E-Paper
Advertisement
బిగ్ టీవీ ఇప్పుడు మలయాళంలో
ఓపెన్

40 ఏళ్ల బంధం, లెక్కలేనన్ని అఫైర్స్.. ఆభయంతోనే సైలెంట్‌గా ఉన్నానన్న గోవిందా భార్య!

40 ఏళ్ల బంధం, లెక్కలేనన్ని అఫైర్స్.. ఆభయంతోనే సైలెంట్‌గా ఉన్నానన్న గోవిందా భార్య!
Advertisement

Govinda Controversy: గోవిందా.. బాక్సాఫీస్ వద్ద కపూర్స్,ఖాన్ల త్రయానికి గట్టి పోటీ ఇస్తూ, తనదైన స్టైల్ డాన్సులతో,అదిరిపోయే కామెడీ టైమింగ్ తో ఒక వెలుగు వెలిగాడు గోవిందా.అలా ఆడియన్స్ లో మంచి క్రేజ్ తెచ్చుకున్న గోవిందా పర్సనల్ లైఫ్ మాత్రం ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో వార్తల్లో హైలైట్ అవుతూనే ఉంది.ముఖ్యంగా ఆయన భార్య సునీత అహుజాతో ఉన్న వివాహ బంధం గురించి గత కొన్నేళ్లుగా బీ టౌన్ లో రకరకాల గాసిప్స్ తెగ సర్క్యులేట్ అవుతున్నాయి.

అయితే తాజాగా టెలికాస్ట్ అవుతున్న ‘లాకప్ 2: సచ్ యే సజా’ అనే రియాల్టీ షో ద్వారా వీరిద్దరి వ్యక్తిగత జీవితంలోని చేదు నిజాలు మరోసారి బయటపడ్డాయి.జూన్ 27న గ్రాండ్ గా లాంచ్ అయిన ఈ షో కి రా ఖాన్, రితేష్ దేశ్‌ముఖ్ హోస్ట్ లుగా వ్యవహరిస్తుండగా మొత్తం 15 మంది కంటెస్టులు పాల్గొన్నారు.ఇందులో భాగంగా నాలుగవ ఎపిసోడ్లో తోటి కంటెస్టెంట్ శ్రేయా కల్రా అడిగిన కొన్ని ప్రశ్నలకు సునీత ఆహుజా ఇచ్చిన సమాధానాలు ఇప్పుడు మీడియాలో వైరల్ అవుతున్నాయి.గోవిందా సునీతల ప్రేమ కథ విషయానికొస్తే వీళ్ళ లవ్ స్టోరీ ప్రారంభమైంది 1980 లలో .

నాలుగేళ్లపాటు బయట ప్రపంచానికి తెలియకుండా

Advertisement

అప్పట్లో పీక్ స్టేజ్ లో ఉన్న గోవిందా తనకు పెళ్లయిన విషయం తెలిస్తే అమ్మాయిలలో ఫాలోయింగ్ తగ్గిపోతుందని భావించి 1985లో సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాడు.అయినప్పటికీ దాదాపు నాలుగేళ్లపాటు ఈ విషయాన్ని బయట ప్రపంచానికి తెలియకుండా దాచి పెట్టడం గమనార్హం.ఇక ఆ తర్వాత వీరి కుమార్తె టీనా అహుజా  పుట్టిన తర్వాత మేమిద్దరం భార్యాభర్తలం అంటూ అఫీషియల్ గా అనౌన్స్ చేశారు .

గోవిందా స్టార్ హీరో కావడం వల్లే 

అయితే ఆ సమయంలో అంతా బాగున్నా బాగుంది అనుకున్నప్పటికీ  వెనకాల కథ వేరేలా సాగింది.తాజాగా రియాల్టీ షోలో సునీత మాట్లాడుతూ తమ బంధంలో మొదటి నుంచి నమ్మకద్రోహం ఉంటూనే ఉందని కొండలు బద్దలు కొట్టేసింది.గోవిందా స్టార్ హీరో కావడం వల్ల ఆ విషయాలు తెలిసిన ఏమి చేయలేకపోయానని, ఇక ఈ వయసులో వాటి గురించి ఆలోచిస్తే డయాబెటిస్ మరింత ఎక్కువ అవుతుందని బాధపడిపోయింది .

