Colon Cancer: పెద్దపేగు క్యాన్సర్, లేదా కొలొరెక్టల్ క్యాన్సర్.. పెద్దపేగు (కోలన్) లేదా పురీషనాళం (రెక్టం) లో ప్రారంభమయ్యే ఒక రకమైన క్యాన్సర్. ఇది పురుషులు, స్త్రీలు ఇద్దరిలోనూ వస్తుంది. కానీ మహిళలల్లో ఈ క్యాన్సర్ బారిన పడినప్పుడు కొన్ని ప్రత్యేకమైన లక్షణాలను కనిపిస్తాయి లేదా ఈ లక్షణాలను ఇతర సాధారణ ఆరోగ్య సమస్యలుగా పొరబడే అవకాశం ఉంటుంది.ఇలాంటి సమయంలో ముందుగానే లక్షణాలను గుర్తించడం, చికిత్స పొందడం వల్ల క్యాన్సర్ నయమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి.
పెద్దపేగు క్యాన్సర్ యొక్క సాధారణ లక్షణాలు (మహిళల్లో కూడా):
పెద్దపేగు క్యాన్సర్ యొక్క కొన్ని సాధారణ లక్షణాలు స్త్రీలు, పురుషులు ఇద్దరిలోనూ ఒకే విధంగా ఉంటాయి. వీటిలో మలబద్ధకం లేదా విరేచనాలలో మార్పు, మీ పేగు అలవాట్లలో అకస్మాత్తుగా లేదా నిరంతర మార్పు గమనించినట్లయితే.. అది ఒక హెచ్చరిక సంకేతం కావచ్చు. ఇది కొన్ని వారాలకు పైగా కొనసాగితే జాగ్రత్తగా ఉండాలి.
మలంలో రక్తం లేదా నల్లటి మలం:
మలంలో ఎరుపు రక్తం లేదా నల్లటి, టారీ మలం కనిపించడం పెద్దపేగు క్యాన్సర్ యొక్క ముఖ్యమైన లక్షణం. ఇది పైల్స్ లేదా ఇతర సాధారణ కారణాల వల్ల కూడా కావచ్చు, కానీ ఇలాంటి సమయంలో వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి.
కడుపు నొప్పి, తిమ్మిర్లు లేదా గ్యాస్: నిరంతరం కడుపు నొప్పి, తిమ్మిర్లు లేదా విపరీతమైన గ్యాస్ సమస్యలు ఉంటే ఇది కూడా క్యాన్సర్ ఒక లక్షణం కావచ్చు. ఈ లక్షణాలను చాలా మంది అజీర్తి లేదా ఇతర జీర్ణ సమస్యలు అని అశ్రద్ధ చేస్తుంటారు.
బరువు తగ్గడం: ఆహారం లేదా వ్యాయామం లేకుండా అకస్మాత్తుగా బరువు తగ్గడం క్యాన్సర్ వంటి అంతర్లీన సమస్యకు సంకేతం కావచ్చు.
అలసట, బలహీనత: రక్తం కోల్పోవడం వల్ల ఐరన్ లోపం అనీమియా (రక్తహీనత) ఏర్పడి.. విపరీతమైన అలసట, బలహీనతకు దారితీస్తుంది.
పూర్తిగా పేగు ఖాళీ కాని భావన: మల విసర్జన తర్వాత కూడా పేగు పూర్తిగా ఖాళీ కాలేదనే భావన కలగడం.
మహిళల్లో ప్రత్యేకంగా కనిపించే లక్షణాలు:
గ్యాస్ లేదా ఉబ్బరం: మహిళలు సాధారణంగా పీరియడ్స్ లేదా జీర్ణ సమస్యల కారణంగా ఉబ్బరం లేదా గ్యాస్ సమస్యలను అనుభవిస్తారు. అయితే.. నిరంతర, తీవ్రమైన ఉబ్బరం పెద్దపేగు క్యాన్సర్ లక్షణం కావచ్చు.
Also Read: వర్షాకాలంలో బట్టలు త్వరగా ఆరిపోవాలా ?
కటి నొప్పి : పెద్దపేగు క్యాన్సర్ కటి ప్రాంతంలో నొప్పిని కలిగిస్తుంది. దీనిని అండాశయ తిత్తులు (ఓవేరియన్ సిస్ట్స్), ఫైబ్రాయిడ్లు లేదా ఎండోమెట్రియోసిస్ వంటి స్త్రీ సంబంధిత సమస్యలతో పొరబడే అవకాశం ఉంది. అందుకే చాలా జాగ్రత్తగా ఉండాలి.
నడుము నొప్పి: అరుదుగా.. క్యాన్సర్ వెన్నెముకకు లేదా సమీపంలోని నరాలకు వ్యాపించినప్పుడు నడుము నొప్పి వచ్చే అవకాశం కూడా ఉంటుంది.
మూత్రనాళ సమస్యలు: క్యాన్సర్ పొరుగున ఉన్న మూత్రా శయంపై ఒత్తిడి తెచ్చినప్పుడు, తరచుగా మూత్ర విసర్జన లేదా మూత్రనాళ ఇన్ఫెక్షన్లు వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి సమయంలో డాక్టర్‌ను సంప్రదించాలి.