E-Paper
Advertisement

కొత్త 007గా రాబర్ట్.. ఎన్ని టెస్ట్‌లు పాసయ్యాడో తెలుసా?

కొత్త 007గా రాబర్ట్.. ఎన్ని టెస్ట్‌లు పాసయ్యాడో తెలుసా?
Advertisement

ఒక టక్సీడో.. చేతిలో గన్.. ముఖంలో చిరునవ్వు.. కళ్లలో మాత్రం చావంటే కనిపించని భయం. ఆయన పేరు చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రపంచానికి ఆతనొక్కడే.. జేమ్స్ బాండ్. ఆరు దశాబ్దాలుగా 007గా సిల్వర్ స్క్రీన్‌పై సందడి చేస్తున్న ఈ గూఢచారికి ఇప్పుడు కొత్త వారసుడు వచ్చేశాడు. డానియన్ క్రేగ్ డానియల్ క్రేగ్ తర్వాత బాండ్‌గా కంటిన్యూ అయ్యేది ఎవరు? అనే క్యూరియాసిటీకి ఎండ్ కార్డ్ పడింది. ఇప్పుడు కొత్త బాండ్‌గా సరికొత్తగా రానున్నాడు రాబర్ట్ పాటిన్సన్. అయితే.. ప్రపంచంలోనే అత్యంత క్రేజీ ఫిల్మ్ ఫ్రాంచైజీల్లో ఒకటైన బాండ్ పాత్రకు అతడిని ఎలా సెలెక్ట్ చేశారు? ఆ ఆడిషన్‌లో ఎలాంటి టెస్ట్‌లు ఎదుర్కొన్నాడు? బాండ్‌గా కనిపించాలంటే అసలు ఉండాల్సిన క్వాలిటీస్ ఏంటి?

అమెజాన్ MGM స్టూడియోస్‌ నుంచి అఫిషియల్ స్టేట్‌మెంట్ వచ్చేసింది. నెక్ట్స్‌ జేమ్స్ బాండ్‌గా రాబర్ట్ పాటిన్సన్‌ను సెలెక్ట్ చేసినట్టు అనౌన్స్ చేసింది. 2021లో No Time to మూవీతో డానియల్ క్రేగ్ తన 007 జర్నీకి ఎండ్ కార్డ్ వేశాడు. ఇప్పుడు 40 ఏళ్ల పాటిన్సన్ ఏడో అధికారిక జేమ్స్ బాండ్‌గా బాధ్యతలు చేపట్టబోతున్నారు.

Advertisement

ఇది బాండ్ ఫ్రాంచైజీలో 26వ సినిమా. డ్యూన్ ఫేమ్ డేనిస్ డైరెక్ట్ చేస్తున్నారు. స్టివేన్ నైట్ స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. అమెజాన్ MGM స్టూడియోస్ క్రియేటివ్ కంట్రోల్‌లో రూపొందుతున్న తొలి బాండ్ సినిమా కూడా ఇదే. ఈ పాత్ర తనకు దక్కడం తన లైఫ్‌లోనె పెద్ద అచీవ్‌ మెంట్ అంటున్నాడు పాటిన్సన్.

అయితే పాటిన్సన్‌కు ఈ రోల్ అంత ఈజీగా రాలేదు. బాండ్ పాత్ర కోసం జరిగిన వేటలో పాటిన్సన్‌ ఒక్కరే లేరు. లండన్‌లో జరిగిన స్క్రీన్ టెస్టుల్లో ఐదుగురు నటులు పోటీపడ్డారు. నికోలస్ హౌల్ట్, జాక్ లౌడెన్, జోష్ ఓ కానర్, కాలమ్ టర్నర్.. వీళ్లతో పాటు రాబర్ట్ పాటిన్సన్ కూడా బాండ్ రేసులో ఉన్నాడు.

