Tollywood: హీరోగా తన కెరీర్ మొదలుపెట్టి ఆ తర్వాత విలన్ మారి మళ్లీ హీరోగా సత్తా చాటుతూ దూసుకుపోతున్న హీరో గోపీచంద్ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. గత కొంతకాలంగా సరైన సక్సెస్ కోసం ఎదురుచూస్తున్న ఈయన తాజాగా వరుస చిత్రాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం కొత్త కథలతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమవుతున్నారు. ఈ క్రమంలోనే సంకల్ప్ రెడ్డి తెరకెక్కిస్తున్న ‘భరత వర్ష’ చిత్రంలో నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా దృశ్యాలకి కూడా ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది.
అయితే ఈ సినిమా షూటింగ్ ఒకవైపు జరుగుతుండగానే.. అప్పుడే మరో నూతన దర్శకుడు కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. గోపీచంద్ కుమార్ సాయితో కలిసి మరో చిత్రానికి సిద్ధమయ్యారు. ఈ సినిమా షూటింగ్లో ఎక్కువ భాగం విదేశాలలో జరగనుంది. సీనియర్ నిర్మాత బీ.వీ.ఎస్.ఎన్ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఈ రెండు చిత్రాల షూటింగ్లలో బిజీగా ఉండగానే అప్పుడే మరో చిత్రానికి గోపీచంద్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రముఖ స్టంట్ మాస్టర్ వెంకట్ దర్శకుడిగా పరిచయం అవుతూ తెరకెక్కుతున్న ఒక చిత్రానికి గోపీచంద్ హీరోగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు.
యాక్షన్ ప్రధానంగా సాగే ఈ చిత్రానికి ప్రముఖ సంగీత దర్శకుడు సామ్ సీ ఎస్ సంగీతం అందించనున్నట్లు సమాచారం. ముఖ్యంగా పలువురు సాంకేతిక నిపుణులు కూడా ఈ ప్రాజెక్టులో భాగం అవుతున్నారు. పైగా మే 3 తేదీన హైదరాబాదులోని రామానాయుడు స్టూడియోలో ఘనంగా ప్రారంభం కానుంది. త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వెలువడనుంది. ఏదేమైనా ఇప్పటికే రెండు చిత్రాలతో బిజీగా మారిన ఈయన ఇప్పుడు మరో చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అభిమానులు ఆశ్చర్యపోతున్నారు. వరుస చిత్రాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి గోపీచంద్ సిద్ధమవుతున్నారు. మరి ఈసారైనా సక్సెస్ లభిస్తుందా అనే కామెంట్లు అర్థమవుతున్నాయి.
also read:ఆస్కార్ కొత్త రూల్స్.. నటులకు గుడ్ న్యూస్!
నిజానికి ఈ మధ్యకాలంలో వరుసగా పలు చిత్రాలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. కానీ అనుకున్నంత స్థాయిలో హిట్ లభించలేదు. ఒకవేళ మంచి హిట్టు కనక ఒకటి ఆయన ఖాతాలో పడిందంటే మళ్ళీ తిరిగి పుంజుకోవడం గ్యారెంటీ అని అభిమానులు కూడా కామెంట్ చేస్తున్నారు. గోపీచంద్ కెరియర్ విషయానికి వస్తే.. ప్రముఖ దర్శకుడు టి కృష్ణ కుమారుడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. తొలివలపు సినిమాతో నటన ప్రస్తానాన్ని ప్రారంభించిన ఈయన.. ఆ తర్వాత నిజం, జయం ,వర్షం వంటి చిత్రాలలో విలన్ పాత్రలు పోషించిన ఈయన యజ్ఞం సినిమాతో హీరోగా మారి మంచి విజయాలను సొంతం చేసుకున్నారు.. ఇకపోతే గత కొంతకాలంగా వరుస సినిమాలలో నటిస్తున్నారు. కానీ సరైన విజయం ఆయనను వరించలేదు. ముఖ్యంగా ఆక్సిజన్, పంతం, చాణిక్య, సిటీ మార్ , ఆరడుగుల బుల్లెట్టు, పక్కా కమర్షియల్, రామబాణం, భీమా , విశ్వం ఇలా ఈ మధ్యకాలంలో వచ్చిన ప్రతి సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద నిరాశపరిచింది. కనీసం ఈ ప్రాజెక్టులతో నైనా ఈయన మంచి సక్సెస్ అందుకుంటాడేమో చూడాలి.