E-Paper
Advertisement

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్

భూమిని నాశనం చేయాలని దిగివచ్చే దేవుడు… డ్రాగన్ బాల్ ఫ్యాన్స్‌కు కొత్త యానిమే ట్రీట్
Advertisement

Anime Series on OTT : ప్రపంచం ప్రశాంతంగా ఉందంటే ప్రమాదం పూర్తిగా తొలగిపోయినట్టేనా ? ముఖ్యంగా భూమిని కాపాడే యోధులు ఉన్న విశ్వంలో, గ్రహాలనే నాశనం చేయగల శక్తి ఉన్న వ్యక్తి ఎదురైతే పరిస్థితి ఎలా ఉంటుంది ? ఒక్క విధ్వంస దేవుడి రాకతో భూమి భవిష్యత్తే ప్రమాదంలో పడితే, గోకు వంటి శక్తిమంతమైన యోధులు కూడా ఒకడుగు వెనక్కి వేయాల్సిందే. అలాంటి విశ్వస్థాయి పోరాటాన్ని మరింత అద్భుతమైన విజువల్స్తో, కొత్త కథనంతో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న యానిమే సిరీస్ ‘డ్రాగన్ బాల్ సూపర్ బీరస్’ (Dragon Ball Super Beerus). మరి యానిమే లవర్స్ దీన్ని ఎక్కడ చూడవచ్చు ? అనే వివరాల్లోకి వెళ్తే…

కథలోకి వెళ్తే…

మజిన్ బూతో జరిగిన భీకర పోరాటం ముగిసిన తర్వాత భూమిపై కొంతకాలం ప్రశాంతత నెలకొంటుంది. గోకు, అతని స్నేహితులు నార్మల్ గానే బతుకుతుంటారు. అయితే ఈ ప్రశాంతత వెనుక మరో ప్రమాదం నిద్రపోతూ ఉంటుంది. విశ్వ సమతుల్యతను కాపాడే బాధ్యత ఉన్న విధ్వంస దేవుడు బీరస్‌ ఎన్నో యుగాల నిద్ర తర్వాత మేల్కొంటాడు. అపారమైన శక్తి కలిగిన అతడు, తనకు కోపం వస్తే మొత్తం గ్రహాన్నే నాశనం చేయగలడు. అందుకే అతని మేల్కొలుపు గురించి తెలిసిన కై, సుప్రీమ్ కై వంటి వారు తీవ్ర ఆందోళనకు గురవుతారు. ఇదే సమయంలో విశ్వ చక్రవర్తి ఫ్రీజాను ఓడించిన సైయన్ యోధుడి గురించి బీరస్‌కు సమాచారం అందుతుంది. ఆ యోధుడు ఎవరో తెలుసుకోవాలనే ఆసక్తితో అతడు భూమి వైపు బయలుదేరతాడు.

Advertisement

అక్కడ గోకును కలుసుకున్న తర్వాత పరిస్థితులు మరింత ఉత్కంఠగా మారతాయి. గోకు ఎన్నో శత్రువులను ఓడించిన యోధుడే అయినా, బీరస్ శక్తి మాత్రం అతనికి పూర్తిగా భిన్నమైన స్థాయిలో ఉంటుంది. ఈ పోరాటంలో గోకు ఓడిపోతే అతని వ్యక్తిగత పరాజయంతోనే విషయం ముగియదు. భూమిపై ఉన్న అతని స్నేహితులు, కుటుంబం, చివరకు మొత్తం గ్రహమే ప్రమాదంలో పడే అవకాశం ఉంటుంది. కొత్త ప్రత్యర్థి ఎదురైతే అతని శక్తిని పరీక్షించాలనే గోకు స్వభావం ఇక్కడా కనిపిస్తుంది. అయితే బీరస్‌ను ఎదుర్కోవడానికి ధైర్యం, పోరాట నైపుణ్యం మాత్రమే సరిపోవు. అతని ఉద్దేశాన్ని అర్థం చేసుకోవడం, పరిస్థితి చేయి దాటకుండా చూడడం కూడా అంతే ముఖ్యం.

బీరస్‌ ఎందుకు భూమికి వచ్చాడు ? గోకు తన శక్తిని మరో స్థాయికి తీసుకెళ్లగలడా ? ఈ ఇద్దరి మధ్య జరిగే పోరు విశ్వ భవిష్యత్తును ఎలా మార్చబోతోంది ? విధ్వంస దేవుడి శక్తిని గోకు ఎదుర్కోగలడా ? భూమిని కాపాడేందుకు అతను ఎలాంటి కొత్త శక్తిని ప్రదర్శించాల్సి వస్తుంది ? అన్నది తెలియాలంటే సిరీస్ ను డోంట్ మిస్.

Advertisement

Also Read : లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

తెలుగులో చూడొచ్చా ?

‘డ్రాగన్ బాల్ సూపర్ బీరస్’ జపాన్‌లో అక్టోబర్ 11న విడుదలైంది. అంతర్జాతీయంగా క్రంచీరోల్‌ (Crunchyroll) వేదికపై కూడా ఈ సిరీస్ అందుబాటులోకి వచ్చింది. అయితే భారతదేశంలో Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సిరీస్ ప్రత్యేకత ఏమిటంటే, ఇది పూర్తిగా కొత్త కథ కాదు. గతంలో వచ్చిన డ్రాగన్ బాల్ సూపర్‌లోని బీరస్ కథాంశాన్ని మరింత మెరుగైన రూపంలో తిరిగి ఈ సిరీస్ రూపంలో అందిస్తున్నారు. విజువల్స్ ను మెరుగుపరచడంతో పాటు, పోరాట ఘట్టాలను మరింత ఎఫ్ఫెక్టివ్ గా తీర్చిదిద్దారు. దీంతో ఇప్పటికే ఈ కథను చూసిన అభిమానులు కూడా కొత్త అనుభూతిని పొందే అవకాశం ఉంది.

Tags

Related News

వందల అడుగుల ఎత్తులో ప్రాణాలతో పోరాటం… ప్రాణాంతక వ్యాధికి మందు కనిపెడితే ఇదా బహుమతి ? ఈ సర్వైవల్ థ్రిల్లర్ నెక్స్ట్ లెవల్

ప్రాణంగా ప్రేమించిన వాడిని పొట్టన పెట్టుకునే వైరస్… కన్నీళ్ళు పెట్టించే ఎమోషనల్ లవ్ స్టోరీ

ముప్పైల్లో హార్మోన్ల గోల… నవ్వలేక చస్తారు… నెట్‌ఫ్లిక్స్‌లోకి కొత్త స్టాండప్ స్పెషల్

లవర్ కి బ్రేకప్… కట్ చేస్తే మాజీ ప్రియుడితో మళ్లీ కనెక్షన్… ఓటీటీలోకి ఇంట్రెస్టింగ్ లవ్ ట్రయాంగిల్

రేపు ఒక్కరోజే ఓటీటీలోకి 2 సినిమాలు, 1 వెబ్‌సిరీస్, మోస్ట్ అవైటెడ్ రియాలిటీ షో… అన్నీ తెలుగులోనే

ప్రెగ్నెన్సీ లోనూ తగ్గేదేలే.. సమంత కొత్త అవతారం అదుర్స్!

కారు వద్దు బాబోయ్.. ముందు నా చలాన్లు కట్టండి! దర్శకుడు బాబు కామెంట్స్ వైరల్

Big Stories

Advertisement
×