Advertisement

ఈ రోల్ దక్కాలంటే కేవలం అందంగా కనిపిస్తే సరిపోదు. డైలాగ్ డెలివరీ, బాడీ లాంగ్వేజ్, స్క్రీన్ ప్రెజెన్స్, యాక్షన్ సీన్స్‌లో కాన్ఫిడెంట్‌గా కనిపించడం.. ఇలా అన్ని యాంగిల్స్‌లో టెస్ట్‌లు ఉంటాయి. అలా అన్నింటిని దాటుకొని చివరకు 007 లైసెన్స్ దక్కించుకున్నాడు పాటిన్సన్.

అసలు జేమ్స్ బాండ్ పాత్రకు కావాల్సిన క్వాలిటీస్ ఏంటి? బాండ్ క్యాస్టింగ్ చరిత్రపై పుస్తకం రాసిన రాబర్ట్ సెల్లర్స్‌ దీనిపై ఓ క్లారిటీ ఇచ్చారు. బాండ్ రోల్‌లో రెండు భిన్నమైన వ్యక్తిత్వాలు ఉంటాయి. ఒకవైపు.. ఖరీదైన సూట్‌లో, క్యాసినోలో అందరినీ అట్రాక్ట్‌ చేసే జెంటిల్‌మన్. మరోవైపు.. పరిస్థితి వస్తే ప్రాణాలు తీయడానికి కూడా వెనుకాడని ఓ డేంజరస్ స్పై. ఈ రెండు షేడ్స్‌ను ఒకే నటుడు అద్భుతంగా చూపించగలగాలి. 1962లో Dr. No సినిమాతో తొలి బాండ్‌గా కనిపించిన సీన్ కానరీ ఈ లక్షణాలు రెండూ కనిపించాయి. నటుడిగా మారకముందు ఆయన బాడీబిల్డర్ కూడా. అయితే కానరీ సెలక్షన్ కూడా అంత సులభంగా జరగలేదు. కొందరు నటులు అప్పటికే ఆ పాత్రను రిజెక్ట్ చేశారు.

ఇక బాండ్ ఆడిషన్స్‌లో ఒక ఇంట్రెస్టింగ్‌ టెస్ట్‌ గురించి చెప్పుకోవాలి. అదే.. టవల్ టెస్ట్. ఫ్రమ్ రష్యా విత్ లవ్ మూవీలో ఒక సీన్ ఉంటుంది. బాత్‌రూమ్ నుంచి టవల్ కట్టుకుని, చేతిలో గన్‌తో బయటకు వస్తాడు బాండ్. ఎదురుగా బెడ్‌పై ఒక రష్యన్ ఏజెంట్ ఉంటుంది. ఈ సీన్‌లో బాండ్‌లోని స్టైల్, ధైర్యం, ప్రమాదకరమైన వ్యక్తిత్వం.. అన్నీ ఒకేసారి కనిపించాలి. అందుకే ఈ సీన్ ఎన్నో ఏళ్లుగా బాండ్ రోల్ కోసం ప్రయత్నించే నటులకు ఒక బెంచ్‌మార్క్‌గా మారింది. హెన్నీ కావిల్ కూడా ఈ సీన్ చేసి చూపించారు. కానీ చివరకు ఆ అవకాశం డానియల్ క్రేగ్‌కు దక్కింది.

బాండ్ క్యాస్టింగ్ హిస్టరీలో కొన్ని కథలు సినిమాలను మించిపోతాయి. జార్జ్‌ లాజెన్ బై అప్పట్లో మోడల్. అయినా నిర్మాతల దగ్గరకు వెళ్లి తాను నటుడినని చెప్పి ఆడిషన్‌లో చాన్స్‌ కొట్టేశారు. లాస్ట్‌కు బాండ్ అయ్యారు. కానీ ఒక్క సినిమాతోనే అతని జర్నీ ముగిసింది. పియర్స్ బ్రాస్నన్ కథ మరోలా ఉంటుంది. 1986లోనే ఆయనకు బాండ్ అయ్యే అవకాశం వచ్చింది. కానీ అప్పటికే ఉన్న టీవీ సిరీస్ కాంట్రాక్ట్ కారణంగా ఆ రోల్ దక్కలేదు. ఆ అవకాశం తిమోతి డాల్టన్‌కు వెళ్లింది. మరో తొమ్మిదేళ్ల తర్వాత గోల్డెన్ ఐ మూవీతో బ్రాస్నన్‌ బాండ్‌గా ఎంట్రీ ఇచ్చారు. అంటే.. బాండ్ కావడానికి టాలెంట్ ఒక్కటే కాదు.. టైమింగ్ కూడా కలిసిరావాలి.

