Fish Venkat health:ప్రముఖ కమెడియన్ ఫిష్ వెంకట్ (Fish Venkat) గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా ఆయన రెండు కిడ్నీలు పాడవడంతో వెంటనే కిడ్నీ మార్పిడి చేయాలి అని, దానికోసం రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని వైద్యులు తెలిపారు. ఇక ఆర్థిక సహాయం కోసం ఫిష్ వెంకట్ కూతురు, భార్య సినీ ఇండస్ట్రీ పెద్దలను వేడుకుంటున్నప్పటికీ.. ఎవరూ కూడా స్పందించిన దాఖలాలు కనిపించలేదు. మొన్నటికి మొన్న ప్రభాస్ (Prabhas ) పేరు పైన ఒక వ్యక్తి ఫోన్ చేసి 50 లక్షల సహాయం చేస్తామని హామీ ఇచ్చారు . వెంటనే సంతోషం వ్యక్తం చేసిన తల్లీ కూతుర్లు మీడియా ముందుకు తమకు ప్రభాస సహాయం చేస్తామని ప్రకటించారు అని.. సంతోషం వ్యక్తం చేశారు. వైద్యానికి సరిపడా అన్ని ఏర్పాట్లు చేసుకొని సదరు వ్యక్తికి ఫోన్ చేస్తే..ఆ వ్యక్తి ఫోన్ రిసీవ్ చేయలేదని ప్రభాస్ పేరిట తమను మోసం చేశారు అని ఫిష్ వెంకట్ భార్య, కూతురు ఆవేదన వ్యక్తం చేశారు.
సహాయం కోసం ఎదురుచూస్తున్న ఫిష్ వెంకట్ భార్య, కూతురు..
ఇక ఇటీవల తెలంగాణ మంత్రులు ఫిష్ వెంకట్ ను పరామర్శించి..తమ వంతు ఆర్థిక సహాయం ప్రకటించారు. అలాగే ప్రభుత్వం తరఫున కచ్చితంగా ట్రీట్మెంట్ కి అవసరమయ్యే డబ్బులు ఇప్పిస్తామని హామీ ఇచ్చారు. అలాగే యంగ్ హీరో విశ్వక్ సేన్ (Vishwak sen) కూడా ఫిష్ వెంకట్ కి రెండు లక్షల రూపాయలు సహాయం అందించి, వైద్య ఖర్చులకు సహాయపడ్డారు. ఇక చిరంజీవి(Chiranjeevi), పవన్ కళ్యాణ్(Pawan Kalyan), నాగార్జున(Nagarjuna )లాంటి పెద్ద హీరోలు ఏమైనా ఈయన ఆరోగ్య పరిస్థితి తెలుసుకొని స్పందిస్తారని, ఆర్థిక సహాయం చేస్తారని ఎంతగానో ఎదురు చూసినా.. ఈ విషయం వారికి చేరిందో లేదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడిందని అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
విషమంగా మారిన ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి..
ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. ఆయన పరిస్థితి మరింత విషమంగా మారిందని తెలుస్తోంది. కళ్ళు కూడా తెరవలేని పరిస్థితుల్లో ఫిష్ వెంకట్ ఉండడంతో.. ఆయనను వెంటనే వేరే హాస్పిటల్కు తరలించినట్లు సమాచారం. ముఖ్యంగా రెండు కిడ్నీలను వైరస్ డామేజ్ చేయడం వల్లే ప్రస్తుతం ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నారు ఫిష్ వెంకట్.. ఆయన పరిస్థితి సీరియస్ గా ఉందని వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో కనీసం ఇప్పటికైనా పెద్ద హీరోలు స్పందించి 50 లక్షలు సహాయం చేయాలి అని ఇటు నెటిజెన్స్ కూడా కామెంట్లు చేస్తున్నారు. మరి ఫిష్ వెంకట్ ఆరోగ్య పరిస్థితి పై ఎవరు స్పందిస్తారో చూడాలి.
ఫిష్ వెంకట్ సినిమాలు..
‘ఆది’ అనే సినిమా ద్వారా 2002లో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఫిష్ వెంకట్.. ఆ తర్వాత భగీరథ, బన్నీ, సామాన్యుడు, కింగ్, హీరో, శౌర్యం, రెడీ ఇలా చాలా సినిమాలలో నటించారు. ముఖ్యంగా గబ్బర్ సింగ్ సినిమాలో తన అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.ఈ ఏడాది కాఫీ విత్ కిల్లర్ సినిమాలో కూడా నటించారు ఫిష్ వెంకట్. ఇంతమంది స్టార్ హీరోలు సినిమాలలో నటించి ఇప్పుడు ఇలా సహాయం కోసం ఎదురుచూడడం నిజంగా బాధాకరమని చెప్పాలి.
ALSO READ:Sai Pallavi: ద్రాక్ష పళ్లతో సాయి పల్లవి డ్రెస్… ఎంత అద్భుతంగా ఉందో మీరే చూడండి.?