Rayan Actor: ఈ మధ్యకాలంలో కొంతమంది సెలబ్రిటీలు సినిమాల కంటే కూడా వ్యక్తిగత కారణాలవల్ల వార్తల్లో నిలుస్తూ అభిమానులను ఆశ్చర్యపరుస్తున్నారు. భార్య ఉండగానే ఇంకొకరితో అక్రమ సంబంధం కొనసాగించడం.. లేదా భార్య ఉండగానే ఇంకొకరిని వివాహం చేసుకోవడం ఇలా పలు కారణాలవల్ల కొంతమంది వార్తల్లో నిలుస్తున్నారు. ఈ క్రమంలోనే ఒక నటుడిపై ఆయన మొదటి భార్య తనను మోసం చేశాడు అంటూ కేసు ఫైల్ చేయించడం వైరల్ గా మారింది.
ఆయన ఎవరో కాదు ప్రముఖ తమిళ నటుడు శరవణన్ (Saravanan). నటుడిగా తనకంటూ ఒక గుర్తింపును అందుకున్న ఈయన ఇప్పుడు వ్యక్తిగత కారణాల వల్ల ఇబ్బందులు ఎదుర్కోవడం ఆశ్చర్యంగా మారింది. అసలు విషయంలోకి వెళ్ 2003లో సూర్య శ్రీ అనే యువతిని ప్రేమించి మరీ వివాహం చేసుకున్నారు. కానీ 2015లో శ్రీదేవి అనే యువతితో పరిచయం పెంచుకొని.. ఆమెతో సహజీవనం చేయడం మొదలుపెట్టారు. మూడేళ్లకు అంటే 2018లో రెండో వివాహం చేసుకున్నారు. ఇక్కడ మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. స్థానిక మాంగాడు సమీపంలోని మౌళివాక్యంలో ఉన్న ఒకే భవనంలో మొదటి అంతస్తులో మొదటి భార్య.. కింద అంతస్తులో రెండవ భార్యతో ఆయన కలిసి నివసిస్తున్నారు. అయితే ఇప్పుడు ఆవడి పోలీస్ స్టేషన్ పరిధిలో పోలీస్ శాఖ ప్రజా సమస్యల కార్యక్రమాన్ని నిర్వహించగా.. అందులో శరవణన్ పై ఆయన మొదటి భార్య హత్యా బెదిరింపు ఫిర్యాదు చేసింది.
also read :Bakasura Restaurant OTT: నెల తిరగకుండానే ఓటీటీ స్ట్రీమింగ్ కి రాబోతున్న బకాసుర రెస్టారెంట్!
హత్యా బెదిరింపులు కేసులో..
ఆమె తన ఫిర్యాదులో 1996 నుండి 2003 వరకు శరవణన్ తో సహజీవనం చేసి, ఆ తర్వాత పెళ్లి చేసుకున్నాము. అప్పుడు నేను కస్టమ్స్ ఏజెన్సీలో ఉద్యోగం చేయడం వల్ల డబ్బు బాగానే ఉండేది. దాంతో శరవణన్ ను పలుమార్లు ఆదుకున్నాను. ఇప్పుడు నాకు అన్నం పెట్టడానికి ఆయన ముందుకు రావడం లేదు. రెండో పెళ్లి చేసుకున్న అమ్మాయితో కలిసి నాకు హత్యా బెదిరింపులు చేస్తూ హింసిస్తున్నారు. పైగా జీవనభత్యంగా రూ.40 లక్షలు ఇస్తానని చెప్పి ఇవ్వకుండా మోసం చేశారు. ఆయనపై తగిన చర్యలు తీసుకోండి ” అంటూ ఆమె తన ఫిర్యాదులో తెలిపింది. ఇక ప్రస్తుతం ఈ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.
శరవణన్ నటించిన సినిమాలు..
జైలర్ , రాయన్, మేడం సార్ వంటి చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకు కూడా పరిచయమయ్యారు. 1995లో వచ్చిన వైదేహి వందాచ్చు అనే తమిళ్ చిత్రం ద్వారా హీరోగా పరిచయమైన ఈయన.. ఆ తర్వాత అభిరామి, మామియార్ విడు, పొండాటి రాజ్యం వంటి చిత్రాలలో నటించి మంచి పేరు సొంతం చేసుకున్నారు.
?utm_source=ig_web_copy_link