Advertisement

Also read :యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

పిల్లల భవిష్యత్తు కోసమే తను ఇన్నాళ్లు భరిస్తూ బతికానని చెప్పుకొచ్చింది.ఇక గోవిందా కు ఇప్పటికీ వివాహేతర సంబంధాలు ఉన్నాయా అనే ప్రశ్నకి స్పందిస్తూ ఒక మనిషిని 24 గంటలు కనిపెట్టుకుండలేమని,అలా చేస్తే అవతలి వ్యక్తికి చిరాకు వస్తుందని చెప్పుకొచ్చింది .

కాంట్రవర్సీలకి కేరాఫ్ అయిన గోవిందా పర్సనల్ లైఫ్

40ఏళ్ల  క్రితం నాటి పరిస్థితులను గుర్తు చేసుకుంటూ ఆ రోజుల్లో ఇలాంటి ఇల్లీగల్ రిలేషన్స్ గురించి ఎవరి పెద్దగా పట్టించుకునే వారు కాదని ,అందువల్లే గోవిందా లెక్కలేనన్ని ప్రేమాయణాలు నడిపించుకొచ్చాడని సెన్సేషన్ కామెంట్స్ చేసింది .అయితే చనిపోయే వరకు ఆ ఇంటిని వదిలి వెళ్ళకూడదని అన్ని మౌనంగా  భరించాలని పెద్దలు చెప్పడం వల్లే ఇన్నాళ్లు ఓపికగా ఉన్నానని తెలిపింది.

గత ఏడాదిలో ఆగస్టులో సునీతహుజా కోర్టులో విడాకుల పిటిషన్ దాఖలు చేయడం, అందులో శారీరక ,మానసిక వేధింపుల తో పాటు అక్రమ సంబంధాల ప్రస్థావన  తీసుకురావడం అప్పట్లో సెన్సేషన్ క్రియేట్ చేసింది .ఒకప్పుడు ‘కూలీ నెం. 1’, ‘హీరో నెం. 1’ లాంటి బ్లాక్ బస్టర్ చిత్రాలతో ఫ్యామిలీ ఆడియన్స్ కి  ఫేవరెట్ గా నిలిచిన గోవిందా పర్సనల్ లైఫ్ ఇలా కాంట్రవర్సీలకి కేరాఫ్ కావడం అభిమానులను పూర్తిగా డిసప్పాయింట్ చేసిందనే చెప్పాలి.

Related News

రౌడీ హీరోతో కోల్డ్ వార్.. మూడేళ్ల తర్వాత నోరు విప్పిన అభిషేక్ నామా!

ఎస్పీబీని ఇళయరాజా అంతలా ఎందుకు హర్ట్ చేశారు? నిజాలు బయటపెట్టిన ఎస్పీ చరణ్!

Nagabandham Twitter Review : ‘ నాగబంధం ‘ ట్విట్టర్ రివ్యూ.. అడ్వెంచర్ ఎలా ఉందంటే..?

ఆ యాంగిల్లో ఫొటోలా? లైవ్‌లోనే కెమెరామెన్లకు క్లాస్ పీకిన స్టార్ హీరోయిన్!

యూట్యూబ్‌లో మిలియన్ల వ్యూస్.. వెండితెరపై హీరోయిన్ ఛాన్స్.. అయినా దానికి నో చెప్పిన నాగదుర్గ!

కన్నడలో మరో సెన్సేషనల్ థ్రిల్లర్.. వైరల్ అవుతున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ కౌంట్‌డౌన్ పోస్టర్!

జైలర్ 2 రిలీజ్ డేట్ లాక్.. మేకర్స్ మాస్టర్ ప్లాన్ అదుర్స్!

Big Stories

×