Gali Kireeti : తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో బ్యాగ్రౌండ్ తో చాలామంది హీరోలుగా మారుతుంటారు. కొంతమందికి సినిమా బ్యాక్ గ్రౌండ్ ఉంటే, మరి కొందరికి పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ ఉంటుంది. పొలిటికల్ బ్యాక్ గ్రౌండ్ తో వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. ఇక రీసెంట్ గా గాలి జనార్దన్ రెడ్డి కుమారుడు గాలి కిరీటి హీరోగా జూనియర్ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే.
జూనియర్ సినిమా నుంచి ఇప్పటికే ఒక పాట రిలీజ్ అయింది. ఆ పాటలు కిరీటి వేసిన స్టెప్స్ చాలామందిని విపరీతంగా ఆకట్టుకున్నాయి. యాక్టింగ్ పరంగా పక్కన పెడితే డాన్స్ లో మాత్రం అద్భుతంగా చేశాడు అని ప్రూవ్ చేసుకున్నాడు. దేవిశ్రీప్రసాద్ అందించిన సంగీతం కూడా అదే స్థాయిలో ఉంది.
ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టం
ప్రతి హీరోకి కూడా కొంతమంది అభిమానులు ఉంటారు. కొంతమంది హీరోలు కూడా వేరే హీరోలకు అభిమానులుగా ఉంటారు. పవన్ కళ్యాణ్ కు తెలుగు ఫిలిం ఇండస్ట్రీలోనే చాలామంది అభిమానులు ఉన్నారు. అలానే కిరీటి విషయానికొస్తే ఎన్టీఆర్ అంటే విపరీతమైన ఇష్టమని పలు సందర్భాల్లో చెప్పాడు. రీసెంట్ గా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ నేను తెలుగు సినిమాలు విపరీతంగా చూసేవాన్ని. నాకు ఎన్టీఆర్ నటించిన టెంపర్ సినిమా చాలా ఇష్టం. ఆయనను ఒక్కసారి కూడా కలిసే అవకాశం రాలేదు. ఆయనను కలిస్తే నేను అదృష్టంగా భావిస్తాను. ఇక అమ్మ మీద ప్రేమను చెప్పమంటే ఎలా చెప్పలేము ఎన్టీఆర్ మీద ప్రేమను చెప్పమన్నా కూడా చెప్పలేము అంటూ ఆ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ అభిమానులు ఈ వీడియోను సోషల్ మీడియాలో వైరల్ చేయడం మొదలుపెట్టారు.
శ్రీ లీలా ఎనర్జీ మ్యాచ్ చేశాడు
శ్రీ లీలా అంటేనే డాన్సులకు పెట్టింది పేరు. తన ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. తన ఎనర్జీని మ్యాచ్ చేయడం అంత ఈజీ కాదు అని కొందరు అంటూ ఉంటారు. కానీ ఈ విషయంలో మాత్రం పర్ఫెక్ట్ గా చేశాడు కిరీటి. ఈ పాట చూసిన తర్వాతే సినిమా మీద అంచనాలు మరికొంత పెరిగాయి. ఇక ఈ సినిమా విడుదలకు సిద్ధమవుతున్న తరుణంలో పలు రకాల ఇంటర్వ్యూలో పాల్గొంటున్నారు కిరీటి. ఇక రీసెంట్ గా రిలీజ్ అయిన ట్రైలర్ కొంతమేరకు పరవాలేదు అనిపించుకుంది. ఈ సినిమాకి పెద్ద పెద్ద టెక్నీషియన్స్ అందరూ వర్క్ చేస్తున్నారు.