BigTV English

Nindu Noorella Saavasam Serial Today August 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌కు షాక్‌ ఇచ్చిన చిత్ర

Nindu Noorella Saavasam Serial Today August 4th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌:  అమర్‌కు షాక్‌ ఇచ్చిన చిత్ర

Nindu Noorella Saavasam Serial Today Episode: చిత్ర కోపంగా వినోద్‌ మీద అరుస్తుంది. మీ అన్నయ్యేమో వచ్చిన డబ్బులు అన్ని అనాథ ఆశ్రమాలు ఇస్తున్నారు. నువ్వేమో ఏమీ  చేయకుండా ఇంట్లో కూర్చున్నావు. చూడు నువ్వు మీ అన్న కన్నా హైలో ఉండాలి అదే నేను కోరుకునేది అంటూ తిడుతుంది. ఇంతలో అమర్ వాళ్లు వస్తుంటారు. అన్నయ్య వాళ్లు వస్తున్నారు కొద్దిసేపు కామ్‌గా ఉండు అంటాడు వినోద్‌. ఇంతలో అమర్‌ లోపలికి రాగానే.. చిత్ర బావగారు… మీతో కాస్త మాట్లాడాలి అని అడుగుతుంది. దీంతో అమర్‌ దేని గురించి అని అడగ్గానే.. చిత్ర, వినోద్‌ను నువ్వు అడుగుతావా..? నన్ను అడగమంటావా..? అంటుంది. వినోద్‌ వద్దు నేను అడుగుతాను అదే అన్నయ్య బిజినెస్‌ పెట్టాలి. దానికి నువ్వు మనీ అరెంజ్‌ చేస్తా అన్నావు కదా ఎప్పుడా అని అడగ్గానే.. మీరు అడిగింది చిన్న అమౌంట్‌ కాదురా కొంచెం టైం పడుతుంది. వెయిట్‌ చేయండి అని చెప్తాడు.


దీంతో చిత్ర ఇంకెన్నాళ్లు వెయిట్‌ చేయాలి బావగారు. వచ్చిన డబ్బంతా మీరు దానధర్మాలు చేస్తుంటే ఇంక మాకేం మిగులుతుంది. అలాగే ఈ ఆస్థి అంతా హారతి కర్పూరంలా కరిగిపోయేలా ఉంది అంటుంది. దీంతో మిస్సమ్మ చూడు చిత్ర ఈ రోజు మేము అనాథ ఆశ్రమానికి డొనేట్‌ చేసింది. ఈ ఆస్థిలో ఉన్న  డబ్బు కాదు. బెస్ట్‌ కపుల్‌ కాంటెస్ట్‌లో మేము గెలుసుకున్న మనీ అని చెప్పగానే.. ఆ మనీ మాకు రాకుండా మీరు పోటీకి వచ్చారు కదా..? అదే మాకు వచ్చి ఉంటే ఇలా మీ దగ్గర చేయి చాచి అడుక్కనే వాళ్లం కాదు కదా.. అంటుంది. దీంతో మిస్సమ్మ అనాథ పిల్లలను ఆదుకోవాలని మేము ఆ కాంటెస్ట్‌ లో పాల్గొన్నాం అని చెప్తుంది. అవును మాకంటే మీకు వాళ్లే ఎక్కువ అయిపోయారు కదా..? మాకంటే మీకు చేతులు రావు.. వేరే వాళ్లకు ఇవ్వడానికి మీ చేతులకు ఎముకే ఉండదు అంటుంది.

దీంతో వినోద్‌ కోపంగా చిత్ర ఇంక ఆపుతావా..? అంటాడు. దీంతో ఏంటండి ఆపేది మనల్ని ఒకలా బయటి వాళ్లను ఒకటా చూస్తుంటే.. నాకు బాధగా ఉంది అంటుంది. ఇక్కడ మేము ఎవ్వరినీ వేరుగా చూడటం లేదు చిత్ర అంటుంది మిస్సమ్మ.. ఎందుకు చూడటం లేదు. అనుభవించేవాడికి తెలుస్తుంది ఆ పెయిన్‌ ఎలా ఉంటుందో..? ఆస్థిలో మా వాటా పంచేస్తే మేము వేరుగా ఉంటాము కదా..? అంటుంది. అందరూ షాక్‌ అవుతారు.. మిస్సమ్మ మాత్రం ఏం మాట్లాడుతున్నావు చిత్ర. ఇంత చిన్న విషయానికి ఆస్థి పంపకాల వరకు వెళ్తావు ఏంటి..? అంటుంది. దీంతో మనోహరి కోపంగా ఏంటి భాగీ అమరేంద్ర ముందే గొడవ పడుతున్నావు నువ్వు తనకు ఏం మర్యాద ఇస్తున్నట్టు అంటుంది. దీంతో మిస్సమ్మ ఆ మాట చిత్రకు చెప్పు అంటుంది. ఇంతలో అమర్‌ కోపంగా మిస్సమ్మను తిట్టి లోపలికి వెళ్లు అని చెప్తాడు. మిస్సమ్మ లోపలికి వెళ్లిపోతుంది. మీకు కావాల్సిన డబ్బు సాయంత్రం వరకు అరేంజ్‌ చేస్తాను అంటూ అమర్ వెళ్లిపోతాడు.


