BigTV English

Rajinikanth: లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ రాజమౌళి, తలైవర్ భారీ ఎలివేషన్

Rajinikanth: లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ రాజమౌళి, తలైవర్ భారీ ఎలివేషన్

Rajinikanth: మానగరం సినిమాతో ఫిల్మ్ ఇండస్ట్రీకి దర్శకుడుగా పరిచయం అయ్యాడు లోకేష్ కనకరాజ్. ఆ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ హిట్ గా నిలిచింది. టెక్నికల్ గా ఆ సినిమా చాలామందిని ఆశ్చర్యపరిచింది.. కేవలం ఒక ఇన్సిడెంట్ ను ఇంత ఆసక్తికరంగా చెప్పొచ్చు అని ప్రూవ్ చేశాడు ఆ సినిమాతో లోకేష్.


కార్తీ నటించిన ఖైదీ సినిమా కూడా అంతకు మించిన స్థాయిలో ఉంటుంది. ఒక లారీ డ్రైవర్ కథను చాలా ఆసక్తికరంగా, రోమాలు నిక్కబొడుచుకునేలా చెప్పాడు లోకేష్. ఇక్కడితో లోకేష్ బ్రాండ్ సౌత్ ఇండియా ఇండస్ట్రీ పైన పడిపోయింది. ఆ తర్వాత తీసిన మాస్టర్ సినిమా కమర్షియల్ గా విపరీతమైన సక్సెస్ సాధించక పోయినా కూడా, బాక్సాఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ వచ్చాయి.

కోలీవుడ్ రాజమౌళి 


ప్రస్తుతం లోకేష్ కనగరాజ్ రజనీకాంత్ హీరోగా కూలీ అనే సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వేర్వేరు ఇండస్ట్రీలకు సంబంధించిన స్టార్ హీరోలు అంతా నటిస్తున్నారు. వాళ్లని పర్ఫెక్ట్ గా డీల్ చేశాడు అని ట్రైలర్ చూస్తే అర్థమవుతుంది. ఇదివరకే విక్రమ్ సినిమాలో కూడా అద్భుతంగా మిగతా స్టార్లను డీల్ చేశాడు లోకేష్. అయితే ఈ సినిమా ఆగస్టు 14న విడుదలకు సిద్ధంగా ఉన్న తరుణంలో చిత్ర యూనిట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించింది. ఈ ఈవెంట్లో రజనీకాంత్ మాట్లాడుతూ… లోకేష్ కనగరాజ్ కోలీవుడ్ రాజమౌళి అని చెప్పారు. తెలుగులో రాజమౌళికి ఇప్పటివరకు డిజాస్టర్ సినిమా పడలేదు. అలానే తమిళ్లో కూడా లోకేష్ కి డిజాస్టర్ సినిమా పడలేదు. అందుకోసమే తలైవా రజినీకాంత్ లోకేష్ ను కోలీవుడ్ రాజమౌళి అని సంబోధించారు.

భారీ అంచనాలు 

ఈ సినిమా మీద విపరీతమైన అంచనాలు ఉన్నాయి. ఆగస్టు 14 కోసం చాలామంది క్యూరియాసిటీతో ఎదురుచూస్తున్నారు. అనిరుద్ అందించిన సంగీతం సినిమా మీద మంచి హైప్ క్రియేట్ చేసింది. ఈ సినిమాను తెలుగులో ముగ్గురు అగ్ర నిర్మాతలు డిస్ట్రిబ్యూషన్ చేస్తున్నారు. జైలర్ సినిమా తర్వాత ఆ స్థాయి హిట్ ఈ సినిమాతో వస్తుంది అని చాలామంది నమ్మకంతో ఉన్నారు. లోకేష్ ఈ సినిమా ట్రైలర్ లో లాస్ట్ షాట్ లో భాషా సినిమా రిఫరెన్స్ తీసుకోవడం చాలామందికి విపరీతమైన హై ఇచ్చింది. ఒక సినిమా కూడా అదే స్థాయిలో ఉంటే కొత్త రికార్డులు కొల్లగొట్టడం ఖాయం. ఇప్పటివరకు తమిళ్ ఫిలిమ్ ఇండస్ట్రీలో 1000 కోట్ల సినిమా లేదు. ఈ సినిమా 1000 కోట్ల కలెక్ట్ చేస్తుంది అని అందరి అంచనా.

Also Read: Telugu film industry: వినోద పరిశ్రమకు వినోదం కరువైంది, హీరోలకు కోట్లు కార్మికులకు పాట్లు

Related News

Pushpa Song AGT -2025 : అది పుష్ప సాంగ్ కాదు… అల్లు అర్జున్ పరువు తీశారు కదయ్యా

Megastar Chiranjeevi : ఎమ్మెల్యేగా చిరు పోటీ… స్వీట్ వార్నింగ్ ఇచ్చిన మెగాస్టార్

Madhupriya: సింగర్ మధుప్రియ ఇంట పెళ్లి సందడి.. హల్దీ వేడుకల్లో జోరు!

India’s Biggest Director: ఓటమెరుగని దర్శకులు.. జీరో ఫ్లాప్ తో సంచలనం సృష్టిస్తున్న డైరెక్టర్స్ వీళ్లే!

Telugu Sequel Movies : ఈ రెండు పార్ట్స్‌ గోలేంటి రాజా… మన దరిద్రం కాకపోతే ?

Balakrishna: మళ్లీ డ్యూయల్ రోల్ లో బాలయ్య.. రెండు కాలాలు.. రెండు కోణాలు.. వర్కౌట్ అయ్యేనా?

Big Stories

×