Nidhi Agarwal: తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో హీరోయిన్ గా నిలబడటం అనేది మామూలు విషయం కాదు. కొన్నిసార్లు సినిమాలు హిట్ అయినా కూడా అవకాశాలు వస్తాయి అని చెప్పలేము. దీనికి మంచి ఉదాహరణ పూరి జగన్నాథ్ సినిమాల్లో పనిచేసే కొంతమంది హీరోయిన్లు. చిరుత సినిమా పెద్ద హిట్ అయినా కూడా నేహా శెట్టి ఆ తర్వాత కనిపించకుండా పోయింది.
కొన్నిసార్లు సినిమాలు ఫెయిల్ అయిన కూడా ఆ హీరోయిన్ కి వరుసగా అవకాశాలు వస్తాయి. ఈ విషయానికి మంచి ఉదాహరణ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేదు. కానీ ఈమెకు మాత్రం వరుసటి అవకాశాలు వచ్చాయి. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్ వంటి హీరోలతో కూడా పనిచేసే అవకాశం శ్రీ లీలా కు దక్కింది. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో ఉన్న హీరోయిన్స్ లో నిధి అగర్వాల్ ఒకరు.
షాకింగ్ కండిషన్స్ కి ఓకే
సవ్యసాచి సినిమాతో తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది నిధి అగర్వాల్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఊహించని సక్సెస్ సాధించలేకపోయింది. ఆ తర్వాత చేసిన మిస్టర్ మజ్ను సినిమా కూడా అంతంత మాత్రమే ఆడింది. పూరి జగన్నాథ్ దర్శకత్వంలో వచ్చిన ఇస్మార్ట్ శంకర్ సినిమా మంచి సక్సెస్ సాధించింది. అయితే ఆ సినిమా తర్వాత వరుసగా అవకాశాలు ఏమీ వచ్చు పడిపోలేదు. ఇక ప్రస్తుతం పవన్ కళ్యాణ్ నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో నిధి అగర్వాల్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా పూర్తయినంతవరకు మరో సినిమా చేయను అని అగ్రిమెంట్లో సంతకం పెట్టింది నిధి. ఈ విషయాన్ని స్వయంగా నిర్మాత ఏం రత్నం తెలిపారు. పవన్ కళ్యాణ్ తో సినిమా కోసం దాదాపు 5 ఏళ్ల పాటు రాజా సాబ్ మినహాయిస్తే ఇంకో సినిమాకి ఓకే చెప్పలేదు.
తెలుగులో చేయకూడదు
పవన్ కళ్యాణ్ సరసన చేస్తున్నారు కాబట్టి చిన్న చిన్న సినిమాలేవి చేయకూడదు అని ముందుగానే చెప్పారట. అయితే ప్రభాస్ రాజా సాబ్ సినిమా రావడంతో దానికి మాత్రం ఒకే చెప్పింది నిధి అగర్వాల్. మొత్తానికి ఎప్పుడో పూర్తి కావాల్సిన హరిహర వీరమల్లు సినిమా పవన్ కళ్యాణ్ సరైన డేట్స్ ఇవ్వకపోవడం వలన, అలానే రాజకీయాల్లో పూర్తిగా బిజీ అయిపోవడం వల్ల, ఆ సినిమా దాదాపు 5 సంవత్సరాల వరకు కొనసాగింది. మొత్తానికి ఈ సినిమా రిలీజ్ అవడం అనేది ఒక రకంగా నిధికి కూడా పెద్ద ప్లస్ పాయింట్ అని చెప్పాలి. ఇకపై ఒక సినిమాకి కమిట్మెంట్ ఇచ్చి ఆగిపోకుండా మిగతా సినిమాలు కూడా చేసుకుంటుంది.
Also Read : Anasuya: వాళ్ల చేతిలో దారుణంగా మోసపోయిన అనసూయ, ఆవేదనతో సోషల్ మీడియా పోస్ట్