E-Paper
Advertisement

‘కాకా ‘ ఓకే.. ‘విశ్వంభరా’ పరిస్థితి ఏంటి..?

‘కాకా ‘ ఓకే.. ‘విశ్వంభరా’ పరిస్థితి ఏంటి..?
Advertisement

Kaaka VS viswambhara : టాలీవుడ్ స్టార్ హీరో మెగాస్టార్ చిరంజీవి సినిమాల గురించి ఎప్పుడూ ఏదో ఒక చర్చ జరుగుతూనే ఉంటుంది. తాజాగా ఆయన నటిస్తున్న రెండు సినిమాలపై ఒక ఆసక్తికరమైన అప్డేట్ బయటికి వచ్చేసింది. ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి బాబి దర్శకత్వంలో ‘కాకా’ సినిమాతో పాటుగా వశిష్ట దర్శకత్వంలో ‘విశ్వంభర’ సినిమాలలో నటిస్తున్నారు.. ఈ సినిమాలు షూటింగ్ పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్నాయి.. అయితే ఈ రెండు సినిమాలలో ఏ సినిమా ముందుగా థియేటర్లలో రిలీజ్ కాబోతుంది అన్న ప్రశ్న ఇప్పటికీ ఒక కన్ఫ్యూజన్ గానే మిగిలిపోతుంది. ఈ సినిమాలని ఎప్పుడూ థియేటర్లలో చూస్తామని అటు అభిమానులు కూడా ఈగరుగా వెయిట్ చేస్తున్నారు. అయితే ఇప్పటికే ఈ రెండు వాయిదా పడిన విషయం తెలిసిందే.. తాజాగా చిరంజీవి ‘కాకా’ సినిమా బిజినెస్ గురించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకు వచ్చింది. మరి ఈ మూవీ బిజినెస్ ఎలా ఉంది? విశ్వంభర బిజినెస్ ఏంటి అన్నది కాస్త వివరంగా తెలుసుకుందాం..

‘కాకా’ బిజినెస్ క్లోజ్..

చిరంజీవి కుర్ర హీరోలకు పోటీ ఇస్తూ వరుసగా సినిమాలు చేస్తున్నాడు. ఈ ఏడాది మనశంకర వరప్రసాద్ గారు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించిన చిరంజీవి ఆ సినిమాతో బ్లాక్ బస్టర్ విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పుడు ఆయన చేతిలో రెండు సినిమాలు ఉన్నాయన్న విషయం చెప్పనక్కర్లేదు. తన హిట్ డైరెక్టర్ బాబి కొల్లి దర్శకత్వంలో ‘కాకా’ సినిమాతో పాటుగా వశిష్ట కాంబోలో సినిమాల లో నటిస్తున్నారు.. అయితే ముందుగా డిసెంబర్ సినిమాని ప్రేక్షకులు ముందుకు తీసుకు వచ్చేందుకు మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాలకు సంబంధించిన బిజినెస్ డీల్ కూడా దాదాపు పూర్తయినట్లు తెలుస్తుంది. అయితే ఈ సినిమాలలో ఏ సినిమా ముందుగా థియేటర్లలోకి వస్తుంది అన్నది మాత్రం ఇప్పటివరకు మేకర్స్ క్లారిటీ ఇవ్వలేదు.. దీంతో ఈ సినిమాపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాలో విడుదల తేదీల గురించి త్వరలోనే ఒక క్లారిటీ ఇస్తారేమో అన్నది చూడాలి..

‘విశ్వంభర’ ఎప్పుడొస్తుంది..?

Advertisement

మన శంకర్ వరప్రసాద్ సినిమా కన్నా ముందే విశ్వంభరా మూవీ షూటింగ్ మొదలైంది.. అయితే విజువల్ వండర్ గా తెరకెక్కిన ఈ సినిమా షూటింగ్ తో పాటుగా గ్రాఫిక్స్ ఆలస్యం కావడంతో వాయిదా పడింది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత మరొక సినిమాను కూడా చిరంజీవి చేశారు. ఆ సినిమానే కాకా.. ఈ మూవీ ని కూడా పూర్తి చేసిన చిరంజీవి త్వరలోనే థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు సిద్ధమవుతున్నారు. కొన్ని ఏరియాల్లో కాకా కి మంచి బిజినెస్ జరిగింది. కానీ విశ్వంభర పరిస్థితి మాత్రం దారుణంగా మారింది అంటూ ఓ వార్త సోషల్ మీడియాలో వినిపిస్తుంది.. ఇంకా ఓవర్సీస్, ఏపీ, నాన్ థియేట్రికల్ లో శాటిలైట్ హక్కులు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. ఈ సినిమా కూడా సంక్రాంతికి ముందే అని అంటున్నారు. ఇంకా బిజినెస్ డీటెయిల్స్ బయటకు రాకపోవడంతో ఈ సినిమా ఇప్పట్లో వస్తుందన్న అనుమానాలు కూడా మెగా ఫాన్స్ లో వ్యక్తమవుతున్నాయి. అంటే కాదు ముందుగా కాకా సినిమా విడుదల అయితే మాత్రం విశ్వంభర మళ్లీ వాయిదా పడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మరి ఏం జరుగుతుంది? ఈ సినిమాల రిలీజ్ డేట్ ల గురించి మేకర్స్ ఎప్పుడు క్లారిటీ ఇస్తారు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది.

Also Read :రంగుల చీరలో మహా ఎంత క్యూట్ గా ఉందో.. కుర్రాళ్ళు ఏమైపోతారు..!

Related News

పూజా హెగ్డే ఒక్కనెలకు అంత సంపాదిస్తుందా..? సినిమా కన్నా ఎక్కువ..

మహేష్ బాబు సినిమాకు వివాదాలు తప్పవా? వేణుస్వామి వ్యాఖ్యలు వైరల్!

తరుణ్ భాస్కర్ మ్యాజిక్ చేస్తున్నాడు.. దిల్ రాజు కామెంట్స్ వైరల్!

కుర్ర హీరోయిన్ నవ్వుకు ఫిదా అయిన చిరంజీవి!

ఇండస్ట్రీ మొత్తం ఆ కుర్రాడి వెనకే.. మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్!

కొత్త 007గా రాబర్ట్.. ఎన్ని టెస్ట్‌లు పాసయ్యాడో తెలుసా?

బ్లూ శారీలో సౌమ్య టాండన్ మెరుపులు.. సింప్లిసిటీకి ఫిదా అవుతున్న నెటిజన్లు!

Big Stories

Advertisement
×