Geeta Singh: గీతా సింగ్ (Geeta Singh).. ఈ పేరు గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. అల్లరి నరేష్ (Allari Naresh) హీరోగా నటించిన ‘కితకితలు’ సినిమాలో తన అద్భుతమైన యాక్టింగ్ తో అందరిని ఆకట్టుకుంది. ముఖ్యంగా గీతా సింగ్ అంటే వెంటనే ఎవరూ గుర్తుపట్టకపోవచ్చు.. కానీ కితకితలు హీరోయిన్ అంటే మాత్రం ఇట్టే గుర్తుపట్టేస్తారు. ఒకప్పుడు దాదాపు 1,000 పైగా చిత్రాలలో నటించిన ఈమె.. అందులో చాలా సినిమాలు విడుదల చేయలేదు అని చెప్పుకొచ్చింది. ఇదిలా ఉండగా ఇప్పుడు చాలా రోజుల తర్వాత ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈమె.. తాను పెళ్లి చేసుకోకపోవడానికి అసలు కారణం చెప్పి అందరిని ఆశ్చర్యపరిచింది.
24 ఏళ్ల కొడుకు చనిపోతే ఎవరూ పట్టించుకోలేదు..
గీతా సింగ్ మాట్లాడుతూ.. నా వ్యక్తిగత జీవిత విషయానికి వస్తే నా దగ్గర డబ్బు ఉన్నప్పుడు అందరూ వచ్చారు. కానీ కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు తోడుగా లేరు. నేను నా కొడుకుని కోల్పోయినప్పుడు.. నా దగ్గరికి ఎవరూ రాలేదు. అప్పుడే అసలైన నరకం అనుభవించాను. కనీసం ఉన్నావా ?లేదా? తిన్నావా? లేదా? అని అడిగే వాళ్ళు కూడా లేరు. నాకు ధైర్యం చెప్పే వాళ్ళు కూడా లేరు.. నిజానికి వాడు నా కొడుకు కాదు.. మా అన్నయ్య కొడుకు నేను దత్తత తీసుకొని పెంచుకున్నాను. 24 సంవత్సరాలు ప్రాణానికి ప్రాణంగా పెంచుకుంటే వాడు యాక్సిడెంట్ లో చనిపోయాడు తట్టుకోలేకపోయాను..
ఆ నరకంతోనే పెళ్లికి దూరమయ్యాను..
ఇక నాకు నేనే ధైర్యం చెప్పుకొని.. మా అన్నయ్య రెండో కొడుకుని కూడా నేనే చూసుకుంటున్నాను. అలాగే నా కజిన్ బ్రదర్ కూతురు కూడా ఇప్పుడు నా దగ్గరే ఉంటుంది . ఈ పిల్లల కోసమే నేను పెళ్లి చేసుకోకుండా ఉన్నాను. కానీ దేవుడేమో నాకు ఇలా అన్యాయం చేస్తున్నాడు అంటూ ఎమోషనల్ అయింది గీతా సింగ్.
బిగ్ బాస్ 9 లో ఛాన్స్ కావాలి..
ఇకపోతే బిగ్ బాస్ సీజన్ 9లో తనకు ఛాన్స్ కావాలి అని తెలిపింది గీతా సింగ్. బిగ్ బాస్ షో కి వెళ్ళాలనుంది. ఇంత పేరు తెచ్చుకున్న మమ్మల్ని వదిలేసి కొత్తవారిని ఎంపిక చేసుకుంటున్నారు. బిగ్ బాస్ 9 కి గనుక ఛాన్స్ వస్తే తప్పకుండా వెళ్తాను. అయితే వెళ్ళినప్పుడు మొదటి నాగార్జునకు ముద్దు పెట్టాకే మాట్లాడతాను అంటూ కూడా చాలా ఓపెన్ గా కామెంట్లు చేసింది గీతా సింగ్. మొత్తానికి అయితే బిగ్ బాస్ షోలోకి వెళ్లాలన్న ఈమె ఆసక్తిని నిర్వాహకులు నిజం చేస్తారో లేదో చూడాలి. అసలే సాఫ్ట్ కార్నర్ తో ఉండే గీతా సింగ్ బిగ్ బాస్ హౌస్ లోకి అడుగుపెడితే అక్కడ తట్టుకుంటుందా అని ఇప్పుడు అభిమానులు కూడా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి గీతా సింగ్ కి బిగ్ బాస్ అవకాశము వస్తుందో లేదో చూడాలి.
ALSO READ:Hyderabad: 700 మంది విద్యార్థులకు పట్టాలు.. కన్నుల విందుగా జరిగిన సమవర్తన!