Chiranjeevi Itlu Arjun:ఒకప్పుడు కేవలం పెద్ద హీరోలు ,భారీ బడ్జెట్లు ఉంటేనే సినిమాలకి ఆడియన్స్ పోలో మంటూ పరిగెత్తే వారు.కానీ ట్రెండ్ మారింది.చిన్న సినిమాలైనా కంటెంట్ బాగుంటే ఆడియన్స్ వసూళ్ళ వర్షం కురిపిస్తున్నారు. ఇదిగో తాజాగా ‘ఇట్లు అర్జున’ సినిమా సక్సెస్ మీట్ లో పాల్గొన్న చిరు ఇదే విషయం పై మాట్లాడారు.ఈ క్రమంలోనే యంగ్ టాలెంట్ గురించి పలు ఆసక్తికరమైన విషయాలు చెప్పుకొచ్చారు.
ఈ సినిమాతో హీరోగా టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చి అనీష్‌ను చిరంజీవి ఆకశానికి ఎత్తేశారు.మాములుగా ఒక కొత్త హీరో మొదటి సినిమాకే ఇండస్ట్రీలో ఉన్న పెద్ద స్టార్స్ అందరూ సపోర్ట్ చేయడం చాలా రేర్ అని చెప్పక్కర్లేదు.ఈ సినిమాకు నాని, ఎన్టీఆర్ ఒక్కో పాటను రిలీజ్ చేయగా, రామ్ చరణ్ ప్రీ రిలీజ్ కి ముఖ్య అతిధిగా వచ్చిన సంగతి తెల్సిందే.
ఇక అక్కినేని నాగ్ సినిమా కి మొదటి నుండి భుజం కాయడం మనకి తెల్సిందే.ఇక ఇదే విషయమై మాట్లాడుతూ అనీష్ తండ్రి, నిర్మాత ఎం.ఆర్. మహేష్ రెడ్డికి ఇండస్ట్రీలో ఉన్న మంచి సంబంధాలే అని చెప్పుకొచ్చారు చిరంజీవి .
గతంలో నాగార్జునతో అన్నమయ్య, శ్రీరామదాసు లాంటి సినిమాలు చేసిన మహేష్ రెడ్డికి సినిమా అంటే ఎంతో భక్తి, ఇష్టం ఉన్నాయని, ఆ సినిమా వాతావరణంలో పెరిగిన అనీష్‌కు కూడా యాక్టింగ్‌పై ఇష్టం ఉండటంతో ఎంకరేజ్ చేశారని వివరించారు.ఇక గత ఐదారేళ్లుగా థియేటర్లలో పెద్ద సినిమాల హవానే ఎక్కువగా నడిచిందని, ఓటీటీలో త్వరగా వచ్చేస్తాయనే జనాలు చిన్న సినిమాలను థియేటర్లలో చూడటానికి రావట్లేదని అసలు విషయం చెప్పుకొచ్చారు.
ఇప్పుడు కొత్త రైటర్స్ , యంగ్ డైరెక్టర్లు సరికొత్త కథలతో ఆడియన్స్‌ను మళ్లీ థియేటర్లకు రప్పిస్తున్నారని, ఇది ఇండస్ట్రీకి చాలా మంచి పరిణామమని అన్నారు. సీనియర్లు ఇండస్ట్రీకి గౌరవం తెస్తే, కొత్తవాళ్లు కొత్త ఆలోచనలతో దాన్ని ముందుకు నడిపిస్తారని, ఈ పరిశ్రమ ఎంతోమందికి అన్నం పెట్టే జీవనదిలా ఇలాగే కొనసాగాలని తన మనసులోని మాటని చెప్పుకొచ్చారు.
ఇకసినిమాలో అనీష్ గురించి మాట్లాడుతూ డైలాగ్స్ లేకుండా కేవలం ,కళ్లలో ఎక్స్‌ప్రెషన్స్, బాడీ లాంగ్వేజ్‌తో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టమని, మొదటి సినిమాలోనే అనీష్ అదరగొట్టాడని మెచ్చుకున్నారు. గతంలో కమల్ హాసన్, నాగార్జున, రామ్ చరణ్, సూర్య లాంటి వాళ్లు చేసిన ఛాలెంజింగ్ పాత్రల సరసన అనీష్ పాత్ర నిలుస్తుందని అన్నారు.
ఇక హీరోయిన్ అనస్వర రాజన్ నటన, ముఖ్యంగా ఆమె నవ్వులోని అమాయకత్వం తనకు బాగా నచ్చాయని, సినిమాలో కామెడీ పండించడంలో ఆమె కీ రోల్ పోషించిందని చెప్పారు. ఆమె త్వరలోనే హైదరాబాద్‌లో ఒక సొంత బిల్డింగ్ కొనే స్థాయికి ఎదగాలని సరదాగా చెప్పుకొచ్చారు మెగాస్టార్.
ఇక డైరెక్టర్ మహేష్ గురించి మాట్లాడుతూ ఇప్పుడే తనతో సినిమా చేయాలనే ఆలోచన పెట్టుకోవద్దని, ఇంకొన్నాళ్లు యంగ్ హీరోలతోనే సినిమాలు చేయాలని డైరెక్టర్‌ను ఆటపట్టించారు చిరు . అలాగే తెరపై అనీష్ కనిపిస్తూ వినిపించకపోతే, తెర వెనుక వినిపిస్తూ కనిపించని మరో హీరో తమన్ అంటూ సంగీత దర్శకుడిని మెచ్చుకున్నారు. డైరెక్టర్ వెంకీ కుడుముల నిర్మాతగా మారి కొత్త టాలెంట్‌ను ఎంకరేజ్ చేయడం మెచ్చుకోవాల్సిన విషయమని, యూత్ అంతా ఎలాంటి డౌట్ లేకుండా థియేటర్లకు వెళ్లి ఈ సినిమా చూడాలని కోరారు మెగాస్టార్ !
ALSO READ :పాలమూరు జంగిరెడ్డి పాటలకు ఫుల్ క్రేజ్.. పల్లె గొంతుక నుంచి సినిమా పాటల వరకు!