Nagadurga :నాగ దుర్గ… తెలుగు డిజిటల్ వరల్డ్ లో తనదైన ఫోక్ బిట్స్ తో దుమ్ము రేపే ఈ యూట్యూబ్ సెన్సేషన్ ఇప్పుడు సోషల్ మీడియాను దాటి సిల్వర్ స్క్రీన్ పై సత్తా చూపడానికి రెడీ అయిపోయింది. ‘కాపోళ్ల ఇంటికాడ’, ‘ఎర్ర ఎర్రని రుమాలు గట్టి’, ‘తిన్న తిరం పడ్తలే’, ‘దారి పొంటొత్తుండు’, ‘జిల్లెలమ్మ జిట్ట’, ‘పేరు గళ్ల పెద్దిరెడ్డి’ అంటూ ఇలా ఎన్నో ఫోక్ సాంగ్స్ కి ఆమె వేసిన ఉరమాస్ స్టెప్పులు యూట్యూబ్ ని ఎలా షేక్ చేశాయో చెప్పక్కర్లేదు.
ఆ పాటలన్నీ మిలియన్లకు కొద్దిగా వ్యూస్ కొల్లగొట్టడం తో నాగ దుర్గ స్టార్ డమ్ సంపాదించేసింది.అయితే ఈ తెలంగాణ పల్లెటూరి అమ్మాయికి ఇప్పుడు టాలీవుడ్ లో బంపర్ ఆఫర్ దక్కింది .ఎస్… ప్రముఖ నిర్మాణ సంస్థలు సుకుమార్ రైటింగ్స్ బన్నీ వాసు కలిసి నిర్మిస్తున్న సినిమాలో నాగ దుర్గ హీరోయిన్ గా నటిస్తోంది ప్రియదర్శికి జోడీగా శ్రీలత అనే పక్కా రూరల్ తెలంగాణ అమ్మాయి పాతలో కనిపించబోతుంది నాగ దుర్గ.మొత్తానికి ఫోక్ ఆర్టిస్ట్ గా ఎంతో మందిని అలరించిన ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పై తన అదృష్టాన్ని పరీక్షించుకోబోతుంది అన్నమాట.
అయితే ఇదిలా ఉండగా ప్రస్తుతం నాగ దుర్గ సంబంధించిన ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.టీవీలో మోస్ట్ పాపులర్ అయిన రియాల్టీ షో బిగ్ బాస్ టీవీ నుంచి నాగదుర్గకు భారీ ఆఫర్ వచ్చినట్టు తెలిసింది .ఇదే విషయమై ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో నాగదుర్గ స్వయంగా ఈ విషయాన్ని చెప్పుకొచ్చింది .
బిగ్ బాస్ ఆఫర్ వస్తే ఎందుకు రిజెక్ట్ చేశారు,షో ని చూసి ఏమైనా భయపడ్డారా అన్న ప్రశ్నకి సమాధానంగా ఆ షో అంటే నాకెలాంటి భయం లేదని కానీ ఆ హౌస్ వాతావరణానికి తాను సెట్ కాననే ఉద్దేశంతోనే వెళ్లలేదని కుండబద్దలు కొట్టేసింది.నిజానికి తను చాలా సైలెంట్ అని ,అతిగా మొహమాట పడే మనస్తత్వం కారణంగా ఆ నిర్ణయం తీసుకున్నానని తెలిపింది .ఎవరికైనా మొహం మీద నో చెప్పడం తన చేతకాదని, ఎప్పుడైనా తన ఫీలింగ్స్ కంటే ఎదుటివారి ఫీలింగ్స్ కి ఇంపార్టెన్స్ ఇస్తానని చెప్పుకొచ్చింది .
వాళ్ళు ఎక్కడ బాధపడతారు అని ఆలోచించే గుణం వల్లే కొన్నిసార్లు తాను నలిగిపోయానని, కొన్ని పరిస్థితులలో ఇతరులను కాదన లేక రూమ్ లోకి వెళ్లి ఇచ్చిన సందర్భాలు చాలా ఉన్నాయని ఎమోషనల్ అయిపోయింది నాగ దుర్గ.ఇక బిగ్ బాస్ ఆఫర్ వచ్చినప్పుడు ఇంట్లో వాళ్ళు చాలా సపోర్ట్ చేశారని తెలిపింది.అయితే చిన్న చిన్న విషయాలకే నువ్వు అంత పెద్ద హౌస్ లో గొడవలు ఎలా తట్టుకుంటావో ఆలోచించుకోమని అమ్మ సలహా ఇచ్చిందని, ఒకవేళ తను కనుక వెళ్తానంటే వద్దనేదని కాదని తెలిపింది ఇక నాన్న అయితే కచ్చితంగా షో కి వెళ్లాల్సిందే అని ఎంకరేజ్ చేశారని చెప్పుకొచ్చింది.
అందులో రెండు మూడు వారాలు ఉన్నా ఆడియన్స్ కి మరింత బాగా రీచ్ అవుతావని ధైర్యం చెప్పినట్లు తెలిపింది .అయితే కుటుంబ సభ్యులంతా వెనుక ఉన్నప్పటికీ తన లైఫ్ టార్గెట్ వేరే ఉండటం వల్ల బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వలేదని క్లారిటీ ఇచ్చేసింది ఇక ప్రస్తుతం తన పూర్తి ఫోకస్ సినిమాలపైనే ఉందని హీరోయిన్ గా మంచి గుర్తింపు తెచ్చుకోవాలని లక్ష్యంతో ఉన్నానని తెలిపింది . సోషల్ మీడియా స్టార్ నుంచి మారుతున్న నాగదుర్గ మొత్తానికి ఇలాంటి డివియేషన్స్ లేకుండా సినిమా కెరీర్ నె సీరియస్ గా తీసుకుంటుందన్న క్లారిటీ వచ్చేసింది. చూడాలి మరి ఇడుపు కాయితం సినిమాతో నాగ దుర్గ సిల్వర్ స్క్రీన్ పై ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందో!