Sree Leela:టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో యంగ్ హీరోయిన్ గా మంచి పేరు సొంతం చేసుకున్న డాక్టర్ కం యాక్టర్ శ్రీ లీల (Sree Leela) గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. కెరియర్ ప్రారంభంలోనే మంచి హిట్స్ కొట్టిన ఈమె.. ఆ తర్వాత వరుస సినిమాలు చేసి, వరుసగా ఫ్లాప్స్ చవిచూసింది. దీంతో శ్రీ లీలా పని అయిపోయింది. ఇంటికి వెళ్లే టైం వచ్చింది అంటూ చాలామంది నుంచి కామెంట్లు కూడా వినిపించాయి. ముఖ్యంగా ఇప్పుడు ఉన్న హీరోయిన్లలో బెస్ట్ డాన్సర్ గా.. గ్లామర్ పులకబోస్తూ క్యూట్ బ్యూటీగా పేరు సొంతం చేసుకున్న ఈమె.. కొంతకాలంగా కొన్ని సినిమాలను వదిలేసింది. మంచి కథ దొరికితే రావడానికి సిద్ధంగా ఉన్న ఈమె తాజాగా ధనుష్ హీరోగా నటిస్తున్న ఓం అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
నవంబర్ 20వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో హైదరాబాద్ వేదికగా ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను తాజాగా నిర్వహించారు మేకర్స్. ఈ సందర్భంగా శ్రీలీల మాట్లాడుతూ తాను సినిమాలకు బ్రేక్ ఇవ్వడంపై స్పందించింది. ‘ఓం మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో భాగంగా శ్రీలీలా మాట్లాడుతూ.. రెండేళ్లుగా నేను సినిమాలు చేయడం లేదు. మెడిసిన్ అయిన తర్వాత ఇంటర్న్ షిప్ ముంబైలో చేస్తున్నాను. ఆ టైంలో ఎన్ని సినిమాలు వచ్చినా చేయలేదు. షూటింగ్ కి డేట్స్ కూడా ఇవ్వలేకపోయాను. మీ అందరికీ తెలుసు. నేను చిన్నప్పుడే ఇండస్ట్రీకి వచ్చానని.. అయితే ఆ సమయంలో ఏం సెలెక్ట్ చేసుకోవాలో కూడా నాకు తెలియదు. అందుకే ఏది వస్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. అయినా సరే మీరు నాపై ప్రేమ చూపించారు.
కానీ కొన్నాళ్ల క్రితం నేను ఆలోచించాను.. నేను చేస్తున్న తప్పులేంటి అని.. ఈ గ్యాప్ లో కొంత సమయం దొరికినప్పుడు ఆలోచించాను ఇప్పుడు ఏం చేయాలి అని.. ఇలాంటి సమయంలో నా దగ్గరికి ఓం సినిమా వచ్చింది. మనం సెలెక్ట్ చేసుకున్నప్పుడు, మన డెసిషన్స్ మనం తీసుకున్నప్పుడు మన లైఫ్ మారిపోతుంది. ఈ సినిమా దర్శకుడికి కూడా ధన్యవాదాలు చెప్పాలి. ఆ సమయంలో ఈ కథ విన్నాను. ఆయన కలిసిన వెంటనే ఇందులో పాటలు ఉండవు అని చెప్పారు. దాంతో చాలా రిఫ్రెష్ గా అనిపించింది. ఈ డైరెక్టర్ నన్ను వేరే విధంగా మార్చి ఇందులో కొత్తగా చూపించారు అంటూ తెలిపింది.
also read:సెన్సార్ పూర్తి చేసుకున్న ఆకాశంలో ఒక తార.. రన్ టైం లాక్!
మొత్తానికి అయితే తాను క్యారెక్టర్ ను బట్టి కథను ఎంచుకోకుండా తన దగ్గరకు వచ్చిన ప్రతి సినిమాను తాను ఎంచుకోవడం వల్లే ఇండస్ట్రీలో మంచి క్యారెక్టర్ అందుకోలేకపోయాను అనే రేంజ్ లో శ్రీ లీల కామెంట్లు చేసింది. మొత్తానికైతే తన తప్పు తాను ఒప్పుకున్న ఈ ముద్దుగుమ్మ.. ఇప్పుడు ఓం చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక ఓం చిత్రం విషయానికొస్తే ధనుష్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో శ్రీ లీల ధనుష్ భార్యగా నటిస్తోంది. అలాగే సాయి పల్లవి పవర్ ఫుల్ ఐపీఎస్ పాత్రలో కనిపిస్తున్నారు. మమ్ముట్టి, రేణు దేశాయ్ తో పాటు మరికొంతమంది కీలక పాత్రలు పోషిస్తున్నారు.