Kriti shetty: ఉప్పెన సినిమా ద్వారా టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయమయ్యారు నటి కృతి శెట్టి(Kriti Shetty). బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైన ఈమె మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్నారు. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో కృతి శెట్టికి తదుపరి టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన సినిమాలలో నటించే అవకాశాన్ని అందుకున్నారు. ఉప్పెన (Uppena)తర్వాత ఈమె ఒక ఆరడజనుకు పైగా తెలుగు సినిమాలలో నటించినప్పటికీ ఏ సినిమా కూడా అనుకున్న స్థాయిలో సక్సెస్ అందించలేకపోయింది.
ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస డిజాస్టర్ సినిమాలతో సతమతమవుతున్న కృతి శెట్టి తన అదృష్టాన్ని పరీక్షించుకోవడం కోసం కోలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టారు. అక్కడ కూడా ఈమె హీరో కార్తీతో కలిసి అన్నగారు వస్తారు, లవ్ ఇన్సూరెన్స్ కంపెనీ వంటి సినిమాలలో నటించారు. ఈ సినిమాలు కూడా ఏమాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయాయి. దీంతో కృతి శెట్టికి హాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా నిరాశ ఎదురయింది. అయితే ఈ ముద్దుగుమ్మ ప్రస్తుతం బాలీవుడ్ ఇండస్ట్రీలో తన అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధమవుతున్నారు.
కృతి శెట్టి బాలీవుడ్ డెబ్యూ ఇవ్వబోతున్నారంటూ గత కొద్దిరోజులుగా వార్తలు వచ్చాయి.నేడు ఈ సినిమాకు సంబంధించిన విషయాన్ని తిరుమల శ్రీవారి సన్నిధిలో వెల్లడించారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో అసిస్టెంట్ డైరెక్టర్ గా డైలాగ్ రైటర్ గా మంచి గుర్తింపు సంపాదించుకున్న విధి ఘోడ్గాంకర్ దర్శకురాలిగా పరిచయం కానున్నారు. ఈమె డైరెక్షన్లో కృతి శెట్టి బాలీవుడ్ సినిమాలో నటించబోతున్నారు.అభిషేక్ ఎస్. వ్యాస్కు చెందిన ఏవీఎస్ స్టూడియోస్ ఈ ప్రాజెక్ట్ను నిర్మిస్తోంది. మరి ఈ సినిమాలో హీరో ఎవరు అనే విషయాలకు సంబంధించి త్వరలోనే అధికారక ప్రకటన రాబోతుంది. మరి బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్న ఈ ముద్దుగుమ్మకు అక్కడ ఎలాంటి అనుభవం ఎదురవుతుందనేది తెలియాల్సి ఉంది.
ఇక కృతి శెట్టి ప్రస్తుతం టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో హిట్ మిషన్ గా గుర్తింపు పొందిన డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో జనవరి 12 విడుదల (January 12 Vidudala)అనే సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి సినిమా అంటేనే సినిమాపై భారీగా అంచనాలు ఉన్నాయి. మరి కృతి శెట్టి డిజాస్టర్ హీరోయిన్ అనే టాగ్ ను అనిల్ రావిపూడి చెరిపేస్తూ తనకు సక్సెస్ ట్రాక్ ఇస్తారా? లేదా అనేది తెలియాల్సి ఉంది. ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో వెంకటేష్, కీర్తి సురేష్ జంటగా కనిపించగా కృతి శెట్టి జోడీగా కళ్యాణ్ రామ్ సందడి చేయబోతున్నారు.
Also Read: పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!