Romanchakam Glimpse: సందీప్ రెడ్డి వంగ ..వైల్డ్ ఇంటెన్స్ అండ్ వైలెన్స్ సినిమాలకి పెట్టింది పేరు .అలాంటి ఒక డైరెక్టర్ నుండి సినిమా వస్తుందంటే బాక్సాఫీస్ వద్ద ఎలాంటి అంచనాలు ఉంటాయో చెప్పక్కర్లేదు.అర్జున్ రెడ్డి సినిమాతో ఇండస్ట్రీలో సరికొత్త ట్రెండుకు శ్రీకారం చుట్టిన ఈ క్రేజీ డైరెక్టర్ బాలీవుడ్ లో తీసిన కబీర్ సింగ్, యానిమల్ సినిమాలు ఇండియన్ బాక్సాఫీస్ ఏ రేంజ్ లో షేక్ చేశాయో చెప్పక్కర్లేదు ముఖ్యంగా రణ్ బీర్ కపూర్ సినిమా ఏకంగా 900 కోట్లకు పైగా కొల్లగొట్టి వంగా బ్రాండ్ ని నేషనల్ వైట్ గా స్ప్రెడ్ చేసేసింది .
రూట్ మార్చిన సందీప్ రెడ్డి వంగా
ఇక ప్రస్తుతం ప్రభాస్ స్పిరిట్ ఆ తర్వాత బన్నీతో మరో క్రేజీ ప్రాజెక్టు కి లైన్ సెట్ చేసుకున్న ఈ సెన్సేషనల్ డైరెక్టర్ ఇప్పుడు రూట్ మార్చాడు .ఒకవైపు బడా సినిమాలని దర్శకత్వం వహిస్తూనే మరోవైపు చిన్న సినిమాలోని నిర్మించే పనిలో పడ్డాడు.ఈ క్రమంలో సందీప్ రెడ్డి వంగ ప్రెజెంటర్ గా భద్రకాళి పిక్చర్స్ అసోసియేషన్ లో ప్రణయ్ రెడ్డి వంగ నిర్మిస్తున్న లేటెస్ట్ ఫిలిం రోమాంచకం. మేమ్ ఫేమస్ సినిమాతో యూత్ లో మంచి ప్లేస్ దక్కించుకున్న ప్రామిసింగ్ హీరో సుమంత్ ప్రభాస్ ఈ సినిమాలో హీరోగా కనిపిస్తున్నాడు .
ఇక ఆయనకి జోడిగా 8 వసంతాలుతో మంచి మార్కులు కొట్టేసిన అనంతిక హీరోయిన్ గా నటిస్తోంది.వేణుగోపాల్ రెడ్డి దర్శకత్వంలో లవ్ కామెడీ సస్పెన్స్ ఎలిమెంట్స్ మిక్స్అప్ చేసిన ఈ సినిమా గ్లిమ్ప్స్ తాజాగా సోషల్ మీడియాలో వదిలారు మేకర్స్ .రిలీజ్ అయిన గ్లిమ్ప్స్ విషయానికొస్తే ఇది నెటిజెన్లను బాగా ఆకట్టుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ అయిపోయింది.
ఇదొక స్వచ్ఛమైన లవ్ స్టోరీ
జానకి రాముని హృదయం ఈ ప్రేమ కావ్యం మృదుమధురం అనే ఒక బ్యూటిఫుల్ క్లాసిక్ మెలోడీ సాంగ్ తో చాలా ప్రెసెంట్ గా ప్యూర్ లవ్ స్టోరీలా ప్రారంభమవుతుంది.హీరో హీరోయిన్ల మధ్య క్యూట్ లవ్ ట్రాక్ ,అందమైన బైక్ రైడ్స్ ,వైజాగ్ సముద్రతీరంలో ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పరిగెత్తే విజువల్స్ ఇవన్నీ చూస్తుంటే ఇదొక స్వచ్ఛమైన లవ్ స్టోరీ అనే ఫీలింగ్ వస్తుంది.అయితే ఒక్కసారిగా సీన్ రివర్స్ అవుతుంది హీరో హీరోయిన్లు రోడ్డుపై నడిరోడ్డున కాలర్ పట్టుకుని ఒకరినొకరు విపరీతంగా కొట్టుకుంటూ ఐ హేట్ యు అని అరుచుకోవడం చూస్తుంటే ఇదే లవ్ స్టోరీ కి ఇంటెన్స్ ని కూడా యాడ్ చేసినట్టు కనిపిస్తుంది .
మొత్తంగా ఈ ఒక్కట్విస్ట్ తోనే సినిమాలో సందీప్ రెడ్డి మార్క్ ఇంటెన్సిటీ ఎలా ఉండబోతుందో అర్థమవుతుంది .లవ్ అండ్ హేట్ మధ్య సాగే ఈ సరికొత్త లవ్ డ్రామా నుండి వదిలిన చిన్న గ్లిమ్ప్స్ ద్వారానే సినిమాపై అంచనాలను ఆకాశంలో పెట్టేశారు మేకర్స్ . ఇక ఈ సినిమాని వచ్చే వినాయక చవితికి అనగా సెప్టెంబర్ 3న వరల్డ్ వైడ్ గా రిలీజ్ చేయబోతున్నారట మేకర్స్ చూడాలి మరి దర్శకత్వంలో సెన్సేషన్ క్రియేట్ చేసిన సందీప్ రెడ్డి వంగ ప్రొడ్యూసర్ గా ఇలాంటి మ్యాజిక్ చేస్తాడో !