NTR Dragon:యంగ్ టైగర్ ఎన్టీఆర్ ..ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ వంటి క్రేజీ ఫిలిమ్ ని చేసుకుపోతున్న ఎన్టీఆర్ ఇపుడు మరిన్ని సినిమాలని లైన్లో పెట్టుకుపోతున్నాడు.నిజానికి తారక్ చేస్తున్న ఈ సినిమాని జూన్ 11న రిలీజ్ చేస్తామని మేకర్స్ ఇప్పటికే అనౌన్స్ చేసేశారు.
అయితే కారణాలేవైనా అసలు సినిమా నిజంగా అనుకున్న డేట్ కి వస్తుందా లేదా అంటూ సినిమా రిలీజ్ గురించి రకరకాల డిబేట్లు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి.అయితే వాటికి ఎండ్ కార్డ్ వేస్తూ తాజాగా నిర్మాత నాగవంశీ క్లారిటీ ఇచ్చేశారు.
విషయంలోకి వెళ్తే ‘కేజీఎఫ్’, ‘సలార్’ సినిమాలతో ఇండియా వైడ్‌గా క్రేజ్ తెచ్చుకున్న ప్రశాంత్ నీల్ ఈసారి డ్రాగన్ అంటూ ఎన్టీఆర్‌ను ఏ రేంజ్‌లో చూపిస్తారోనని క్యూరియస్ గా ఉన్నారు తారక్ ఫ్యాన్స్. తారక్ మాస్ ఇమేజ్‌కు ప్రశాంత్ నీల్ స్టైల్ యాక్షన్ కలిస్తే బాక్సాఫీస్ దగ్గర రికార్డులు బద్దలవడం ఖాయమని చెప్పక్కర్లేదు కూడా.
అయితే సినిమా జూన్ 11నే వస్తుందా లేక మళ్ళీ ఎప్పటిలాగే వాయిదాల పాట పాడుతుందా అంటూ గత కొంత కాలంగా డౌట్స్ రైజ్ చేస్తున్నారు తారక్ ఫ్యాన్స్. కానీ నిర్మాత నాగవంశీ మాత్రం ఈ సినిమా జూన్‌లో కచ్చితంగా విడుదల అవుతుందని గట్టిగా క్లారిటీ ఇచ్చారు.దీంతో ఇక సమ్మర్ సీజన్ లో మా బుడ్డోడి హంగామా మాములుగా ఉద్నాడు గా అంటూ ఇప్పటి నుండే కాలర్ ఎగరేస్తున్నారు నందమూరి ఫ్యాన్స్.
ఇక ‘డ్రాగన్’ తర్వాత ఎన్టీఆర్ చేయబోయే సినిమా మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్‌తో ఉండబోతోందన్న టాక్ వినిపిస్తుంది.ఇప్పటికే వీరి కాంబోలో సినిమా వస్తుందంటూ పోస్టర్ అఫీషియల్ గా వదిలారు కూడా. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్‌లో వచ్చిన ‘అరవింద సమేత వీర రాఘవ’ ఏ రేంజ్ సక్సెస్ అయిందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ముఖ్యంగా ఆ సినిమాలో తారక్ నటనకు, త్రివిక్రమ్ డైలాగులకు సాలిడ్ రెస్పాన్స్ వచ్చింది.దీంతో ఇప్పుడు మళ్లీ ఈ ఇద్దరూ కలిసి సినిమా చేయబోతుండటంతో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి.
ఇక ఈ సినిమాకు ‘గాడ్ ఆఫ్ వార్’ అనే టైటిల్ వినిపిస్తోంది. అయితే ఈ సినిమా కథ ఏంటి? ఇది పురాణాలకు సంబంధించిన కథా లేక పూర్తిగా కొత్త తరహా యాక్షన్ డ్రామానా? అనే విషయంపై క్లారిటీ రావాల్సి ఉంది.పైగా సినిమా టైటిల్స్ ‘గాడ్ ఆఫ్ వార్’అని మేకర్స్ కూడా అఫీషియల్ గా ఎక్కడా అనౌన్స్ చేయలేదు కూడా. సో అసలు విషయం మేకర్స్ బయటపెడితే కాని తెలిసే పరిస్థితి లేదు.
మరోవైపు సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో కూడా ఎన్టీఆర్ సినిమా ఉండబోతుందనే టాక్ గట్టిగానే వినిపిస్తుంది. అనిల్ రావిపూడి సినిమాల్లో కామెడీ, ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఎ రేంజ్ లో ఉంటాయో చెప్పక్కర్లేదు.‘ఎఫ్2’, ‘సరిలేరు నీకెవ్వరు’, ‘భగవంత్ కేసరి’ ఇలా వరుస సాలిడ్ సక్సెస్ లతో తానెంటో ప్రూవ్ చేసుకున్నాడు కూడా.
దీంతో ఇపుడు అనిల్ ఎన్టీఆర్‌తో సినిమా చేస్తే ఎలా ఉంటుందా అని క్యూరియస్ గా వాచ్ చేస్తున్నారు మూవీ లవర్స్. పైగా ఈ సినిమా 2027 ఏప్రిల్‌లో మొదలయ్యే ఛాన్స్ ఉందని అప్పుడే ముహూర్తాలు కూడా పెట్టేస్తున్నారు ట్రేడ్ పండితులు.మరి త్రివిక్రమ్ సినిమా పూర్తయిన తర్వాతే ఇది సెట్స్ మీదికి వెళ్తుందా లేక ఒకే సారి షూట్ చేస్తారా చూడాలి.ఏది ఏమైనా వార్ 2 తర్వాత మళ్ళీ పలకరించని తారక్ వచ్చే ఏడు మూడు సినిమాలతో పలకరించనున్నాడన్న మాట. చూడాలి ఈ దండయాత్రతో బాక్సాఫీస్ ని ఎలా షేక్ చేస్తాడో !
ALSO READ :అనిరుధ్‌పై ధనుష్ ఫ్యాన్స్ ఫైర్.. ఎందుకీ వివాదం?