E-Paper
Advertisement

కుర్ర హీరోయిన్ నవ్వుకు ఫిదా అయిన చిరంజీవి!

కుర్ర హీరోయిన్ నవ్వుకు ఫిదా అయిన చిరంజీవి!
Advertisement

Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఈయన బాబీ దర్శకత్వంలో కాకా (Kaaka)సినిమా పనులలో బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13వ తేదీ విడుదల కాబోతున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ పనులు చివరి దశకు చేరుకున్నాయి. ఇలా ఒకవైపు సినిమా పనులలో బిజీగా ఉంటూనే మరొక చిరంజీవి ఎంతోమంది హీరోల సినిమా ప్రమోషన్లలో పాల్గొంటూ వారికి మంచి ప్రోత్సాహం కల్పిస్తున్నారు. తాజాగా చిరంజీవి సాయి అనీష్ హీరోగా నటించిన ఇట్లు అర్జున (Itllu Arjuna)సినిమా సక్సెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.

అనస్వర నవ్వు బాగుంటుంది..

ఈ కార్యక్రమంలో భాగంగా చిరంజీవి(Chiranjeevi) సినిమా గురించి అలాగే హీరో సాయి అనీష్ గురించి పెద్ద ఎత్తున ప్రశంసలు కురిపించారు. ఇక ఈ సినిమాలో సాయి అనీష్ జోడీగా అనస్వర రాజన్(Anaswara Rajan)హీరోయిన్ పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ నటన గురించి చిరంజీవి ప్రశంసలు కురిపించారు. అనంతరం అనస్వర తనతో పాటు గత ఎనిమిది నెలలుగా కాకా సినిమా షూటింగ్ పనులలో భాగంగా ట్రావెల్ అవుతుందని తెలిపారు. చాలా చక్కగా మాట్లాడుతుందని, ఆమె నవ్వు నాకు చాలా ఇష్టం అంటూ చిరంజీవి అనస్వర రాజన్ పై ప్రశంసలు కురిపించారు. ఇలా అనస్వర నవ్వు తనని ఫిదా చేసిందంటూ మెగాస్టార్ మాట్లాడటంతో ఈ కామెంట్స్ కాస్త వైరల్ అవుతున్నాయి.

డాక్టర్ గా అనస్వర రాజన్..

Advertisement

మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న కాకా సినిమాలో అనస్వరరాజన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఏ పాత్రలో నటిస్తుందనే విషయం గురించి ఇప్పటివరకు చిత్ర బృందం వెల్లడించలేదు. ఈమెకి సంబంధించిన పోస్టర్ విడుదల చేయగా ఈమె ఈ సినిమాలో డాక్టర్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే చిరంజీవికి అనస్వర రాజన్ రిలేషన్ ఏంటి అనే విషయంపై ఇదివరకు ఎక్కడ వెల్లడించలేదు ఇట్లు అర్జున సినిమా ఈవెంట్ లో చిరు కచ్చితంగా లీక్ చేస్తారని అందరూ భావించారు కానీ ఈయన మాత్రం ఈ విషయంపై చాలా జాగ్రత్తగా ఉన్నారు.

మాటలు లేని అమ్మాయిగా అనస్వర…

ఇక కాకా సినిమాలో అనస్వర చిరంజీవికి కూతురి పాత్రలో నటిస్తున్నారు అంటూ గత కొద్ది రోజులుగా వార్తలు వస్తున్నాయి . అయితే ఈ ఈవెంట్ లో చిరు నువ్వేమైనా మాట్లాడతావా అంటూ అనస్వర అడగక ఆమె మాట్లాడనని చెప్పారు. దీంతో తను మాట్లాడదు అంటూ చిరంజీవి తన పాత్ర గురించి హింట్ ఇచ్చారు. ఇలా చిరు కామెంట్స్ వైరల్ గా మారడంతో ఈ సినిమాలో మాటలు లేని అమ్మాయిగా అనస్వర కనిపించబోతున్నారా? చిరంజీవి ఈ విషయాన్ని ఇలా పరోక్షంగా తెలియజేశారా? అంటూ అభిమానులు సందేహాలను వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమాలో అనస్వర పాత్ర ఏంటి అనేది తెలియాలి అంటే కొద్ది రోజులు ఎదురు చూడాల్సిందే.

Advertisement

Also Read: శర్వా’భోగి’ సెన్సార్ పూర్తి..విడుదల ఎప్పుడంటే?

Related News

మృణాల్ ఠాకూర్ స్టైలిష్ లుక్.. బ్లాక్ అవుట్‌ఫిట్‌లో అదరగొట్టేస్తోందిగా!

రామకృష్ణకు అప్పటికే పెళ్లైందా? గీతాంజలి కొడుకు షాకింగ్ కామెంట్స్!

సీఎం విజయ్ కు ధనుష్ స్పెషల్ థాంక్స్..ఎందుకంటే?

హైదరాబాద్ వేదికగా గ్లోబల్ హంగామా.. టాలీవుడ్ రెడీ!

ఏడాది జైలు శిక్ష.. కోర్టు తీర్పుపై బండ్ల గణేశ్ రియాక్షన్ వైరల్!

రూ.50 పెట్టుబడితో ఈ స్థాయిలో ఉన్నా.. అలీ సక్సెస్ సీక్రెట్ అదేనా?

వారణాసి విడుదల వాయిదా?కొత్త విడుదల తేదీ ఎప్పుడంటే?

15 నిమిషాల కార్ జర్నీలో పుట్టిన పాట.. ఇప్పుడు అందరి మనసుల్లో!

Big Stories

Advertisement
×