ఇక డానియల్ క్రేగ్ సెలక్షన్ టైమ్‌లో కూడా పెద్ద వివాదమే జరిగింది. 2005లో ఆయన పేరును ప్రకటించగానే కొందరు ఫ్యాన్స్‌ తీవ్రంగా వ్యతిరేకించారు. అందుకు కారణాలు.. బాండ్‌కు ఉండాల్సిన రూపం లేదని, బాండ్‌లా కనిపించడం లేదని విమర్శలు చేశారు. క్రేగ్ నాట్ బాండ్ డాట్ కామ్ పేరుతో వెబ్‌సైట్ కూడా పెట్టారు. క్యాసినో రాయల్ మూవీని బైకాట్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు.

కానీ అదే క్రేగ్ తర్వాత మోస్ట్ పాపులర్ బాండ్‌గా నిలిచారు. అంటే.. కొత్త బాండ్‌పై మొదట వచ్చే విమర్శలే కొన్నిసార్లు ఆ పాత్రకు మరింత హైప్ తీసుకొస్తాయన్నమాట.

ఇప్పుడు రాబర్ట్ పాటిన్సన్ విషయానికొద్దాం. హ్యారిపాటర్ మూవీలో సెడ్రిక్ డిగ్గోరిగా.. ట్విలైట్‌లో ఎడ్వర్డ్ కల్లెన్‌గా టీనేజ్ వ్యూయర్స్‌కు దగ్గరయ్యారు. కానీ అక్కడితో ఆగిపోలేదు. గుడ్‌ టైమ్‌లో క్రిమినల్‌గా, ది బ్యాట్ మాన్ డార్క్‌లో హీరోగా తన యాక్టింగ్‌లో మరో యాంగిల్‌ను చూపించారు. క్రిస్టోఫర్ నోలన్ మూవీల్లోనూ యాక్ట్ చేశారు. పాత్రకు తగ్గట్టుగా తనను తాను మార్చుకోవడం, విభిన్నమైన యాక్సెంట్లు పలకడం పాటిన్సన్‌ బలం. సీన్ కానరీ నుంచి డానియల్ క్రేగ్ వరకు.. ప్రతి కొత్త బాండ్‌ను అభిమానులు మొదట ప్రశ్నించారు. తర్వాత అదే నటులను తమ అభిమాన బాండ్‌గా యాక్సెప్ట్ చేశారు.

Also Read: అత్యంత సంపన్నుల చీకటి కోణం.. హైస్కూల్ నుంచే మొదలైన నేర చరిత్ర.. ఈ సిరీస్ చూస్తే వెన్నులో వణుకు పుట్టాల్సిందే

ఎందుకంటే బాండ్ అంటే కేవలం ఒక నటుడు కాదు.. అదొక బ్రాండ్. ఒక స్టైల్.. ఒక ఇమేజ్.. ఒక ఎమోషన్. ఇప్పుడు ఆ వారసత్వాన్ని కొనసాగించాల్సిన బాధ్యత రాబర్ట్ పాటిన్సన్‌పై ఉంది. మరి కొత్త 007గా ఆయన చేసే మ్యాజిక్ ఎలా ఉండబోతోంది? ది నేమ్ ఈజ్ పాటిన్సన్.. రాబర్ట్ పాటిన్సన్.. అనే టైమ్‌ దగ్గరలోనే ఉంది.

Tags

Related News

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

Big Stories

Advertisement
×