E-Paper
Advertisement

ధనుష్ ‘పొలిటికల్’ స్క్రీన్ ప్లే.. విజయ్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్నారా?

ధనుష్ ‘పొలిటికల్’ స్క్రీన్ ప్లే.. విజయ్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్నారా?
Advertisement

Dhanush Politics: తమిళనాడు సినిమాని రాజకీయాన్ని రెండు వేరువేరుగా చూడలేం .ఎంజీఆర్ కరుణానిధి, జయలలిత నుంచి దళపతి  విజయ్ వరకు ఎంతోమంది అసెంబ్లీ లోకి అడుగుపెట్టడం చాలా కామన్ అయిపోయింది.అయితే ఇదే సమయంలో కోలీవుడ్  సర్కిల్స్ లో మరో సెన్సేషన్ న్యూస్ వినిపిస్తుంది .

వర్సటైల్ యాక్టర్‌గా, నేషనల్ అవార్డు గ్రహీతగా తనకంటూ ఫ్యాన్ ఫాలోయింగ్ క్రియేట్ చేసుకున్న ధనుష్ త్వరలోనే పొలిటికల్ టర్న్ తీసుకోబోతున్నాడని  కోలీవుడ్ కొడైకొస్తుంది .అవును ఈ మధ్యకాలంలో ధనుష్ పొలిటికల్ స్ట్రాటజీలు చూస్తుంటే ఫ్యూచర్లో రాజకీయాల్లోకి అడుగుపెట్టడం పక్క అన్న అనుమానాలు రైజ్ అవుతున్నాయి .

Advertisement

తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్

ముఖ్యంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం కే స్టాలిన్ ని  ధనుష్ మర్యాదపూర్వకంగా కలవడం తమిళనాడు రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది.గతంలో ధనుష్ ని  అసురన్ సినిమాను చూసి స్టాలిన్ స్వయంగా అభినందించిన సంగతి తెలిసిందే .అయితే ఇప్పుడు కలవడం వెనుక కేవలం సినిమా టాపిక్  మాత్రమే లేదని అంతకుమించిన ఏదో వ్యూహమే నడుస్తుందని ఇన్సైడ్ టాక్ .

Advertisement

దీనికి తోడు ధనుష్ మక్కల్ నల ఇయక్కం‘ (ధనుష్ ప్రజా సంక్షేమ సంఘం) పేరుతో ఉన్న ఫ్యాన్స్ క్లబ్ గ్రౌండ్ లెవెల్ లో యాక్టివిటీస్ పెంచడం,సోషల్ మీడియాలో ఏకంగా ఒక జెండాను డిజైన్ చేసి వైరల్ చేయడం ఈ డౌట్స్ ని  మరింత రైజ్  చేస్తుంది .ఇక ఇక్కడే అసలైన పొలిటికల్ డిబేట్ మొదలైంది.

ధనుష్ క్రేజ్, వేరు విజయ్ క్రేజ్ వేరు

ఈమధ్య తమిళగ వెట్రి కళగం‘ (TVK) పార్టీ పెట్టి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన దళపతి విజయ్‌ను  ని ధనుష్ కూడా అదే బాటలో నడుస్తున్నారా,పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్న ట్టుగా ఉందా అంటూ డిబేట్ లు పెట్టేస్తున్నారు నెటిజెన్లు.నిజానికి ధనుష్ క్రేజ్, వేరు విజయ్ క్రేజ్ వేరు .విజయ్ మాస్  ఆడియన్స్ ని ఉపేసే కమర్షియల్ స్టార్ అయితే ధనుష్ క్లాస్ మాస్ అనే తేడా లేకుండా అందర్నీ ఆకట్టుకునే నేషనల్ స్టార్.

