Dil Raju ENE:దిల్ రాజు ..స్టార్ ప్రొడ్యూసర్ గా ఎన్నో సినిమాలని తీసిన ఈ క్రేజీ ఫిలిం మేకర్ తాజాగా ENE రిపీట్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో పాల్గొని పలు ఆసక్తి కరమైన కామెంట్స్ చేసుకొచ్చాడు.
చాలా రోజుల తర్వాత ఒక ప్రీ రిలీజ్ వేడుకలో ఇలాంటి వైబ్ కనిపిస్తోందని అన్నారు. సినిమా విడుదలకు ముందే ఇక్కడ కనిపిస్తున్న ఉత్సాహం చూస్తుంటే తరుణ్ భాస్కర్ ఏదో మ్యాజిక్ చేసినట్టున్నాడని మెచ్చుకున్నారు .
గతంలో ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా విడుదలైనప్పుడు ప్రేక్షకుల్లో మంచి టాక్ వచ్చినప్పటికీ, అప్పట్లో ఇంత వైరల్ అవ్వలేదని దిల్ రాజు గుర్తుచేశారు. అయితే రీ రిలీజ్ సమయంలో మాత్రం సినిమా సత్తా ఏంటో కనబడిందని చెప్పుకొచ్చారు .సురేష్ బాబు విడుదల చేసిన సమయంలో హైదరాబాద్‌తో పాటు నైజాం ప్రాంతంలో కోటి రూపాయలకు పైగా రీ రిలీజ్ షేర్ సాధించడం మాములు విషయం కాదని తెలిపారు .
ఇక ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’ పోస్టర్ విడుదలైనప్పటి నుంచి ప్రేక్షకుల్లో అంచనాలు పెరుగుతూ వచ్చాయని ,ముఖ్యంగా మొదటి భాగంలో కనిపించిన నలుగురు స్నేహితుల కథకు సీక్వెల్ గా ఈ సినిమా వస్తుండటంతో అభిమానుల్లో ఆసక్తి మరింత పెరిగిందని తెలిపారు.
తెలుగు రాష్ట్రాల్లో తమ సంస్థ ద్వారా ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నామని, బుకింగ్స్ ఎలా ఉన్నాయని మూవీ టీమ్ ని అడిగినప్పుడు అద్భుతంగా ఉన్నాయని చెప్పడంతో తనకు కూడా చాలా సంతోషం కలిగిందని చెప్పుకొచ్చారు.
ఇక దర్శకుడు తరుణ్ భాస్కర్ గురించి మాట్లాడుతూ ‘పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’, ‘కీడా కోలా’ వంటి వెరైటీ సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న తరుణ్ భాస్కర్.. దర్శకత్వంపైనే ఫోకస్ పెట్టాలని సూచించారు.
ఇక ఏడాదికి ఒక మంచి సినిమాను తెలుగు ప్రేక్షకులకు అందించేలా ప్రయత్నిస్తే, భవిష్యత్తులో శేఖర్ కమ్ముల తరహాలో మంచి చిత్రాలను అందించే దర్శకుడిగా ఎదుగుతాడని తన అభిప్రాయాన్ని బయటపెట్టారు. తరుణ్‌లో మంచి సినిమాలు తీసే టాలెంట్ ఉందని దాన్ని మరింత ఉపయోగించుకోవాలని కోరారు.
ఈ ఈవెంట్ లో నిర్మాత సృజన్ గురించి మాట్లాడుతూ అమెరికాలో క్యాబ్ నడుపుకుంటూనే సినిమా నిర్మాణంపై ఆసక్తితో రాత్రివేళల్లో కథా చర్చల్లో పాల్గొనడం, సినిమా కోసం ఇంతలా కష్టపడటం తనను ఆశ్చర్యపరిచిందని చెప్పారు. సినీ పరిశ్రమలో ఎన్నో సంవత్సరాలుగా ఉన్నప్పటికీ ఇలాంటి. ప్రొడ్యూసర్ లు చాలా రేర్ గా కనిపిస్తారని చెప్పారు.
సృజన్ నిర్మించిన ‘35 చిన్న కథ కాదు’ సినిమాకు జాతీయ అవార్డు వచ్చిన సమయంలో తాను అమెరికాలోనే ఉన్నానని, ఆ ఆనందాన్ని దగ్గరుండి చూశానని గుర్తుచేసుకున్నారు.యూత్‌ను దృష్టిలో పెట్టుకుని వస్తున్న ఈ సినిమా ప్రేక్షకులకు మంచి వినోదాన్ని అందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
ముఖ్యంగా చాలా రోజుల తర్వాత స్నేహితులందరూ కలిసి థియేటర్లలో ఎంజాయ్ చేసేలా ఒక మంచి యూత్‌ఫుల్ సినిమా వస్తోందని చెప్పారు.మొత్తానికి దిల్ రాజు స్పీచ్ చూస్తుంటే ‘ఈ నగరానికి ఏమైంది రిపీట్’పై మూవీ టీమ్ మాత్రమే కాకుండా రిలీజ్ చేసే ఆయన కూడా మంచి నమ్మకంతో ఉన్నట్లు కనిపిస్తోంది.చూడాలి మరి నవంబర్ 18న సినిమా ఎలాంటి ఫలితాన్ని రాబడుతుందో !
also read:ఇండస్ట్రీ మొత్తం ఆ కుర్రాడి వెనకే.. మెగాస్టార్ సెన్సేషనల్ కామెంట్స్!