Kannapp Movie : టాలీవుడ్ యంగ్ హీరో మంచు విష్ణు ప్రస్తుతం తన డ్రీమ్ ప్రాజెక్టు ‘కన్నప్ప’. ఈ మూవీకి గత కొన్ని రోజులుగా ఏదోక ఆటంకం కలుగుతూనే ఉంది. మొత్తానికి అన్నీ అడ్డులు తొలగించుకొని థియేటర్లలోకి రాబోతుంది. ఈ నెల 27 న భారీ అంచనాల నడుమ ప్రపంచ వ్యాప్తంగా రిలీజ్ కాబోతుంది.. ప్రతి మూవీ టిక్కెట్ ధరల పై ఒక క్లారిటీ రాలేదు. తాజాగా ఏపీ సర్కార్ ఈ మూవీకి గుడ్ న్యూస్ చెప్పింది. సినిమా టికెట్ ధరలపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. టికెట్ ధరల పెంపుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు బుధవారం సాయంత్రం అనుమతి ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.. మరి ఒక్కో టిక్కెట్ ధర ఎంతుందో ఒకసారి వివరంగా తెలుసుకుందాం..
‘కన్నప్ప’కు ఏపీ గుడ్ న్యూస్.. టికెట్ ఎంతంటే..?
ప్రతి మూవీ థియేటర్లలోకి రిలీజ్ అవ్వక ముందు ఏపీ, తెలంగాణాలో టికెట్ ధరల గురించి పెద్ద చర్చే జరుగుతుంది. ఈ మూవీకి కూడా అదే జరిగింది. ఏపీ సర్కార్ ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకొనే వెసులు కల్పిస్తుంది. కన్నప్పకు కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్ర వ్యాప్తంగా ఈ మూవీ టికెట్ ధరలను పెంచుకోవడానికి అనుమతి ఇచ్చింది. రాష్ట్రంలోని సింగిల్ స్క్రీన్, మల్టీప్లెక్స్‌లలో టికెట్ ధరలను రూ.50 వరకు పెంచుకునేందుకు వెసులుబాటు కల్పించింది. సినిమా విడుదలైన తరవాత పది రోజుల వరకు టికెట్ ధరలు పెంచుకునే అవకాశం ఉందని ప్రభుత్వం ఉత్తర్వులలో పేర్కొంది.. ఇది నిజంగానే గుడ్ న్యూస్ అనే చెప్పాలి.
Also Read :థియేటర్లలోకి రాబోతున్న కొత్త చిత్రాలు.. తెలుగులో కన్నప్పతో పాటు..
మూవీ పోస్ట్ పోన్ కు కారణం..?
ఈ కన్నప్ప షూటింగ్ పూర్తి చేసుకొని విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో పూర్తి అయ్యింది. కానీ ఇప్పటికీ విడుదలకు నోచుకోలేదు. అదిగో, ఇదిగో అంటున్నారు తప్ప రిలీజ్ డేట్ ను ఫిక్స్ చెయ్యలేదు. గతంలో రెండు సార్లు కన్నప్ప వాయిదా పడింది. ఈ మూవీ పై మొదటి నుంచి భారీ అంచనాలు ఉండటంతో సినీ అభిమానులు సినిమాను థియేటర్లలో చూసేందుకు ఆసక్తి కనబరుస్తున్నాయి. మొన్నటివరకు ఈ మూవీ హార్డ్ డిస్క్ మాయం అంటూ పుకార్లు వినిపించాయి.. అది ఇంకా తేలలేదు కానీ తాజాగా మంచు విష్ణు ఓ ఇంటర్వ్యూలో షాకింగ్ విషయాలను షేర్ చేశారు.. సినిమా డిలే అవ్వడానికి కారణం చెప్పాడు. ప్రస్తుతం ఇది హాట్ టాపిక్ అవుతుంది. ఈ సినిమాను భారీ బడ్జెట్‌తో తెరకెక్కించారు. సొంత బ్యానర్ 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీపై ఈ సినిమాను నిర్మించిన సంగతి తెలిసిందే. ఈ మూవీలో రెబల్ స్టార్ ప్రభాస్ కూడా ముఖ్యమైన పాత్రలో నటించారు. ప్రభాస్‌తో పాటు సీనియర్ హీరో మోహన్ లాల్, బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సైతం ఈ చిత్రంలో నటించడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక భారీగా టికెట్స్ బుక్ అవుతున్నాయి. బుక్ మై షో యాప్‌లో గంటకు 3 నుండి 5వేల మధ్య టికెట్స్ బుక్ అవుతున్నాయి.. మరి సినిమా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుందో చూడాలి..