Mudra Loan: ముద్రా రుణాల పేరుతో భారీ సైబర్ మోసం బైటపడింది. ఈ ముఠాను మల్కాజిగిరి పోలీసులు గుట్టురట్టు చేసారు. 11.50 లక్షల రుణం ఇప్పిస్తామంటూ నమ్మించి.. బాధితుడి నుంచి రూ.4,67,800 సైబర్ నేరగాళ్లు కాజేసారు. ఫేస్‌బుక్‌లో ముద్రా లోన్ ప్రకటనతో మోసానికి తెరలేపి నట్టు పోలీస్ అధికారులు తెలిపారు. మనోజ్ అనే పేరుతో దందా చేస్తున్నారు.
ప్రాసెసింగ్ ఫీజు, టీడీఎస్, ఆర్బీఐ కంప్లయెన్స్ ఫీజుల పేరుతో విడతలవారీగా డబ్బుల వసూలు చేసి నట్టు అధికారులు తెలిపారు. ఈజీ లోన్ ఆశ చూపి ఆధార్, పాన్, బ్యాంక్ వివరాలు సేకరించి ఆపై ఖాతాల్లోకి డబ్బుల బదిలీ చేస్తారు. దీంతో మోసపూరిత లావాదేవీల్లో బ్యాంక్ ఖాతాలు సమకూర్చిన నలుగురు వ్యక్తులను మల్కాజిగిరి పోలీసులు అరెస్ట్ చేశారు. వనపర్తి జిల్లాకు చెందిన నలుగురు నిందితుల పోలీసులు అరెస్ట్. చేశారు. మరో ఇద్దరు బీహార్‌కు చెందిన నిందితులు పరారీలో ఉన్నారు.
కొందరు కమీషన్ కోసం బ్యాంక్ ఖాతాలు ఇచ్చినట్లు ఆరోపణలు వస్తున్నాయి. దీంతో మోసపోయిన సొమ్మును నిందితులు బదిలీ చేసుకున్నట్టు పోలీసులు గుర్తించారు. ఢిల్లీ, బీహార్‌కు వెళ్లి తెలుగు మాట్లాడే లోన్ దరఖాస్తుదారులను టార్గెట్ చేసిన ముఠా రుణాల పేరుతో ముందస్తు ఫీజులు అడిగితే అప్రమత్తంగా ఉండాలని పోలీసుల తెలిపారు. సైబర్ మోసమైతే 1930కు ఫోన్ చేయాలని పోలీసుల హెచ్చరికలు చేశారు.
Also Read: బిందె పాటలకి ఈ క్రేజ్ ఏంటి మావా ..మాధురి రాథోడ్ నుండి యమునా తారక్ దాకా !