Anirudh Dhanush:అనిరుధ్ రవిచందర్..తనదైన సంగీతంతో సౌత్ సినిమాలని నెక్స్ట్ లెవెల్ కి తీసికెళ్ళిన ఈ క్రేజీ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ తాజాగా కావ్యా మారన్ ని పెళ్లి చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలోకి మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంట్రీ ఇచ్చి అపుడే 15 ఏళ్ళు కంప్లీట్ చేసుకున్నాడు కూడా.
ఇక ఈ క్రమంలోనే అనిరుధ్ సోషల్ మీడియాలో ఒక నోట్ చేశాడు.అయితే దీంట్లో తన కెరీర్ ఎదుగుదలలో తోడ్పడ్డ చాలా మంది పేరు రాసుకొచ్చాడు కాని,ఒక్క ధనుష్ పేరుని మిస్ చేసేశాడు. దీంతో అనిరుధ్‌పై ఓ రేంజ్‌లో ఫైర్ అవుతున్నారు ధనుష్ ఫ్యాన్స్. అసలు ధనుష్ లేకుండా అనిరుధ్ ఎక్కడ అంటూ సోషల్ మీడియాలో చెడుగుడు ఆడేస్తున్నారు.
అనిరుధ్ విషయానికి వస్తే తను అందించే సాంగ్స్ తో పాటు బీజీఎంలకి ఎంత పెద్ద ఫ్యాన్స్ బేస్ ఉందో చెప్పక్కర్లేదు.ఇక చాలా సినిమాలు ఈ బీజీఎంలతోనే నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళిపోయాయి.అయితే కెరీర్ మొదట్లో అనిరుధ్ కి ధనుష్ ఇచ్చిన సపోర్ట్ అంతా ఇంతా కాదు. 2012లో ధనుష్ హీరోగా వచ్చిన ‘3’ సినిమాతోనే అనిరుధ్ మ్యూజిక్ డైరెక్టర్‌గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు.
ఆ సినిమాలో ధనుష్ హీరోగా నటించడమే కాకుండా నిర్మాణ, దర్శకత్వ బాధ్యతలను తన మీదే వేసుకున్నాడు. ముఖ్యంగా ఆ సినిమాలోని ‘వై దిస్ కొలవెరి డి’ అప్పట్లో ప్రపంచాన్ని ఎలా ఊపిందో చెప్పక్కర్లేదు.ముఖ్యంగా వాళ్ళు వీళ్ళు అన్న తేడా లేకుండా అందరిని ఈ పాట షేక్ చేసేసింది.
అంతే కాకుండా వీరిద్దరి కాంబోలో ‘వేలై ఇల్లా పట్టధారి’ (VIP), ‘మారి’వంటి సాలిడ్ హిట్స్ వచ్చాయి కూడా. ముఖ్యంగా ‘VIP’ పాటలు అప్పట్లో యూత్ ని ఒక ఊపు ఊపాయనే చెప్పాలి.ఇక ఇప్పటికీ ‘మారి’ టైటిల్ సాంగ్ ధనుష్ ఫ్యాన్స్ చార్ట్ బస్టర్ లిస్టు లో ఉంటుంది. దీంతో తన కెరీర్ కి ఇంతలా చేయూతని అందించిన ధనుష్ పేరుని అనిరుధ్ మర్చిపోవడం ఏంటని చెడుగుడు ఆడేస్తున్నారు.
కొత్త టాలెంట్‌ను నమ్మి మొదటి అవకాశం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయమని, ధనుష్ లేకపోతే అనిరుధ్ కెరీర్ ఇలా ఇంత గ్రేట్ గా ఉండేదా అని క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు కొందరు. ఇక దీనికి తోడు అనిరుధ్, కావ్యల పెళ్లికి ధనుష్‌కు ఇన్విటేషన్ అందలేదనే వార్తలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవడంతో ఈ రెంటిని మిక్సప్ చేస్తూ వీరిద్దరికీ ఎక్కడో చెడింది అందుకే ఇలా ..అంటూ ఎవరికి తోచిన విధంగా వాళ్ళు విశ్లేషణ చేస్తున్నారు.
పైగా ఆ మధ్య రజనీ కూతురు మాట్లాడిన ఒక పాత వీడియోను కొందరు మళ్లీ షేర్ చేస్తూ వీళ్లిద్దరి మధ్య ఎదో ఉందన్న రూమర్స్ ని మరింత స్ప్రెడ్ చేసే పనిలో పడ్డారు.అయితే వీటిని సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న రూమర్స్ గానే మనం చూడాలి .
అయితే తన 15 ఏళ్ల కెరీర్‌ను గుర్తుచేసుకునేటప్పుడు ఎవరి పేరు రాయాలి, ఎవరి పేరు రాయకూడదు అనేది పూర్తిగా అనిరుధ్ పర్సనల్ ఛాయిస్ అని కొందరు సపోర్ట్ చేస్తుంటే కేవలం పేరు లేనంత మాత్రానా వారిద్దరి మధ్య ఎదో ఉందన్న వార్తలని స్ప్రెడ్ చేయడం మంచిది కాదని మరికొందరు సలహా ఇస్తున్నారు.ఏది ఏమైనా అసలేం జరిగింది అన్నది వీరిలో ఎవరైనా బయటపెడితేనే ఒక క్లారిటీ వచ్చేది !
ALSO READ :జూనియర్ బాలు దైవిక్‌కు జరిగిన అవమానం వెనుక అసలు కథ!