Imanvi -Prabhas: పాన్ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ కెరియర్ పరంగా ఎంతో బిజీగా ఉన్నారు. ఇలా సినిమాల పరంగా ఎంతో బిజీగా ఉన్నప్పటికీ ఈయన మాత్రం తరచూ తన సినిమాలో పనిచేస్తున్న సెలబ్రిటీలకు ఊహించని విధంగా సర్ప్రైజెస్ ఇస్తూ ఉంటారు. ఇప్పటికే ఎంతోమంది సెలబ్రిటీలు ప్రభాస్ విందు చూసి ఆశ్చర్యపోయారు. తాజాగా ఫౌజీ (Fauzi)హీరోయిన్ ఇమాన్వి(Imanvi)కి సైతం ప్రభాస్ అదిరిపోయే ట్రీట్ ఇచ్చారని చెప్పాలి. ప్రభాస్ ప్రస్తుతం హను రాఘవపూడి(Hanu Raghavapudi) దర్శకత్వంలో ఫౌజీ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఈ సినిమా ఈ ఏడాది డిసెంబర్ నెలలో ప్రేక్షకుల ముందుకు రావాల్సి ఉండగా ఇంకా షూటింగ్ పూర్తికాని నేపథ్యంలో ఈ సినిమా డిసెంబర్ నుంచి తప్పుకుంది. ఈ సినిమాలో ప్రభాస్ జోడిగా ఇమాన్వీ హీరోయిన్ గా ఎంపిక అయ్యారు. ఈ సినిమా ద్వారా ఈమె ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం కాబోతున్నారు. అయితే అక్టోబర్ 13వ తేదీ నటి పుట్టినరోజు కావడంతో ఫౌజీ చిత్ర బృందం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక పోస్టర్ విడుదల చేశారు. అదేవిధంగా చిత్ర బృందం ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఇకపోతే ఇమాన్వీ పుట్టినరోజు కావడంతో ప్రభాస్ (Prabhas)ఆమెకు ఊహించని విధంగా వివిధ రకాల ఆహార పదార్థాలను పంపించు పుట్టినరోజు ట్రీట్ ఇచ్చారు. ఇలా ప్రభాస్ పంపిన ఫుడ్ కు సంబంధించిన ఫోటోలు వీడియోలను ఈమె సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ.. తన హృదయంతో పాటు కడుపు నిండిపోయింది అంటూ ప్రభాస్ పంపిన ఫుడ్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ఆయనకు ధన్యవాదాలు తెలిపారు. ప్రస్తుతం ఈ వీడియో కాస్త వైరల్ అవుతుంది. ఈమె పుట్టినరోజు సందర్భంగా వివిధ రకాల వంటలతో కూడిన భోజనాలను పంపించారు అందులో నాన్ వెజ్ తో పాటు, వివిధ రకాల ఫుడ్ ఐటమ్స్ ఉన్నట్టు తెలుస్తోంది.
Heart and stomach forever full 🙈🫶🏻
Thank you #Prabhas gaaru ❤️ pic.twitter.com/5bhuDxszXF— Imanvi (@imanviactress) October 14, 2026
సాధారణంగా ప్రభాస్ సినిమా షూటింగ్లో ఉంటే అక్కడ ఉన్నటువంటి వారందరికీ వారికి ఇష్టమైన ఆహార పదార్థాలను తెప్పించి మరి కడుపునిండా భోజనం పెడుతుంటారు. ఇక ఇప్పటికే ఆయనతో పని చేసిన హీరోయిన్లకు ఇలా ఫుడ్ పంపి వారిని సర్ప్రైజ్ చేశారు. ఇక తాజాగా ఇమాన్వి బర్త్డే సందర్భంగా ఈ ఫుడ్ పంపించారు. ఇక ఈ వీడియో పై ప్రభాస్ అభిమానులు స్పందిస్తూ.. ప్రభాస్ అంటే ఈ మాత్రం ఉండాల్సిందే అంటూ కామెంట్లు చేయగా మరికొందరు రాజు ఎక్కడున్నా రాజే అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఆతిథ్యం ఇవ్వటం రాజుగారి రక్తంలోనే ఉంది అంటూ మరికొందరు ప్రభాస్ ఆతిథ్యంపై కామెంట్లు చేస్తున్నారు. ఇక ప్రభాస్ ఈ సినిమాతో పాటు స్పిరిట్, కల్కి 2 సినిమా షూటింగ్ పనులలో బిజీగా ఉన్నారు.
Also Read: బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?