Fish Venkat Remuneration: సినీ నటుడు ఫిష్ వెంకట్ (Fish Venkat)అనారోగ్య సమస్యల కారణంగా గత రాత్రి హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించిన విషయం తెలిసినదే. ఇలా ఈయన మరణం తరువాత ఫిష్ వెంకట్ కి సంబంధించిన ఎన్నో విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. వ్యక్తిగత జీవితంలో ఆయన ఎలాంటి వ్యక్తి, ఆయన కుటుంబ నేపథ్యం, ఆయన సినిమాల గురించి, రెమ్యూనరేషన్ గురించి ఎన్నో విషయాలు వెలుగులోకి వచ్చాయి. వెంకట్ సుమారు 100కు పైగా సినిమాలలో నటించిన కనీసం అనారోగ్య సమస్య బారిన పడితే వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బులు లేని స్థితికి వచ్చారు.
జబర్దస్త్ నవీన్..
ఇలా వందల సినిమాలలో నటించిన నటుడు సరైన వైద్యం అందక మరణించారనడం ఎంతో బాధాకరం. ఫిష్ వెంకట్ చివరి రోజులలో అనారోగ్య సమస్యల కారణంగా సినిమా ఇండస్ట్రీకి కూడా దూరంగా ఉన్నారు. అయితే ఈయన మరణం తర్వాత తనని చివరిసారి చూడటం కోసం పెద్ద ఎత్తున గబ్బర్ సింగ్ కమెడియన్ బ్యాచ్ తో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు. ఇలా జబర్దస్త్ కార్యక్రమంలో కమెడియన్ గా గుర్తింపు పొందిన నవీన్(Jabardasth Naveen) సైతం ఫిష్ వెంకట్ చివరి చూపుకు వచ్చారు. ఈ క్రమంలోనే ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు విషయాలను తెలిపారు.
ఖర్చుతో కూడుకున్నది..
ఫిష్ వెంకట్ ఆరోగ్యం గురించి మాకు ముందే తెలుసు. అప్పటినుంచి తరచు తనతో ఫోన్లో మాట్లాడుతూ ఉన్నామని అయితే ఇటీవల హాస్పిటల్ లో అడ్మిట్ అయినప్పుడు వెళ్లి అందరు పరామర్శించామని తెలిపారు. ఇలా హాస్పిటల్లో అడ్మిట్ అయినప్పుడే తన పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు తెలియజేసినట్లు నవీన్ తెలిపారు. ఫిష్ వెంకట్ సుమారు వందకు పైగా సినిమాలలో నటించారు మరి చికిత్సకు డబ్బులు లేకపోవడం ఏంటి? అనే ప్రశ్న కూడా ఎదురయింది. ఆర్టిస్టులు సినిమాలలో నటిస్తే వారికి పెద్ద ఎత్తున రెమ్యూనరేషన్ వస్తుంది అనుకోవడం పొరపాటని ఏ రోజు డబ్బులు ఆరోజు ఖర్చులకే సరిపోతాయని నవీన్ తెలిపారు.
హైయెస్ట్ రెమ్యూనరేషన్ అదే..
ఫిష్ వెంకట్ కెరియర్ మొదట్లో ఒక్కో సినిమాకు 2వేల రూపాయల నుంచి రెమ్యూనరేషన్ (Remuneration) తీసుకున్నారని తెలిపారు. మంచి గుర్తింపు వచ్చిన తర్వాత ఒక్కో సినిమాకు 30 వేల రూపాయల వరకు తీసుకున్నారని ఇదే హైయెస్ట్ రెమ్యూనరేషన్ అంటూ నవీన్ తెలిపారు. ఇలా ఒక్కో సినిమా చేస్తే 30 వేల రూపాయలు వస్తే ఫ్యామిలీ కోసమే సరిపోతుంది, మరి ఇలాంటి జబ్బులకు ట్రీట్మెంట్ చేయించుకోవడానికి ఏం సరిపోతుందని నవీన్ మాట్లాడారు. ఫిష్ వెంకట్ కు వచ్చిన జబ్బు చాలా ఖరీదుతో కూడుకున్నదని ఈయన తెలియచేశారు. వందల సినిమాలలో నటించిన ఈయన కేవలం ఒక్కో సినిమాకు రూ. 30 వేల హైయెస్ట్ రెమ్యూనరేషన్ అనే విషయం తెలియడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ఒక సినిమా కోసం కొన్ని నెలలపాటు కష్టపడితే 30,000 ఇవ్వటం నిజంగా దారుణం అంటూ ఈ విషయం తెలిసిన ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు.
Also Read: Nidhhi Agerwal : హనుమకొండ గోయాజ్ సిల్వర్ జ్యువెలరీ స్టోర్ ప్రారంభించిన నిధి అగర్వాల్!