Pradeep Producer: ప్రదీప్ రంగనాథన్ ..సౌత్ సినిమా ఇండస్ట్రీలో ఈ పేరు ఇప్పుడొక సెన్సేషన్ .కోమలి సినిమాతో దర్శకుడుగా పరిచయమైన ప్రదీప్ తర్వాత లవ్ టు డే సినిమాతో దర్శకుడుగానే కాకుండా హీరోగాను బ్లాక్ బస్టర్ హిట్ కొట్టి ఓవర్ నైట్ స్టార్ డమ్ తెచ్చుకున్నాడు.ఇక ఆ క్రేజ్‌తోనే వరుసగా ‘డ్రాగన్’, ‘డ్యూడ్’ వంటి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ ఇట్స్ కొట్టిన ప్రదీప్ టాలీవుడ్, కోలీవుడ్లలో హ్యాట్రిక్ హీరోగా మారిపోయాడు .
అయితే రీసెంట్ గా విగ్నేష్ శివన్ దర్శకత్వంలో వచ్చిన లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ (ఎల్ఐసి) అనుకున్న స్థాయిలో ఆడకపోయినా ప్రదీప్ క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదని చెప్పాలి. మామూలుగా హీరోగా సక్సెస్ వస్తేనే వరుస పెట్టి సినిమాలు చేస్తుంటారు .అలాంటిది బేసిక్ గానే క్రియేటివ్ మైండ్ ఉన్న ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు అందర్నీ సర్ప్రైజ్ చేస్తూ ప్రొడక్షన్ లోకి అడుగు పెట్టాడు .అది కూడా సరికొత్త ఎక్స్పరిమెంట్ తో.
ఏకంగా ఆరుగురు డైరెక్టర్స్ కలిసి ఒక యూనిట్
ఇక ఈరోజు సోషల్ మీడియాలో ఒక చిన్న వీడియోను వదిలి తన సరికొత్త సినిమా ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చాడు కూడా ప్రదీప్ రంగనాథన్.అయితే ఇక్కడున్న విశేషమేంటంటే మామూలుగా ఒక సినిమాకు ఒకరే డైరెక్టర్ ఉంటారు.కానీ ప్రదీప్ నిర్మించబోయే ఈ క్రేజీ ప్రాజెక్టు ని ఏకంగా ఆరుగురు డైరెక్టర్స్ కలిసి ఒక యూనిట్ గా పనిచేయబోతుండడం విశేషం.ఇక ఈ ఆరుగురు డైరెక్టర్ల టీం కి ఆల్ఫా అని పేరు పెట్టాడు ప్రదీప్ .
also read :ధనుష్ ‘పొలిటికల్’ స్క్రీన్ ప్లే.. విజయ్‌ను చూసి వాతలు పెట్టుకుంటున్నారా?
ఒక రకంగా చెప్పాలంటే సినిమా ఇండస్ట్రీలోనే ఇది ఒక మోస్ట్ డేరింగ్అటెంప్ట్ .టాలెంట్ ఉన్న ప్రతి ఒక్కరికి సమానమైన గుర్తింపు దక్కాలని ఇలాంటి డిసిషన్ ప్రదీప్ తీసుకున్నట్లు తెలుస్తుంది .ఇక ఈ సినిమాకి ‘PRS 01’ అనే వర్కింగ్ టైటిల్ పెట్టగా రిలీజ్ చేసిన క్యాప్షన్స్ అండ్ పోస్టర్స్ చూస్తే స్టార్ అనే టైటిల్ ని అనుకుంటున్నారని క్లియర్ గా హింట్ ఇచ్చారు మేకర్స్.అయితే ఈ ప్రాజెక్టులో మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే ఇందులో విడిగా హీరో అంటూ ఎవరూ ఉండరు. ఇది పూర్తిగా ఫిమేల్ ఓరియెంటెడ్ స్టోరీ తో సాగనున్నట్టు తెలుస్తుంది ప్రేమలు సినిమాతో యూత్ కి క్రష్ గా మారిన మమత బైజు ,ప్రముఖ నటి శ్వాసిక ఇందులో పోషిస్తున్నారు .
కీలకమైన పాత్రలో టాలీవుడ్ సీనియర్ యాక్టర్ శివాజీ
ఇక వీరితోపాటు టాలీవుడ్ సీనియర్ యాక్టర్ బిగ్ బాస్ శివాజీ మరో కీలకమైన పాత్రలో నటిస్తుండడం విశేషం .ఇక ఓ మై కడవులే సినిమా డైరెక్టర్ అశ్వత్ మారి ముత్తు కూడా ఇందులో మరో కీ రోల్ పోషిస్తున్నాడు.ఇక ఈ సినిమాకి మ్యూజిక్ సెన్సేషన్ సాయి అభ్యంకర్ మ్యూజిక్ అందిస్తుండటం విశేషం.
ఇక ఇప్పటివరకు ప్రదీప్ చేసిన లవ్ టు డే వంటి సినిమాలు కేవలం యూత్ ని మాత్రమే టార్గెట్ చేస్తే ఈ ‘PRS 01’ అనే సినిమా పక్క యాక్షన్ బ్యాక్ డ్రాప్ తో ఊర మాస్ వయోలెన్స్ ఎలిమెంట్స్ తో కూడిన వోల్టేజ్ డ్రామాగా తెరకెక్కనుందని తెలుస్తుంది .ఇక టాలీవుడ్ లో ఇప్పటికే పలువురు యంగ్ హీరోస్ డైరెక్టర్లుగా మారేందుకు ప్లాన్ చేసుకుంటుంటే కోలీవుడ్ లో డైరెక్టర్ గా సత్తా చాటిన ప్రదీప్ రంగనాథన్ ఇప్పుడు ప్రొడ్యూసర్ గా మారి సినిమా తీయడం నిజంగా మెచ్చుకోదగ్గ విషయం.
చూడాలి మరి సినిమా ఇండస్ట్రీలో కొత్త ట్రెండ్ సెట్ చేయబోతున్న ఈ ఆరుగురు దర్శకుల యాక్షన్ ఎక్స్పెరిమెంట్ ఎలాంటి సక్సెస్ అందిస్తుందో!