Tharun Bhaskar:సినిమా ఇండస్ట్రీలో ఒక జంట కలిసి కనిపించారు అంటే కచ్చితంగా ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంటుంది. సోషల్ మీడియాలో రూమర్స్ వచ్చాయి అంటే దాదాపు 90% నిజమైన రోజులు కూడా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇప్పుడు మరో జంట గత కొంతకాలంగా చట్టాపట్టాలేసుకొని తిరుగుతూ.. ఒకరి లగేజ్ లను ఇంకొకరు మోసుకెళ్తూ.. ఒకరిపై ఇంకొకరు ప్రేమ కురిపిస్తూ మీడియాను తికమక పెట్టేస్తున్నారు. కానీ అఫీషియల్ గా తమ బంధాన్ని బయట పెట్టడం లేదు. పైగా పెళ్లి తర్వాత భార్యాభర్తలుగా చేయాల్సిన పూజలు కూడా పెళ్లికి ముందే చేసేస్తూ ఆడియన్స్ లో మరింత అనుమానం క్రియేట్ చేస్తున్నారు. అయితే ఈ జంట తమ బంధాన్ని బయటకు చెప్పకపోయినా.. ఆయన తల్లి ఏకంగా బహిరంగంగా సినిమా ఈవెంట్లో బయటపెట్టి అందరిని సర్ప్రైజ్ చేశారు. మరి అసలు ఏం జరిగింది ?వారు ఎవరు? అనే విషయం ఇప్పుడు చూద్దాం.
ప్రముఖ యంగ్ బ్యూటీ ఈషా రెబ్బ(Eesha Rebba), డైరెక్టర్ కం హీరో తరుణ్ భాస్కర్(Tarun Bhaskar) గత కొంతకాలంగా ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ముఖ్యంగా విశ్వక్ సేన్ ఇంట జరిగిన దీపావళి వేడుకల్లో తరుణ్ భాస్కర్, ఈషా తొలిసారి జంటగా కనిపించారు. అప్పట్లోనే తేలికపాటి రూమర్లు వినిపించినా.. ఎవరు పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ ఏడాది విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న వివాహానికి మళ్లీ జంటగా వెళ్లారు. అంతేకాదు ఈషా లగేజ్ ను తరుణ్ భాస్కర్ తీసుకొస్తున్న ఎయిర్పోర్ట్ వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఆ తర్వాత వరలక్ష్మీ వ్రతం, వినాయక చవితి ఇలా ప్రతి పండుగలను వీళ్ళిద్దరూ కలిసి జరుపుకోవడం రూమర్లకు మరింత బలం చేకూరింది. అయితే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ఓం శాంతి శాంతి శాంతిః సినిమా ప్రమోషన్ సమయంలో కూడా తరుణ్ భాస్కర్ త్వరలోనే అన్ని విషయాలను వెల్లడిస్తాను అని చెప్పారు కానీ క్లారిటీ ఇవ్వలేదు.
అయితే ఇప్పుడు తాజాగా తరుణ్ భాస్కర్ తల్లి గీతా భాస్కర్ (Geeta Bhaskar) చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళ్తే.. తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో విశ్వక్ సేన్, అభినవ్ గోమటం తదితరులు కీలకపాత్రలు పోషిస్తూ ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం ఈ నగరానికి ఏమైంది. ఈ సినిమా మంచి విజయం అందుకోవడంతో ఈ సినిమాకి కొనసాగింపుగా ఈ నగరానికి ఏమైంది రిపీట్ అనే చిత్రాన్ని నవంబర్ 19వ తేదీన థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా జరిగిన ప్రీ రిలీజ్ వేడుకలో పాల్గొన్న తరుణ్ భాస్కర్ తల్లి వీళ్లిద్దరి రిలేషన్ పై ఓపెన్ అయ్యారు.
also read:తప్పు ఒప్పుకున్న శ్రీలీల.. గ్యాప్ ఇవ్వడంపై క్లారిటీ!
గీతా భాస్కర్ మాట్లాడుతూ.. “గత రెండు సంవత్సరాలుగా తరుణ్ భాస్కర్ ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇల్లు కట్టడం, ఒకవైపు కోర్టు కేసులు అంటూ చాలా స్ట్రగుల్ అవుతున్నాడు. ఇంటికి రాని రోజులు కూడా ఎన్నో ఉన్నాయి. అర్ధరాత్రి ఇంటికి వచ్చినప్పుడు నాలుగు గంటల సమయంలో కూడా తినడానికి తిండి పెట్టే నాధుడు లేడు. వాడిని జాగ్రత్తగా చూసుకునే ఒక్క సోల్మెట్ దొరికితే బాగుండు అని ఎన్నో రోజులుగా కోరుకుంటున్నాను. కానీ అలాంటి తోడు ఈషా రూపంలో దొరికింది. తరుణ్ ఫ్రెండ్.. ఆమె సపోర్టు తరుణ్ ను మరింత ప్రశాంతంగా మార్చేసింది. నాకు వయసు అయిపోతుంది. తల్లిదండ్రులతో కూడా అన్ని విషయాలు చెప్పుకోలేము. ఇక అలాంటిది ఒక ఫ్రెండ్ తో చెబుకుంటాము. అలాంటి సోల్మెట్ తరుణ్ భాస్కర్ జీవితంలో ఎవరైనా ఉన్నారు అంటే ఇది ఈషా మాత్రమే అంటూ గీత భాస్కర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి. మొత్తానికి అయితే వీళ్ళిద్దరి రిలేషన్ గురించి గీతా భాస్కర్ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.