BigTV English
Advertisement

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… నల జీలకర్ర మొగ్గ అంటూ

Garividi Lakshmi: గరివిడి లక్ష్మి ఫస్ట్ సింగిల్ వచ్చేసింది… నల జీలకర్ర మొగ్గ అంటూ

Garividi Lakshmi: ప్రస్తుతం తెలుగు ఫిలిం ఇండస్ట్రీ ఏ స్థాయిలో ఉందో ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురుచూసే పాన్ ఇండియా సినిమాలు చేయడంతో పాటు, తెలుగు ప్రేక్షకులు ఎదురుచూస్తున్న మట్టి సినిమాను చేయడానికి ఇష్టపడుతున్నారు కొంతమంది దర్శకులు.


రామ్ చరణ్ నటిస్తున్న పెద్ది సినిమా కూడా ఉత్తరాంధ్ర లో ఒక వ్యక్తి కథ. రామ్ చరణ్ ఈ సినిమాలో ఉత్తరాంధ్ర యాస మాట్లాడుతున్నాడు. అలానే బుర్రకథ కళాకారిణి గరివిడి లక్ష్మి పేరు మీద ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రముఖ నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ సినిమాను నిర్మిస్తుంది. కృతి ప్రసాద్ ఈ సినిమాతో నిర్మాతగా పరిచయం అవుతున్నారు.

ఉర్రూతలూగిస్తుంది


ఈ సినిమా నుంచి ఇదివరకే నల్ల జీలకర్ర మొగ్గ అనే పాట విడుదలైంది. ఈ పాట దాదాపు నాలుగు మిలియన్లు వ్యూస్ సాధించింది. అలానే ఆంధ్ర రాష్ట్రంలో ఎక్కడ విన్నా కూడా ఈ పాట వినపడుతూనే ఉంది. చాలా ఫంక్షన్స్ ఈ పాట లేకుండా జరగడం లేదు అనడంలో అతిశయోక్తి లేదు. రీసెంట్ గా ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ కూడా మంచి ఆదరణ సంపాదించుకుంది. ఆ టీజర్ లో నల్ల జీలకర్ర మొగ్గ అని బ్యాక్ గ్రౌండ్ స్కోర్ యాడ్ అవ్వడం కూడా సినిమాకు కొంతవరకు ప్లస్ అయింది. ఈ పాట విరివిగా వినిపిస్తున్న కూడా ఏ సినిమాలోది అని కొంతమందికి సందేహం ఉండేది. కానీ టీజర్ తో ఆ క్లారిటీ చాలామందికి వచ్చేసింది. మొత్తానికి వీడియో సాంగ్ లో నటి ఆనంది ఎనర్జీ నెక్స్ట్ లెవెల్ అనిపిస్తుంది.

భారీ స్పందన 

ఇక ప్రస్తుతం సినిమా ప్రేక్షకులు ముందుకు రాకముందే ఈ సినిమా నుంచి వీడియో సాంగ్ విడుదల చేసింది చిత్ర యూనిట్. తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా ఒక వీడియో సాంగ్ ని ప్రేక్షకులు ముందుకు తీసుకొచ్చారు అంటే ఇది ఒక రేర్ అచీవ్మెంట్ అని చెప్పాలి. ఈ సినిమాలో గరివిడి లక్ష్మి పాత్రను ఆనంది పోషిస్తుంది. అలానే రాగ మయూర్ ఒక కీలక పాత్రలో కనిపిస్తున్నారు. కంచరపాలెం కిషోర్ కూడా ఒక మంచి పాత్రను ఈ సినిమాలో చేస్తున్నారు. సీనియర్ నటి రాశి, అలానే సీనియర్ నటులు నరేష్ ఈ సినిమాలో కనిపించనున్నారు. ఈ సినిమాతో గౌరి నాయుడు జమ్ము అనే కొత్త దర్శకుడు తెలుగు ఫిలిం ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నాడు. ఈ సినిమాకి చరణ్ అర్జున్ సంగీతం అందిస్తున్నారు.కొద్దిసేపటి క్రితమే విడుదలైన ఈ పాట విపరీతమైన రెస్పాన్స్ సాధించుకుంటుంది.

Also Read: Rajinikanth: లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ రాజమౌళి, తలైవర్ భారీ ఎలివేషన్

Related News

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

NTR: ఎన్టీఆర్ లుక్స్.. భయపడుతున్న ఫ్యాన్స్.. నీల్ మావా నువ్వే కాపాడాలి

Peddi: మొత్తానికి ‘చిక్రి’ అంటే ఏంటో చెప్పేసిన బుచ్చిబాబు

Kiran Abbavaram : కె ర్యాంప్ మూవీకి లీగల్ చిక్కులు… దాన్ని కూడా వాడేస్తున్నారా?

Dharma Mahesh: పోలీసులను ఆశ్రయించిన ధర్మా మహేష్.. భార్య గౌతమీతో పాటు అతనిపై ఫిర్యాదు!

Bahubali: The Eternal War: బాహుబలి మరణం.. ముగింపు కాదు!

Big Stories

×