BigTV English

Hyderabad: 700 మంది విద్యార్థులకు పట్టాలు.. కన్నుల విందుగా జరిగిన సమవర్తన!

Hyderabad: 700 మంది విద్యార్థులకు పట్టాలు.. కన్నుల విందుగా జరిగిన సమవర్తన!

Hyderabad:తెలంగాణ, హైదరాబాద్ లో ఉన్న ‘శివ శివాని డిగ్రీ కళాశాల’ 2022 – 2025 బ్యాచ్ కాన్వకేషన్ సమవర్తన 2025ను నిన్న అనగా ఆగస్టు 3వ తేదీన కళాశాల ప్రాంగణ సమీపంలో ఘనంగా నిర్వహించారు కళాశాల యాజమాన్యం. ఈ కార్యక్రమం ద్వారా 700 మందికి పైగా విద్యార్థులు తమ విద్యా ప్రయాణంలో ఒక ముఖ్యమైన మైలురాయని చేరుకొని డిగ్రీ పట్టా అందుకున్నారు. దీనికి తోడు శివ శివాని గ్రూపు బ్లూ సఫైర్ జూబ్లీ వేడుకలకు కూడా శ్రీకారం చుట్టింది. కాలేజీ యాజమాన్యం 65 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వేడుకలను నిర్వహించనున్నారు. ఇక ఈ కార్యక్రమం దీపప్రజ్వలన, విద్యార్థుల చేత గీతాలాపనలతో ప్రారంభించారు.


ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ప్రొఫెసర్ వి బాలకిష్టా రెడ్డి, తెలంగాణ ఉన్నత విద్యా మండలి గౌరవాధ్యక్షులు.. పట్టభద్రులను అభినందిస్తూ.. నిరంతర విద్య, నిజాయితీ, ఆవిష్కరణ ప్రాధాన్యాన్ని ప్రస్తావించారు. అంతేకాదు యువత ఒక ప్రగతిశీల సమగ్ర భారతదేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాలని, తన సందేశంగా విద్యార్థులకు తెలియజేశారు.

700 మందికి పైగా విద్యార్థులు డిగ్రీ పట్టా అందుకోవడంతో శివ శివాని విద్యా సంస్థల అధ్యక్షురాలు ముఖ్య కార్యనిర్వాహక అధికారి శ్రీమతి ఎస్.ఆర్తీ విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు. ” కాన్వకేషన్ మీ కృషి, సహనం.. ఇది భవిష్యత్తు అవకాశాలకై ఒక ప్రస్థాన బిందువు. శివ శివానిలో విద్య అనేది కేవలం జ్ఞాన ప్రసారం మాత్రమే కాదు వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దే సాధనం” అంటూ ఆమె తెలిపారు.


అలాగే శివ శివాని విద్యాసంస్థల ప్రిన్సిపల్ మమత కూడా వార్షిక నివేదిక సమర్పించి విద్యార్థులు విద్యా ప్రతిభతో పాటు సామాజిక కార్య కలాపాలలో చురుకుగా పాల్గొన్నందుకు అభినందించారు. తమ కళాశాల సమగ్ర విద్య విలువల ఆధారిత అభ్యాసం, నైపుణ్యాలను అభివృద్ధి చేయడం పట్ల కట్టుబడి ఉంటుందని తెలిపారు.

ఇకపోతే విద్యార్థులకు బీకాం, బీఎస్సీ, బీబీఏ, బీఏ ఇలా పలు విభాగాలలో మూడు సంవత్సరాల విద్య కాలంలో ఉత్తీర్ణులైన వారికి పట్టాలు ప్రధానం చేయడం జరిగింది. విద్యా ప్రథములు, క్రీడా విజేతలు, సాంస్కృతిక, సామాజిక కార్యక్రమాలలో విశేష కృషి చేసిన వారికి ప్రత్యేకంగా సత్కారాలు అందజేశారు.. ఈ కార్యక్రమానికి పూర్వ విద్యార్థులు, అధ్యాపకులు, విద్యార్థుల తల్లిదండ్రులు, శ్రేయోభిలాషులు విస్తృతంగా హాజరయ్యారు. ఈ సమవర్తన 2025 హృదయపూర్వక ధన్యవాదాలుతో.. పట్టభద్రుల విలువల దృష్టిని పాటించే ప్రతిజ్ఞతో ముగిసింది అని కాలేజ్ యాజమాన్యం తెలిపింది.

Related News

Raksha Bandhan 2025: ఈ నియమాలు పాటించకపోతే రాఖీ కట్టిన ఫలితం ఉండదు!

Raksha Bandhan: తల్లి కొడుకుకి రాఖీ కట్టొచ్చా? హిందూ సాంప్రదాయం ఏం చెబుతుంది?

Curd: అమ్మ బాబోయ్.. పెరుగుతో వీటిని తింటే విషంతో సమానమా..?

Raksha Bandhan: కర్రలకు రాఖీ కట్టే ఆచారం.. వందల ఏళ్లుగా రక్షాబంధన్ జరుపుకోని గ్రామాలు.. కారణం ఇదేనా?

Snoring in sleep: నిద్రలో గురక… గుండెకు గండమా?

Onions: ఈ ఉల్లిపాయలు తింటే… శరీరంలో ఫంగస్ పెరుగుతుంది! జాగ్రత్త!

Big Stories

×