ఆడుకలం సినిమాతో మొదలుపెట్టి రాయన్, కుబేర వరకు ఆయన తీసే సినిమాల్లో అట్టడుగు వర్గాల వాయిస్ వినిపిస్తుంది.అందుకే ధనుష్‌కు కేవలం అభిమానులే కాదు, ఒక బలమైన సామాజిక వర్గం సపోర్ట్ కూడా ఉంది .విజయ్ లాంటి స్టార్ హీరోల రూట్ వేరు. వాళ్ళు నేరుగా సీఎం కూర్చుని టార్గెట్ చేస్తే పాలిటిక్స్ లోకి వస్తారు, కానీ ధనుష్  స్టైల్ వేరు.చాలా నిశ్శబ్దంగా తన నెట్వర్క్ ని బిల్డ్ చేసుకుంటున్నాడు .

పక్క పొలిటికల్ స్ట్రాటజీ

ఈ మధ్య తన 50 సినిమా రాయన్ సక్సెస్ తర్వాత ఆయన ఫ్యాన్స్ మీటింగ్ పెట్టడం, పూర్ పీపుల్ కి సహాయం చేయడం, అన్నదానాలను చేయడం వెనుక పక్క పొలిటికల్ స్ట్రాటజీ ఉందనేది విశ్లేషకుల మాట .ఇక విజయ్  కంటే  ధనుష్ కున్న అడ్వాంటేజ్ ఏంటంటే నటుడే  కాదు దర్శకుడు, నిర్మాత, లిరిస్ట్, సింగర్ కూడా. వై దిస్ కొలవరి పాటతో గ్లోబల్ వైట్ గా ఫేమస్ అయిన ధనుష్ హాలీవుడ్ మూవీ గ్రీన్ మ్యాన్ వరకు వెళ్లి సత్తా చాటిన సంగతి  తెలిసిందే .

also read :నాడు పర్సనల్ ఎటాక్.. నేడు బిజినెస్ ఎటాక్ ….నాగవంశీ టార్గెట్ సునీల్ నారంగేనా ?

ఒక రకంగా చెప్పాలంటే ఈ గ్లోబల్ ఇమేజ్, యూత్ అప్పీల్  ధనుష్ కి  పెద్ద ప్లస్ పాయింట్.అయితే ఈ పొలిటికల్ ఎంట్రీ పై ధనుష్ కాని ఆయన పీఆర్ టీం కానీ ఎక్కడ నోరు విప్పకపోవడం గమనార్హం . అయితే ఇండస్ట్రీలో పీక్స్ లో  ఉన్నప్పుడు పాలిటిక్స్ లోకి రావడం రిస్క్ అని కొందరు అంటే కరెక్ట్ టైం లోనే వచ్చి బేస్మెంట్ స్ట్రాంగ్ గా వేసుకుంటున్నారని మరికొందరి వాదన.ఏది ఏమైనా కోలీవుడ్ లో ఈ యంగ్ అండ్ డైనమిక్ స్టార్ వేస్తున్న అడుగులు ఫ్యూచర్ ఫ్యూచర్ తమిళనాడు రాజకీయాల్లో ఎలాంటి సంచనాలకు దారితీస్తాయో చూడాలి!

Related News

‘లెనిన్’ పై సెటైర్లు.. అఖిల్ కెరీర్‌ను తారక్ నిలబెట్టగలడా?

టాలీవుడ్ టు కోలీవుడ్.. శివాజీ కీలక పాత్రలో ప్రదీప్ రంగనాథన్ ‘అల్ఫా!

నాడు పర్సనల్ ఎటాక్.. నేడు బిజినెస్ ఎటాక్ ….నాగవంశీ టార్గెట్ సునీల్ నారంగేనా ?

బండ్ల గణేష్ కూతురి పెళ్లి పత్రికపై పవర్ స్టార్ ఫ్యాన్స్ సీరియస్..అసలేమైందంటే !

‘దేవర 2’ కావాలంటే బాలయ్యతో హిట్ కొట్టాల్సిందేనా ?

ఇండస్ట్రీలోకి కొత్త హీరో.. వారసుడి కోసం బడా సెలబ్రిటీలు!

నిర్మాతకు జ్ఞానోదయం.. నో వైరల్ స్పీచ్.. నో ఈవెంట్స్!

Big Stories

Advertisement
×