రోజుల నాటి సక్సెస్‌ను రిపీట్ చేయాలన్న కసితో ఉన్నట్టు కనిపిస్తున్నాడు కొరటాల.

also read:ప్రకాష్ రాజ్ వర్సెస్ బండ్ల గణేష్ సరికొత్త పొలిటికల్ థ్రిల్లర్!

ఊరమాస్ అంటేనే కేరాఫ్ గా నిలిచే బాలయ్య

Advertisement

అయితే గతంలో కొరటాల తీసిన  సినిమా లని చూస్తె అవి పక్కా క్లాస్ తో, సొసైటీకి ఎదో మెసేజ్ ఇచ్చేద్దాం అన్న టెంప్లెట్ లో సాగిపోతాయి.ఇక బాలయ్య ని కూడా తనదైన మార్క్ తో చాలా సెటిల్డ్ గా చూపించబోతున్నాడట కొరటాల.మరి ఊరమాస్  అంటేనే కేరాఫ్ గా నిలిచే  బాలయ్య కి ఈ సెటిల్డ్  క్యారెక్టర్ ఎంతవరకు సెట్ అవుతుందో చూడాలి.అయితే క్యారెక్టర్ కాస్త సాఫ్ట్ అనిపించినా అభిమానులని ఎక్కడా డిసప్పాయింట్ చేయకుండా  కావాల్సిన చోట హీరోయిజం ఎలివేట్ చేస్తూ, దాదాపు నాలుగు నెలల పాటు స్క్రిప్ట్ వర్క్ చేశారట కొరటాల.మొత్తంగా తనని ట్రోల్ చేసిన వారికి సరైన సక్సెస్ తోనే వాళ్ళ నోళ్లకి తాళం వేయాలన్నది  కొరటాల ప్లాన్. ఇక  సినిమా హిట్ అయితే కొరటాలతో మళ్ళీ బడా హీరోలు ,ముఖ్యంగా ఎన్టీఆర్ మళ్లీ లైన్‌లోకి వచ్చి ‘దేవర పార్ట్ 2’చేద్దామనే అవకాశాలు లేకపోలేదు.

ఇక సినిమా అనుకున్నట్టుగా సాఫీగా సాగిపోతే  వచ్చే ఏడాది సమ్మర్ కల్లా ఈ సినిమా థియేటర్లలోకి వచ్చేలానే కనిపిస్తుంది.ఏది ఏమైనా కొరటాల వారి ఫ్యూచర్ బాలయ్య సినిమాతో ముడిపడి ఉందన్నది కాదనలేని వాస్తవం .

Related News

60 ఏళ్ల వయసులో పెళ్లి చేసుకున్న సల్మాన్ ఖాన్‌..వధువు ఎవరంటే? వీడియో వైరల్

తలైవా మాస్ జాతర మొదలైంది.. ‘జైలర్ 2’ ఫస్ట్ సాంగ్ ‘అల బొలెలో’ కుమ్మిపడేసిందిగా!

బండ్ల గణేష్ ‘మాస్ రాంపేజ్’.. మెగాస్టార్ బర్త్‌డే వేడుకల్లో ట్రోలర్స్‌కు సాలిడ్ కౌంటర్!

తండ్రీ కూతుళ్ల కథతో చిరంజీవి మాస్ మూవీ? ‘Mega 158’ పోస్టర్ వైరల్!

ఇరుముడి కోసం ఒక్కటైన హీరోల ఫ్యాన్స్.. అసలు కారణం ఇదే!

జ్వరం.. భుజంలో వాపు.. పవన్ కళ్యాణ్ ఆరోగ్యంపై బిగ్ అప్‌డేట్

టాలీవుడ్‌కు తెలంగాణ సర్కార్ ఫుల్ సపోర్ట్.. గిల్డ్ ప్రొడ్యూసర్స్ ఫుల్ హ్యాపీ

షావుకారు జానకి తొలి సంపాదన ఎంతో తెలుసా?

Big Stories

Advertisement
×