BigTV English
Advertisement

Samantha: సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టిన సామ్… ముహూర్తం కూడా ఫిక్స్?

Samantha: సైలెంట్ గా పెళ్లి పనులు మొదలుపెట్టిన సామ్… ముహూర్తం కూడా ఫిక్స్?

Samantha: సమంత(Samantha) పరిచయం అవసరం లేని పేరు.ఈమె వృత్తిపరమైన, వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే అని చెప్పాలి. ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టి ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా కెరియర్ పరంగా ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో ఓ వెలుగు వెలికిన సమంత ప్రస్తుతం తన వ్యక్తిగత కారణాల వల్ల సినిమాలను కాస్త తగ్గించారని చెప్పాలి.. ఇలా సమంత కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె ఏ మాయ చేసావే సినిమా ద్వారా హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయమయ్యారు. ఈ సినిమాలో నటుడు నాగచైతన్య(Nagachaitanya) నటించిన సంగతి తెలిసిందే.


నాగచైతన్యతో విడాకులు..

ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోవడమే కాకుండా వీరిద్దరూ కూడా ఈ సినిమా సమయంలోనే ప్రేమలో పడటం అనంతరం ఇద్దరి కాంబినేషన్లో ఎన్నో అద్భుతమైన సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. ఇలా కొంత కాలం పాటు ప్రేమలో ఉన్న ఈ జంట ఎట్టకేలకు తమ ప్రేమ విషయాన్ని బయటపెట్టి పెద్దల సమక్షంలో ఎంతో ఘనంగా హిందూ, క్రిస్టియన్ సాంప్రదాయ ప్రకారం పెళ్లి చేసుకున్నారు. దాదాపు ఏడు సంవత్సరాల పాటు ప్రేమలో ఉన్న ఈ జంట పెళ్లైన మూడు సంవత్సరాలకి వ్యక్తిగత విభేదాల కారణంగా విడాకులు(Divorce) తీసుకుని విడిపోయారు. ఇలా సమంత నుంచి నాగచైతన్య విడిపోయిన తర్వాత ఆయన శోభిత(Sobhita) అనే మరొక హీరోయిన్ తో ఏడడుగులు నడిచారు.


రెండో పెళ్లికి సిద్ధమైన సమంత..

సమంత ఇప్పటివరకు రెండో పెళ్లి చేసుకోకపోయినా ఈమె తరచూ వార్తలలో నిలుస్తున్నారు. ముఖ్యంగా ది ఫ్యామిలీ మెన్ డైరెక్టర్ రాజ్ నిడుమోరుతో(Raj Nidumoru) కలిసి ఈమె చాలా క్లోజ్ గా కనిపిస్తున్న నేపథ్యంలో వీరిద్దరూ రిలేషన్ లో ఉన్నారు అంటూ వార్తలు బయటకు వచ్చాయి. ఈ వార్తలకు అనుగుణంగానే ఇద్దరు కలిసి వెకేషన్ లోకి వెళ్లడం చాలా చనువుగా ఒకరిపై మరొకరు చేతులు వేసుకొని బహిరంగంగా తిరుగుతూ కనిపించడంతో వీరిద్దరి మధ్య ఉన్నది స్నేహం కాదని, అంతకుమించి ఏదో రిలేషన్ ఉంది అంటూ అభిమానులు భావిస్తున్నారు.

నాగచైతన్యకు ఊహించని షాక్…

ఇదిలా ఉండగా తాజాగా సమంతకు సంబంధించి మరొక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సమంత సైలెంట్ గా డేటింగ్ చేయడమే కాకుండా రెండో పెళ్లి(Second Marriage) పనులను కూడా మొదలుపెట్టారు అంటూ ఓ వార్త బయటకు వచ్చింది. ప్రస్తుతం ఈమె రెండో పెళ్లి పనులలో బిజీగా ఉన్నారని అయితే తన రెండో పెళ్లిని చర్చిలో చేసుకునే విధంగా ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇక సమంత రెండో పెళ్లి తేది కూడా ఫిక్స్ అయిందని తెలుస్తుంది. అక్టోబర్ 6వ తేదీని సమంత రెండో పెళ్లి కూడా చేసుకోబోతుందని సమాచారం. ఇలా ఈమె పెళ్లి తేదీ విన్న అభిమానులు ఒక్కసారిగా ఖంగుతిన్నారు. గతంలో నాగచైతన్యను కూడా ఈమె అక్టోబర్ ఆరో తేదీన వివాహం చేసుకున్నారు. ఈ క్రమంలోనే తన మొదటి పెళ్లి తేదీనే రెండో పెళ్లి తేదీగా ఫిక్స్ చేసుకొని నాగచైతన్యకు షాక్ ఇవ్వబోతున్నారని తెలుస్తుంది. మరి సమంత రెండో పెళ్లి గురించి వస్తున్న వార్తలలో ఎంతవరకు నిజం ఉంది అనేది తెలియాలి అంటే సమంత లేదా డైరెక్టర్ రాజ్ స్పందించాల్సి ఉంది.

Also Read: Nithya Menen:  చేతి గోళ్ళలో పేడ.. నేషనల్ అవార్డు అందుకున్న నిత్యామీనన్!

Related News

Allu Aravind: సరైనోడు 2 అప్డేట్ ఇచ్చిన అల్లు అరవింద్.. ఎప్పుడొచ్చినా సరే అంటూ!

Dulquer Salman: పెళ్లిలో ఫుడ్ పాయిజన్..  దుల్కర్ సల్మాన్ కు నోటీసులు?

Dheeraj Mogilineni: ఇద్దరు ఆడపిల్లలతో రాహుల్ కష్టాలు.. బంపర్ ఆఫర్ ప్రకటించిన నిర్మాత

Mithra Mandali: ఓటీటీకి వస్తున్న మిత్రమండలి.. ఎక్కడ చూడొచ్చు అంటే

NTR: ఎన్టీఆర్ డెడికేషన్ కి సినీ లవర్స్ ఫిదా.. అందుకే గ్లోబల్ యాక్టర్!

Peddi: చికిరి హుక్ స్టెప్ బావుంది.. కాపీ కొట్టకుండా ఒరిజినల్ అయ్యి ఉంటే ఇంకా బావుండేది

Dies Irae Trailer : ‘డీయస్ ఈరే’ ట్రైలర్ వచ్చేసింది.. మిస్టరీ థ్రిల్లర్ సీన్ల తో థియేటర్లు దద్దరిల్లాల్సిందే..

Salman Khan: సల్మాన్ ఖాన్ కు లీగల్ నోటీసులు.. ఎప్పుడూ డబ్బేనా.. ప్రాణాలతో పనిలేదా?

Big Stories

×