BigTV English

Nithya Menen:  చేతి గోళ్ళలో పేడ.. నేషనల్ అవార్డు అందుకున్న నిత్యామీనన్!

Nithya Menen:  చేతి గోళ్ళలో పేడ.. నేషనల్ అవార్డు అందుకున్న నిత్యామీనన్!

Nithya Menen: నిత్యామీనన్ (Nithya Menen)అలా మొదలైంది అనే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు హీరోయిన్గా పరిచయమయ్యారు. తన మొదటి సినిమాతోనే ఎంతో మంచి సక్సెస్ అందుకున్న ఈమె తదుపరి తెలుగు, తమిళ, మలయాళ భాషలలో సినిమాలు చేస్తూ కెరియర్ పరంగా బిజీ అయ్యారు. ఇక త్వరలోనే నిత్యమీనన్ కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ (Danush)తో కలిసి నటించిన “ఇడ్లీ కడాయి”(Idly Kadai) అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉన్నారు. అయితే ఇదివరకే వీరిద్దరి కాంబినేషన్లో తిరు సినిమా(Tiru Movie) ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుకున్న సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి ఈ కాంబినేషన్లో సినిమా రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి.


తిరు సినిమాకు నేషనల్ అవార్డు…

ఇక ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఒక కార్యక్రమంలో భాగంగా నిత్యమీనన్ తిరు సినిమాకు సంబంధించిన విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ సినిమాలో నిత్యమీనన్ నటనకు గాను ఏకంగా నేషనల్ అవార్డు(National Award) వచ్చిన సంగతి తెలిసిందే. అయితే నేషనల్ అవార్డు అందుకున్న సంఘటనల గురించి తాజాగా ఈమె అభిమానులతో పంచుకున్నారు. ఇడ్లీ కడాయి సినిమా షూటింగ్ సమయంలో నాకు ఎన్నో కొత్త అనుభవాలు ఎదురయ్యాయని తెలియజేశారు.


పిడకలు వేశాను..

ఈ సినిమా షూటింగ్లో భాగంగా అక్కడి వాతావరణం అలాగే, పాత్రల మధ్య బంధం నాకు చాలా కొత్తగా అనిపించిందని తెలిపారు. ఈ సినిమాలోకి తాను పక్కా పల్లెటూరి అమ్మాయిగా కనిపించబోతున్నానని నిత్యామీనన్ తెలిపారు . ఇక ఈ సినిమాలో తాను పిడకలు కూడా వేశానని వెల్లడించారు.. అయితే ఓ రోజు షూటింగ్లో భాగంగా పిడకలు వేయమని డైరెక్టర్ చెప్పడంతో తాను పిడకలు వేశానని, ఇలా పిడకలు చేసినందుకు తనకు ఎలాంటి మొహమాటం కూడా కలగలేదని నిత్యామీనన్ వెల్లడించారు. ఇలా ఆ రోజు మొత్తం షూటింగ్ లొకేషన్లో పిడకలు వేశానని అయితే మరుసటి రోజు తనకు తిరు సినిమాకు గాను నేషనల్ అవార్డు వచ్చిందనే విషయం తెలిసి ఎంతో సంతోషపడ్డానని నిత్యామీనన్ అప్పటి  సంఘటనలను గుర్తు చేసుకున్నారు.

చేతి గోళ్లలో ఆవుపేడ…

నిజం చెప్పాలంటే తాను నేషనల్ అవార్డు అందుకున్న సమయంలో కూడా నా చేతి గోళ్లలో ఆవు పేడ (Cow Dug)అలాగే ఉంది అంటూ ఈ సందర్భంగా నిత్యామీనన్ చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమాలో నిత్యమీనన్ నటనకు ఈ అవార్డు రావడంతో  అసలు ఈమె నటనకు అవార్డు రావడం ఏంటి అంటూ చాలామంది విమర్శలు కూడా కురిపించారు. ముఖ్యంగా తిరు సినిమాలో నిత్యమీనన్ కాస్త శరీర బరువు పెరగడంతో ఎన్నో విమర్శలు వచ్చాయి కానీ ఈమె మాత్రం నటనకు శరీరం బరువుకు ఏమాత్రం సంబంధం లేదని మనలో టాలెంట్ ఉంటే చాలు అంటూ తన నటన ద్వారా సినిమాలో నటించి ఏకంగా నేషనల్ అవార్డు అందుకున్నారు. ఇక ఇడ్లీ కడాయి సినిమా అక్టోబర్ ఒకటో తేదీ ప్రపంచవ్యాప్తంగా విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమాకు ధనుష్ స్వయంగా దర్శకత్వం వహించటం విశేషం.

Also Read: HHVM Pre Release Event: నా దగ్గర గూండాలు లేరు… గుండెల్లో మీరు మాత్రమే ఉన్నారు!

Related News

Kantara: కాంతారా నటులను ఆ శాపమే వెంటాడుతుందా? వరస మరణాల వెనుక ఆంతర్యం ఇదేనా ?

Mouni Roy: బ్యాక్ గ్రౌండ్ ఉంటేనే అవకాశాలు.. మరోసారి కెలికిన నాగిని!

Cine Workers Strike : ఆమరణ దీక్షకు రెడీ… సినీ కార్మికులను ఎవరూ ఆపలేరా ?

Weapons Movie : హెవీ హాంటెడ్ సీన్స్… థియేటర్లలో జనాలను పరుగులు పెట్టిస్తున్న ఇంగ్లీష్ మూవీ

Chiranjeevi: ఫెడరేషన్ సభ్యులు నన్ను కలవలేదు.. తప్పుడు ప్రచారాలను ఆపండి.. ఫైర్ అయిన చిరు

kaantha Movie: పసి మనసే.. వినదసలే.. కాంత మెలోడి సాంగ్ వచ్చేసింది.. విన్నారా?

Big Stories

×