Actress Outfit:ఏఐ అందుబాటులోకి వచ్చాక సినిమా సెలబ్రెటీలకు సంబంధించి ఎన్నో అద్భుతమైన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. కొంత మంది హీరోయిన్లు ఫ్రూట్స్ డ్రెస్ లలో, ఇడ్లీ,దోశ వంటి డ్రెస్ లలో ఎలా కనిపిస్తారో ఏఐ ద్వారా క్రియేట్ చేసిన కొన్ని వీడియోలు చక్కర్లు కొడుతున్నాయి.ఆ ఫొటోస్ చూస్తే అబ్బా హీరోయిన్లు ఎంత అద్భుతంగా ఉన్నారు ఈ డ్రెస్సుల్లో.. అంటూ ఈ వీడియోని చూసిన చాలా మంది హీరోయిన్ల అభిమానులు సంబర పడిపోతున్నారు. మరి ఇంతకీ హీరోయిన్లు ఎలాంటి డ్రెస్సులలో ఉన్న ఏఐ వీడియో(AI Videos) లు చెక్కర్లు కొడుతున్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. నయనతార (Nayanthara), కాజల్ అగర్వాల్ (Kajal Agarwal), సాయి పల్లవి(Sai Pallavi), త్రిష కృష్ణన్(Trisha Krishnan), అనుష్క శెట్టి(Anushka Shetty), తమన్నా భాటియా (Tamannaah Bhatia) ఇలా చాలామంది హీరోయిన్లకు సంబంధించిన ఏఐ పిక్స్ నెట్టింట్లో వైరల్ అవుతున్నాయి.
ద్రాక్ష పళ్ళ డ్రెస్ లో అద్భుతంగా ఆకట్టుకుంటున్న సాయి పల్లవి..
ఇందులో మొదట దోశెల డ్రెస్ లో నయనతార, ఇడ్లీల సారీ లో అనుష్క శెట్టి (Anushka Shetty), ద్రాక్ష పళ్ళ డ్రెస్ లో సాయి పల్లవి(Sai Pallavi), చపాతి డ్రెస్సులో కాజల్ అగర్వాల్ (Kajal Agerwal), నూడిల్స్ లెహంగాలో త్రిష కృష్ణన్ (Trisha Krishnan), వడల డ్రెస్ లో తమన్నా భాటియా(Tamannaah Bhatia) ఇలా ఈ హీరోయిన్స్ అందరికీ సంబంధించి ఫ్రూట్స్, టిఫిన్స్ రూపంలో ఉండే డ్రెస్సులో ఉన్న ఏఐ పిక్స్, వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.ఇక ఈ ఏఐ డ్రెస్సులో హీరోయిన్స్ అందరూ అద్భుతంగా కనిపిస్తున్నారు. ముఖ్యంగా సాయి పల్లవి ద్రాక్ష పళ్ళ డ్రెస్ లో కనిపించి మరింత అట్రాక్షన్ గా నిలిచింది.
హీరోయిన్ లకే కాదు హీరోలకి కూడా..
ఇక ఈ హీరోయిన్లకు సంబంధించిన ఏఐ ఫొటోస్ మాత్రమే కాకుండా ఇలాంటి ఏఐ పిక్స్ హీరోలవి కూడా నెట్టింట వైరల్ అవుతున్నాయి. అందులో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) చాయ్ అమ్మే వాడిగా.. అల్లు అర్జున్ రామ్ చరణ్ (Allu Arjun, Ram Charan)లు చపాతి కాలుస్తూ ఉండే లేడీ గెటప్ లో,జూనియర్ ఎన్టీఆర్ (Jr.NTR)వాకిలి ఊడ్చే లేడీ గెటప్ లో, ప్రభాస్ (Prabhas)గడ్డి మోసే లేడీ గెటప్ లో, చిరంజీవి(Chiranjeevi) దోశె వేసే లేడీ గెటప్ లో ఉండే ఏఐ వీడియోస్ నెట్టింట వైరల్ గా మారాయి.
నిజ జీవితానికి అద్దం పడుతున్న ఏఐ వీడియోలు..
అలా ఏఐ క్రియేషన్స్ తో చాలామంది హీరో హీరోయిన్లకు సంబంధించి ఫోటోలు, వీడియోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇది మాత్రమే కాకుండా చాలామంది సెలబ్రిటీలు సీక్రెట్ గా పెళ్లిళ్లు చేసుకున్నట్టు ఏఐ ఫొటోస్ క్రియేట్ చేశారు. ఇందులో కొంతమంది మెడలో పూలదండలు వేసుకొని ఎంగేజ్మెంట్ చేసుకున్నట్టు, మరికొంతమంది సెలబ్రిటీలు వెకేషన్ లకి వెళ్ళినట్టు వెకేషన్ ఫొటోస్, బికినీలు వేసుకున్నట్టు బీచ్ ఫొటోస్, లిప్ లాక్ లు పెట్టుకున్నట్టు ఇలా ఎన్నో ఏఐ క్రియేటెడ్ ఫొటోస్, వీడియోస్ సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఏఐ ఫొటోస్ అప్పుడప్పుడు అభిమానులను కూడా కన్ఫ్యూజ్ చేస్తూ నిజంగానే ఈ సెలబ్రిటీలు పెళ్లిళ్లు చేసుకున్నారా… వెకేషన్ లకి వెళ్ళారా అని ఆశ్చర్యపోయేలా కనిపిస్తున్నాయి.
ALSO READ:Kangana Ranaut: కంగనా రనౌత్ అసంతృప్తి… ఎంపీకి రాజీనామా?
?utm_source=ig_web_copy_link