తర్వాత రూంలోకి వెళ్లిన మిస్సమ్మ, అమర్‌ అన్న మాటలు గుర్తు చేసుకుంటూ బాధపడుతుంది. ఇంతలో రూంలోకి అమర్‌ వస్తాడు. భాగీ ఇందాక నేను అన్న మాటలకు ఫీల్‌ అయ్యావా..? అని అడుగుతాడు. దీంతో అదేం లేదండి మీరు ఎవ్వరినీ ఏమన్నా వాళ్ల మంచికోసమే చెప్తారు. కానీ చిత్ర అవి అర్థం చేసుకుంట లేదు. వినోద్‌కు బిజినెస్‌ ఎక్సీరియెన్స్‌ లేదు. చిత్రకు కూడా లేదు. ఏం తెలియకుండా వ్యాపారం చేస్తే నష్టపోకుండా ఎలా ఉంటారు చెప్పండి అంటుంది. దీంతో ఏదైనా పని చేసినప్పుడే కదా ఎక్సీరియెన్స్‌ వస్తుంది. ఏ పని చేయకపోతే ఏమీ రాదు.. అంటాడు.

అప్పుడు తను చేయబోయే బిజినెస్‌ గురించి ఇన్ఫర్మేషన్‌ తెలుసుకోవడమో.. స్టడీ చేయడమో.. లేదా కొన్నాళ్ల పాటు అదే బిజినెస్‌ చేస్తున్న వాళ్లతో కలిసి పని చేయడమో చేయాలి. ఆ తర్వాత కదా బిజినెస్‌ స్టార్ట్‌ చేయాలి అంటుంది. దీంతో అమర్‌ వాళ్లకు ఇప్పుడు అంత టైం లేదు భాగీ అంటాడు అమర్‌. ఇప్పుడు మన దగ్గర కూడా అంత మనీ లేదు కదండి అంటుంది. నేనే ఎలాగోలా అరైంజ్‌ చేస్తాను అని అమర్‌ చెప్తాడు. నష్టపోతారు అని తెలిసి ఎలా ఇస్తారండి అని మిస్సమ్మ అడగ్గానే.. ఇవ్వకపోతే చిత్ర వినోద్ ను రెచ్చగొట్టి వేరు కాపురం పట్టే వరకు తీసుకెళ్తుంది. చిత్ర మెయిన్‌ ఉద్దేశం కూడా అదే అందుకే నేను డబ్బులు ఇస్తాను అని చెప్పాను. ఇంతటితో నేటి నిండు నూరేళ్ల సావాసం సీరియల్ ఎపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Star Maa Parivaaram Promo: శ్రీముఖికి దిమ్మతిరిగే కౌంటర్.. పెళ్లి కావ్య షాకింగ్ రియాక్షన్..

Illu Illalu Pillalu Today Episode: రామరాజు ఇంటికి దొంగగా వచ్చిన ఆనందారావు.. ధీరజ్ కు దొరికిన శ్రీవల్లి..

Intinti Ramayanam Today Episode: అవనిని గేంటేసిన పార్వతి.. భరత్, ప్రణతిలను విడగొట్టేందుకు పల్లవి ప్లాన్.. భానుమతికి వాతలు..

Gundeninda GudiGantalu Today episode: హమ్మయ్య.. పూజను పూర్తి చేసిన రోహిణి.. బాలు సెటైర్లు.. మనోజ్ కు కడుపు మంట..

Nindu Noorella Saavasam Serial Today August 6th : ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: కాలాను అడ్డుకునేందుకు ఆరు ప్లాన్‌

Brahmamudi Serial Today August 6th: ‘బ్రహ్మముడి’ సీరియల్‌: అపర్ణకు నిజం చెప్పిన కావ్య – ఎమోషనల్‌ అయిన ఇంద్రాదేవి  

Big Stories

×