Illu Illalu Pillalu ToIlluday Episode August 4th: నిన్నటి ఎపిసోడ్ లో.. వేదవతి భాగ్యం వాళ్లకు ఫోన్ చేసి శుభవార్తను పంచుకుంటారు. భాగ్యం, ఆనందరావు ఆనందానికి అవధులు లేవు. తల్లి కాబోతుందని సంతోషంతో వెంటనే అక్కడికి వచ్చేస్తారు. పాత బండి మీద వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్తే మన బండారం తెలిసిపోతుందని బండిని దాచిపెట్టి ఇంట్లోకి వెళ్తారు. వాళ్ళ చూసిన శ్రీవల్లి షాక్ అవుతుంది. చూశారా అన్నయ్యగారు ఇద్దరు కోడలు ముందు వచ్చిన నా కూతురే మిమ్మల్ని తాత ఏం చేయబోతుంది అని అంటారు. ఈ మాటలు విన్న శ్రీవల్లి అమ్మ నేను తల్లిని కాలేదమ్మా.. ఉప్మా తిని వాంతులు అయ్యాయి అని అసలు విషయం చెప్తుంది.
ఆ మాట విన్న వేదవతి సీరియస్ అవుతుంది.. నర్మదా ప్రేమలే నా చేత బొద్దింక పడ్డ ఉప్మాని తినిపించారు. అందుకే వాంతులు చేసుకున్నాను అని శ్రీవల్లి అంటుంది. అక్క ఏం మాట్లాడుతున్నావు.. నువ్వు మా మీద ఎన్ని రకాలుగా చెప్పినా సరే నేను నిన్ను సొంత అక్కలాగే చూశాను నువ్వు ఇలా మాట్లాడటం ఏం బాగోలేదు అని రివర్స్ అవుతారు. ఏంటమ్మా వల్లి ఇలాంటివి ఎలా చెప్పాలో కూడా తెలియదా? వాళ్ళంటే నీకు ఇష్టం లేకపోతే ఉండాలి ఇలా నిందలు వేయడం మంచిదేనా అని రామరాజు అంటాడు. శ్రీవల్లి ఎంత చెప్తున్నా సరే తప్పు చేశావని అందరు అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అయ్యింది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. భాగ్యం, ఆనందారావు వెళ్తుంటే వెనకాలే ప్రేమ, నర్మదలు ఫాలో అవుతారు. ఎలాగైనా సరే ఈరోజు వీళ్ళ బండారం బయటపెట్టాలని అనుకుంటారు. వీళ్ళు ఇద్దరు కారులో వచ్చామని ఇలా పాత డొక్కు స్కూట మీద వచ్చారు చూసావా అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఎలాగైనా పట్టుకోవాలని అనుకుంటారు. ఆనందరావుకే ఎదురుగా ఒక బండ తినడంతో అతనితో గొడవకు దిగుతాడు. బండి అద్దం నుంచి నర్మద ప్రేమ కనిపించడం చూసి భాగ్యం అనుమానాన్ని ఫాలో అవుతున్నారు ఎలాగైనా తప్పించుకోవాలని అనుకుంటారు. స్కూటర్ ను అక్కడ పడేసి సంధులు గొందులలో పరుగులు పెడతారు. నర్మదా ప్రేమ ఇద్దరు కూడా వాళ్ళని వెతికే ప్రయత్నంలో ఉంటారు.
ప్రేమ నర్మదలు ఇద్దరూ ఎంత వెతికినా సరే భాగ్యం ఆనందరావు కనిపించకపోవడంతో ఈరోజు తప్పించుకున్నారు. ఏదో ఒక రోజు దొరకపోతారని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చందు దిగాలుగా కూర్చోవడం చూసి సాగర్ ధీరజ్లు ఏమైందిరా అలా ఉన్నావు ఏదో బాధ పడుతున్నట్లు ఉన్నావే అని అడుగుతారు. లేదు అదేం లేదు ఏదైనా ఉంటే మీకు చెప్తాను కదా అని చందు అంటాడు.. ఏదో దాస్తున్నాడు ఏం జరిగింటుందని ఆలోచిస్తూ ఉంటారు.
సాగర్ ను ధీరజ్ వదినతో నువ్వు బాగానే ఉంటున్నావా? మీ ఇద్దరి మధ్య ఇంకా ఏదైనా గొడవలు ఉన్నాయా అని అడుగుతాడు. మేం బాగానే ఉన్నామని సాగర్ అంటాడు. ధీరజ్ని అడిగితే ధీరజ్ కూడా మేము బాగానే ఉన్నామని అంటారు. ప్రేమ ఒక్కటే నడుచుకుంటూ రావడం చూసి ధీరజ్ ఒకటే నడుచుకుంటూ వస్తుందే సైకిల్ మీద ఎలాగైనా ఇంటి దగ్గర డ్రాప్ చేయాలని అనుకుంటాడు.. నీ ప్రేమ మాత్రం ఈరోజు డ్రాప్ చేస్తానంటావు. రేపు నువ్వు నాకు ఇంట్లో వస్తువుతో సమానం అని అంటావు ఎందుకు వచ్చిందిలే నేను నడుచుకుంటూ వెళ్ళిపోతాను అని అంటుంది.
Also Read : అక్షయ్ పై అవని ప్రేమ.. ప్రణతి, భరత్ ల పెళ్లికి ముహూర్తం ఫిక్స్.. అక్షయ్ కు షాక్..
సాగర్ నీ పరిస్థితి కూడా ఇంతేనా రా అని అంటాడు.. ధీరజ్ మాత్రం ప్రేమని నువ్వు అలా ఒంటరిగా నడుచుకుంటూ పోతుంటే నాకు బాధగా అనిపిస్తుంది రా డ్రాప్ చేస్తానని బతిమిలాడతాడు. దానికి ఒప్పుకున్న ప్రేమ నేను సైకిల్ మీద కూర్చుంటాను నువ్వు నన్ను ఎక్కించుకొని నడుచుకుంటూ తోసుకుంటూ రావాలి అని అంటుంది. ఇక ప్రేమ కోసం తప్పక అలా పని చేస్తాడు ధీరజ్. చూస్తుంటే ధీరజ్ ప్రేమల మధ్య ప్రేమ పుట్టేటట్టు కనిపిస్తుంది. ముందు ముందు ఎపిసోడ్లలో వీళ్ళిద్దరి మధ్య ప్రేమ చిగురిస్తుందేమో చూడాలి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…